ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, బంజారాహిల్స్: మద్యం మత్తులో దారికాచి ఓ స్కూటరిస్ట్‌ను బ్లేడ్‌తో బెదిరించి బలవంతంగా డబ్బులు లాక్కున్న ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని హైలైన్ కాంప్లెక్స్‌లో నివసించే ముస్తఫా హష్మి అనే వ్యాపారి ఆదివారం అర్ధరాత్రి విధులు ముగించుకొని తన బైక్‌పై బంజారాహిల్స్ రోడ్ నం. 12 ఎన్బీటీ నగర్ కమాన్ మీదుగా ఇంటికి వెళ్తున్నాడు. ఎన్బీటీ నగర్ కల్లు కంపౌండ్ వద్దకు రాగానే మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు హష్మిని బలవంతంగా ఆపాడు. డబ్బులు డిమాండ్ చేశాడు. లేవని చెప్పగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసభ్యకరంగా దూషిస్తూ బెదిరించాడు.
అంతటితో ఆగకుండా బ్లేడ్‌తో మెడ కోస్తానంటూ బెదిరించి బలవంతంగా జేబులో ఉన్న రూ. 5 వేలు లాక్కున్నాడు. డబ్బులు లాక్కున్నట్లు ఎవరికైనా చెబితే నిన్ను ఖతం చేస్తానంటూ బెదిరించాడు. ఈ ఘటన జరిగిన తర్వాత బెదిరించిన వ్యక్తి కోసం ఆరా తీయగా బంజారాహిల్స్‌రోడ్ నం. 12లోని భోలానగర్‌కు చెందిన అఫ్రిది అహ్మద్ అలియాస్ అజహర్‌గా తేలింది. ఈ మేరకు అఫ్రిది అహ్మద్‌పై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 341, 384, 506, 504ల కింద క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment