జూనియర్‌ ఆర్టిస్ట్‌ల ప్రేమాయణం.. నాలుగేళ్లు ఒకరితో.. నాలుగు నెలలు మరొకరితో.. | Hyderabad: Sketch with new boy friend for murder of ex boy friend | Sakshi
Sakshi News home page

Hyderabad: జూనియర్‌ ఆర్టిస్ట్‌ల ప్రేమాయణం.. నాలుగేళ్లు ఒకరితో.. నాలుగు నెలలు మరొకరితో సహజీవనం..

Published Tue, Nov 1 2022 7:58 AM | Last Updated on Tue, Nov 1 2022 7:58 AM

Hyderabad: Sketch with new boy friend for murder of ex boy friend - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, బంజారాహిల్స్‌: తాజా ప్రియుడితో కలిసి మాజీ ప్రియుడిని రెండో అంతస్తు నుంచి కిందకు తోసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో యువతీ, యువకులను బంజారాహిల్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.

వివరాల్లోకి వెళ్తే... శ్రీకాకుళం జిల్లాకు చెందిన తిరుమల్‌రెడ్డి సూర్యనారాయణ(30) సినిమాల్లో జూనియర్‌ ఆర్టిస్ట్‌గా పని చేస్తూ యూసుఫ్‌గూడ సమీపంలోని శ్రీకృష్ణానగర్‌లో నివాసం ఉంటున్నాడు. నాలుగేళ్ల క్రితం తనతో పాటు జూనియర్‌ ఆర్టిస్ట్‌గా పని చేస్తున్న నాగవర్ధినితో ఏర్పడ్డ పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరూ కలిసి సహజీవనం చేసేదాకా కొనసాగింది. అదే భవనంలో ఈ ఇద్దరూ కలిసి రెండో అంతస్తులో నాలుగేళ్లుగా నివాసం ఉంటున్నారు. నాలుగు నెలల క్రితం ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి.

చదవండి: ('నాన్నా అమ్మను రోజూ ఎందుకు కొడతావు.. మాతో ఎందుకు సంతోషంగా ఉండవు')

ఎవరికి వారు వేర్వేరుగా ఉండాలని నిర్ణయించుకొని ఈ మేరకు సూర్యనారాయణ అదే భవనంలో ఆమె నుంచి విడిపోయి నాల్గో అంతస్తులో కిరాయికి ఉంటున్నాడు. ఈ లోపు నాగవర్ధిని రాజమండ్రికి చెందిన మరో జూనియర్‌ ఆర్టిస్ట్‌ శ్రీనివాస్‌రెడ్డితో ప్రేమలో పడింది. ఇద్దరూ కలిసి గత నాలుగు నెలలుగా ఒకే గదిలో ఉంటున్నారు. ఈ విషయంపై సూర్యనారాయణ ఇటీవల ఆమెను నిలదీశాడు. శ్రీనివాస్‌రెడ్డితో సహజీవనం మానుకోవాలని తనతో పాటే ఉండాలని గొడవకు దిగేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి సూర్యనారాయణను ఆమె గదిలోకి వెళ్లగా శ్రీనివాస్‌రెడ్డి, నాగవర్ధిని ఇద్దరూ కనిపించడంతో వారితో గొడవపడ్డాడు.

మాటా మాటా పెరగడంతో వారిద్దరూ కలిసి సూర్యనారాయణను అదే అంతస్తు పైనుంచి కిందికి తోసేశారు. పక్కటెముకలు విరిగిపోయి ఓ ఎముక ఊపిరితిత్తుల్లో గుచ్చుకోవడంతో అతడి పరిస్థితి విషమించింది. బాధితుడిని పంజగుట్టలోని మురుగన్‌ ఆస్పత్రిలో బాధితుడిని చేర్నించగా ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. నిందితులు శ్రీనివాస్‌రెడ్డి, నాగవర్ధినిలను బంజారాహిల్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అప్పటికే నాగవర్ధినికి వివాహం జరిగినట్లు తేలింది. వీరిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

చదవండి: (ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రియుడితో పెళ్లి.. ఆ ఫోటోలను భర్తకు పంపి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement