ప్రియుడి నగ్న ఫొటోలతో రూ. కోటి డిమాండ్
చెన్నై: ఏకాంతంగా గడిపిన సమయంలో తీసిన ఫొటోలను చూపి రూ. కోటి ఇవ్వాలని ఓ యువతి తన ప్రియుడిని డిమాండ్ చేయడం అందరినీ ఆశ‍్చర్యపరిచింది. తమిళనాడులోని నామక్కల్ జిల్లా, రాశిపురం ప్రాంతానికి చెందిన ప్రేమ్ కుమార్(26) బెంగళూరులోని ఓ ఐటీ సంస్థలో పని చేస్తున్నాడు. ఇతనికి బెంగళూరుకు చెందిన అర్చన (22) తో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడి.. అది ప్రేమగా మారింది. ఇరువురూ కొంతకాలం ఆనందంగా గడిపారు. ఆ సమయంలో ప్రేమ్‌కుమార్ నగ్నంగా ఉన్నపుడు అర్చన ఫొటోలు తీసింది. వాటిని చూపి ప్రియుడి వద్ద నుంచి లక్షల రూపాయలు వసూలు చేసింది.
అంతటితో ఆగకుండా తనపై ప్రేమ్ కుమార్ అత్యాచారం చేసినట్టు రాశిపురం మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది. దీంతో ఇరువురి మధ్య ఒప్పందం కుదిర్చిన పోలీసులు ప్రేమ్ నుంచి రూ. 4 లక్షలను అర్చనకు ఇప్పించారు. అయినా అర్చన ఇంకా డబ్బులు కావాలని బెదిరింపులకు దిగింది. రూ. కోటి రూపాయలు ఇవ్వకపోతే ఫొటోలు బయటపెడతానంటూ బెదిరించింది. దీంతో ప్రేమ్ కుమార్ పోలీసులు ఫిర్యాదు చేయడంతో యువతి అరెస్టు చేశారు.