girl arrested
-
బాలుడిపై లైంగిక దాడి.. యువతి అరెస్టు
కేరళలో ఘోరం జరిగింది. 17 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఓ యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమెపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితురాలిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. కేరళలోని కొట్టాయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాలుడితో ప్రేమాయణం నడిపించి, అతడి ఇంట్లోనే ఆమె ఉంటున్నట్లు తెలిసింది. తన కొడుకు మీద ఆమె లైంగిక దాడి చేసిందని బాలుడి తల్లి చేసిన ఫిర్యాదుతో విషయం వెలుగు చూసింది. ఫిర్యాదు అందుకున్న రామాపురం పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి తలుపు కొట్టగా, వాళ్లిద్దరూ బయటకు వచ్చేందుకు నిరాకరించారు. దాంతో పోలీసులు తలుపులు పగలగొట్టి ఆ ఇంట్లోకి వెళ్లి ఆమెను అరెస్టు చేశారు. బాలుడిని జువైనల్ జస్టిస్ బోర్డుకు పంపారు. ఎర్నాకులం ప్రాంతానికి చెందిన ఆ యువతిని కొట్టాయం జిల్లా పాల లోని జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టగా ఆమెకు జ్యుడిషియల్ కస్టడీ విధఙంచారు. ఫేస్బుక్ పరిచయంతో వాళ్లిద్దరి మధ్య ప్రేమ మొదలైనట్లు తెలిసింది. ఎవరైనా బాలలపై లైంగిక వేధింపులకు పాల్పడితే వారిని పోక్సో చట్టం కింద అరెస్టు చేస్తారు. ఇంతవరకు ఎక్కువగా పురుషులే ఈ చట్టం కింద అరెస్టయ్యారు గానీ, మహిళలు అరెస్టయినట్లు ఎక్కడా పెద్దగా తెలియరాలేదు. అలాంటిది అక్షరాస్యతలో అగ్రస్థానంలో ఉన్న కేరళ రాష్ట్రంలో ఇలాంటి కేసు నమోదు కావడం గమనార్హం. -
ప్రియుడి నగ్న ఫొటోలతో రూ. కోటి డిమాండ్
చెన్నై: ఏకాంతంగా గడిపిన సమయంలో తీసిన ఫొటోలను చూపి రూ. కోటి ఇవ్వాలని ఓ యువతి తన ప్రియుడిని డిమాండ్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తమిళనాడులోని నామక్కల్ జిల్లా, రాశిపురం ప్రాంతానికి చెందిన ప్రేమ్ కుమార్(26) బెంగళూరులోని ఓ ఐటీ సంస్థలో పని చేస్తున్నాడు. ఇతనికి బెంగళూరుకు చెందిన అర్చన (22) తో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడి.. అది ప్రేమగా మారింది. ఇరువురూ కొంతకాలం ఆనందంగా గడిపారు. ఆ సమయంలో ప్రేమ్‌కుమార్ నగ్నంగా ఉన్నపుడు అర్చన ఫొటోలు తీసింది. వాటిని చూపి ప్రియుడి వద్ద నుంచి లక్షల రూపాయలు వసూలు చేసింది. అంతటితో ఆగకుండా తనపై ప్రేమ్ కుమార్ అత్యాచారం చేసినట్టు రాశిపురం మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. దీంతో ఇరువురి మధ్య ఒప్పందం కుదిర్చిన పోలీసులు ప్రేమ్ నుంచి రూ. 4 లక్షలను అర్చనకు ఇప్పించారు. అయినా అర్చన ఇంకా డబ్బులు కావాలని బెదిరింపులకు దిగింది. రూ. కోటి రూపాయలు ఇవ్వకపోతే ఫొటోలు బయటపెడతానంటూ బెదిరించింది. దీంతో ప్రేమ్ కుమార్ పోలీసులు ఫిర్యాదు చేయడంతో యువతి అరెస్టు చేశారు. -
ఫేస్బుక్ వేధింపులు: యువతి అరెస్టు
స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్బుక్ అకౌంట్లు తెరిచి, వాళ్ల ఫొటోలతో అసభ్య సందేశాలు పోస్ట్ చేస్తూ వాళ్ల పరువు గంగలో కలుపుతున్న 22 ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టుచేశారు. మొత్తం ఎనిమిది మంది పేర్ల మీద నకిలీ ఫేస్బుక్ ఐడీలను ఆమె తెరిచింది. అయితే.. ఆమె ప్రాక్సీ సర్వర్లను ఉపయోగించి ఈ అకౌంట్లను క్రియేట్ చేయడంతో పోలీసులకు ఈ కేసు ఛేదించడం పెద్ద సవాలుగానే మారింది. ఎట్టకేలకు ఆమె ఆచూకీని తెలుసుకోగలిగినట్లు గోవా సైబర్ క్రైం ఎస్పీ కార్తీక్ కశ్యప్ తెలిపారు. ఈ నేరం చేయడానికి ఆమె ఉపయోగించిన పరికరాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆమెకు నకిలీ ఫేస్బుక్ అకౌంట్లు క్రియేట్ చేయడం అలవాటు. ఎవరూ తనను ట్రాక్ చేయకుండా ఉండేందుకు తెల్లవారుజామున ఈ నకిలీ ప్రొఫైళ్లు క్రియేట్ చేయడం, వాటిలో పోస్టింగులు అన్నీ చేసేదని, అసలు ఆమె ఇలా చేయడానికి గల కారణం ఏంటో చూస్తున్నామని కశ్యప్ చెప్పారు.