
ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, హైదరాబాద్: హైదర్‌గూడలో విషాదం చోటుచేసుకుంది. నాగలతా రెడ్డి అనే వివాహిత గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సుధీర్ అనే వ్యక్తి తనను మోసం చేశాడని, డబ్బుల కోసం తనను శారీరకంగా వాడుకొని తన మోజు తీర్చుకున్నాడని సూసైడ్ నోట్‌లో పేర్కొంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దరాప్తు చేస్తున్నారు. మృతురాలు గత కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటూ.. సుధీర్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది.
చదవండి: (హైదరాబాద్‌లో ఫింగర్ ప్రింట్ సర్జరీ ముఠా గుట్టురట్టు)