living relation
-
హైదరాబాద్ నుంచి పారిపోయి కర్ణాటకలో సహజీవనం
సాక్షి, హైదరాబాద్: మైనర్ బాలికను ప్రేమ పేరుతో గర్భవతిని చేసిన ఓ మైనర్ బాలుడిని నాంపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఓ బాలుడు(17), బాలిక (16) మే నెలలో తమ తమ ఇళ్లల్లో నుంచి పారిపోయారు. కూతురు కనిపించకుండా పోవడంతో బాలిక తల్లిదండ్రులు నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు కర్ణాటకలో వారు ఉన్నట్లు గుర్తించారు. కాగా బాలిక అప్పటికే నాలుగు మాసాల గర్భవతి. బాధ్యుడైన మైనర్ బాలుడిపై పోక్సో యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి జువైనల్ హోమ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (చోరీ నెపంతో తల్లి ఎదుటే విద్యార్థిని చితకబాదిన ప్రిన్సిపాల్) -
అమ్మాయిలు అన్నీ చెప్పేస్తారు.. మోసపోయిన తర్వాత కానీ..
మోసం చేశాడని చేతుల్లో ముఖం దాచుకుంటే మోసపోయానని తనను తాను హింసించుకుంటే పోయిన కాలం తిరిగి రాదు... జీవితం కూడా. సాంకేతికత మన పురోగతికి సాధనం మాత్రమే. సాంకేతికత మన జీవితాన్ని నిర్దేశించే ఆయుధం కాదు. అది ప్రశ్నించి... పరిహసించే పరిస్థితికి లోనుకావద్దు. ‘అబ్బాయిల చేతిలో అమ్మాయిలు మోసపోతున్నారు’... ఈ మాట పందొమ్మిది వందల అరవైలలో ఉండేది, ఎనభైలలోనూ ఉండేది. ఇరవై ఒకటో శతాబ్దంలోనూ వింటున్నాం. ‘మోసపోతున్నది అమ్మాయిలేనా అబ్బాయిలు మోసపోవడం లేదా, మోసం చేస్తున్నది అబ్బాయిలేనా మోసం చేస్తున్న అమ్మాయిలు లేరా’ అనే కౌంటర్ వాదన కూడా అప్పుడూ ఉంది, ఇప్పుడూ ఉంది... తేడా అంతా మోసపోతున్న తీరులోనే. టెక్నాలజీ విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. సద్వినియోగంతో పాటు దుర్వినియోగమూ ఎక్కువైంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో వేగం వచ్చింది, మోసం చేయడం సులువైంది. సోషల్ మీడియా ఇద్దరి జీవితాలను నిర్దేశించే స్థాయికి వెళ్లిందంటే... ఆ తప్పు టెక్నాలజీది కాదు, టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలో తెలియని మనిషిదే. అమ్మాయిలు తమకు చట్టపరమైన రక్షణ ఉందా లేదా అనే ఆలోచన లేకుండా తమకు తాముగా జీవితాన్ని అభద్రతవలయంలోకి నెట్టివేసుకుంటున్నారని చెప్పారు సీనియర్ న్యాయవాది పార్వతి. ‘‘మా దగ్గరకు వచ్చే మహిళలనే గమనిస్తే... ఒకప్పుడు ఎక్కువ శాతం భర్త, అత్తింటి వారి నుంచి వేధింపులు, గృహహింస కారణాలతో వచ్చేవారు. ప్రేమ పేరుతో మోసం చేశాడని కూడా వచ్చేవారు. ఇప్పుడు ‘కొంతకాలం లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండి, ఇప్పుడు మొహం చాటేశాడనే కేసులు ఎక్కువయ్యాయి. ఇలాంటి కేసుల వివరాల్లోకి వెళ్తే ఆ ఇద్దరి మధ్య పరిచయానికి వేదిక సోషల్ మీడియానే అయి ఉంటోంది. ముఖాముఖి కలవడానికి ముందే ఒకరి గురించి ఒకరు అన్ని విషయాలనూ షేర్ చేసుకుని ఉంటున్నారు. సరిగ్గా ఇక్కడే అమ్మాయిలు గమనించాల్సింది, జాగ్రత్త పడాల్సిందీ. ఎందుకంటే... అబ్బాయిలు మాటల్లో పెట్టి అమ్మాయిల వివరాలన్నీ తెలుసుకుంటున్నారు, తన గురించిన వివరాలను చాలా జాగ్రత్తగా ఇస్తారు. అతడు మొహం చాటేశాక, అతడి గురించి ఈ అమ్మాయిలను ఏ వివరం అడిగినా తెల్లమొహం వేస్తారు. ‘అన్ని వివరాలనూ షేర్ చేస్తున్నామని చెప్పారు కదా, అతడి గురించి నువ్వు తెలుసుకున్న దేంటి?’ అని అడిగినప్పుడు అమ్మాయిలు చెప్పే వివరాల్లో అతడి అభిరుచులు, ఇష్టమైన క్రీడాకారులు, అతడు చూసిన సినిమాలు, జీవితం పట్ల అతడి ఆకాంక్ష లు, చదివిన పుస్తకాలు... ఇలా ఉంటుంది జాబితా. అతడి ఉద్యోగం, చదువు, ఊరు, అమ్మానాన్నలు ఎక్కడ ఉంటారు, అక్కచెల్లెళ్లు, అన్నదమ్ముల వివరాలు... ఏమీ చెప్పలేరు. ఒకవేళ అప్పటికే పెళ్లయిన వాడా అని కూడా తెలుసుకోరు. అతడు ఫోన్ నంబర్ మార్చేస్తే ఇక ఏ రకంగానూ అతడిని ట్రేస్ చేయలేని స్థితిలో ఉంటుంది పరిస్థితి. అమ్మాయిలు అన్నీ చెప్పేస్తారు! అమ్మాయిలు మాత్రం తనతో పాటు ఇంట్లో అందరి ఫొటోలు షేర్ చేయడం, ఇంటి అడ్రస్, అమ్మానాన్నల పేర్లు, ఉద్యోగం, బ్యాంకు బాలెన్స్, నగలు... అన్నీ చెప్పేసి ఉంటారు.‘పరిచయమైన వ్యక్తి ఫోన్ చేసి పలకరించేటప్పుడు చాలా సాధారణమైన మాట ‘భోజనం చేశావా’ అని అడిగితే దానిని తన మీదున్న కన్సర్న్ అని మురిసిపోతారు. తనకు సమయానికి అన్నం వండి పెట్టిన అమ్మ, తనకు అన్నీ అమర్చి పెడుతున్న నాన్న ఆ పనులన్నీ తన మీద ప్రేమతోనే చేస్తున్నారనే ఆలోచన రావడం లేదు. అతడి నుంచి ‘గుడ్‌నైట్’ మెసేజ్ వస్తుంది, దానికి అమ్మాయి నుంచి వెంటనే రిప్లయ్ వస్తే ‘ఇంకా నిద్రపోలేదా’ అని అడుగుతాడు. ఇవన్నీ చెప్పి.. ‘నా మీద అంత ప్రేమగా ఉండేవాడు. మా అమ్మానాన్నల కంటే ఎక్కువ ప్రేమ చూపించాడు. అందుకే ఇంటి నుంచి వెళ్లిపోయి ఇద్దరం సహజీవనంలో ఉన్నాం’ అని చెబుతారు. అవతలి వ్యక్తి పెళ్లి ప్రస్తావన రానివ్వకుండా జాగ్రత్తపడిన విషయం మోసపోయిన తర్వాత కానీ అమ్మాయిలకు తెలియడం లేదు. ఈలోపు అమ్మాయి బ్యాంకు బాలెన్స్, నగలు ఖర్చయిపోయి ఉంటాయి. శ్రద్ధావాకర్ కేసులో దారుణం జరిగింది కాబట్టి సమాజం దృష్టిలోకి వస్తుంది. కానీ అలాంటి పరిస్థితి రాలేదనే మాటే కానీ మోసపోయి... న్యాయపోరాటం చేయలేక, ఆవేదనతో మానసికంగా కృంగిపోతున్న వాళ్లు ఎందరో’’ అని చెప్పారు లాయర్ పార్వతి. వంచనకు సాధనం అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ప్రేమ పేరుతో వంచించడానికి సోషల్ మీడియాను సాధనంగా ఉపయోగించుకుంటున్నారు. ఒక వ్యక్తితో ముఖాముఖి మాట్లాడితే ఒకసారికి కాకపోయినా ఐదారు దఫాలు మాట్లాడిన తర్వాతకైనా ముసుగు జారిపోతుంది. ఇక ఫేస్బుక్, వాట్సాప్ చాటింగ్‌లో అవతలి వ్యక్తి మనోభావాలను పసిగట్టడం సాధ్యం కానే కాదు. మోసపోతున్నది అమ్మాయిలు మాత్రమే అని కాదు, మోసపోతున్న వాళ్లలో ఎక్కువ శాతం అమ్మాయిలే ఉంటున్నారు. ఒకప్పుడు కలం స్నేహాలు ఎక్కడో ఉన్న ఇద్దరు వ్యక్తులను అనుసంధానం చేసేవి. అవి పరస్పరం అభిప్రాయాలు, అభిరుచులను షేర్ చేసుకోవడానికే పరిమితమయ్యేవి. సోషల్ మీడియా స్నేహాలు జీవితాలను నిర్దేశిస్తున్నాయి, తప్పుదారిలో నడిపిస్తున్నాయంటే... ఆ తప్పు సాంకేతికతది కాదు. మెదడు ఉన్న, విచక్షణ ఉండాల్సిన మనిషిదే. – వాకా మంజులారెడ్డి చట్టాలున్నాయి...కానీ! పెళ్లి చేసుకున్న మహిళకు చట్టపరంగా ఎలాంటి రక్షణ ఉందో, సహజీవనం విషయంలో కూడా అలాంటి రక్షణను కల్పించింది చట్టం. అయితే సహజీవనాన్ని నిరూపించుకోవాలి. చాలా సందర్భాల్లో నిరూపణ కష్టమవుతోంది. ఆ ఇద్దరూ ఒకే కప్పు కింద జీవించారని చుట్టుపక్కల వాళ్లు సాక్ష్యం చెప్పాలి. అలాగే ఆ ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నట్లు సెల్‌ఫోన్ సిగ్నల్స్ వంటి సాంకేతిక ఆధారాలను చూపించవచ్చు. కానీ న్యాయస్థానం ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్‌ని ప్రధాన సాక్ష్యంగా పరిగణించడం లేదు, సెకండరీ ఎవిడెన్స్‌గా మాత్రమే తీసుకుంటుంది. సహజీవనాన్ని నిరూపించలేని పరిస్థితుల్లో ‘క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, చీటింగ్’ కేసులు పెట్టవచ్చు. కానీ అమ్మాయిలు, వారి తల్లిదండ్రులకు, సమాజానికి భయపడి ఈ పని చేయలేకపోతున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు కూడా కేసులు పెట్టి జీవితంలో మరింత అల్లకల్లోలంలోకి వెళ్లడానికి ఇష్టపడరు. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండడమే చెప్పదగిన సూచన. పుట్టిన రోజుకి ఫ్లవర్ బొకేలు పంపించినంత మాత్రాన అతడిది సంపూర్ణమైన ప్రేమ అనే భ్రమలోకి వెళ్లవద్దు. – ఈమని పార్వతి, హైకోర్టు న్యాయవాది -
రెండేళ్లుగా సహజీవనం.. వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుందని..!
సాక్షి, బెంగళూరు: సహజీవనం సాగిస్తున్న ప్రియురాలిని దారుణంగా హత్య చేశాడు ప్రియుడు. ఈ ఘటన బెంగళూరు రామ్మూర్తినగరలో జరిగింది. ఇద్దరూ కూడా నేపాల్‌కు చెందినవారే. వివరాలు.. నేపాల్‌కు చెందిన కృష్ణకుమారి (23), సంతోష్ దాలి (27) మూడేళ్ల కిందట వేర్వేరుగా బెంగళూరుకు వచ్చారు. రెండేళ్ల కిందట ఒకరికొకరు పరిచయమమై ప్రేమగా మారి ఒకే ఇంట్లో సహజీవనం సాగిస్తున్నారు. కృష్ణకుమారి హొరమావులోని ఒక స్పాలో బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది. సంతోష్ టీసీ పాళ్యలో అదే వృత్తిలో ఉన్నాడు. అనుమానం పెనుభూతమై.. కొంతకాలంగా అతడు ప్రియురాలి ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగి ఆమెను కొట్టి గొంతు నులిమాడు. ఆమె అచేతనంగా పడిపోవడంతో ఆస్పత్రికి తరలించాడు. అర్ధరాత్రి 1.30 గంటలకు ఆస్పత్రి నుంచి కాల్ వచ్చినట్లు డీసీపీ భీమా శంకర్ గుళేద్ తెలిపారు. తక్షణమే ఆస్పత్రికి వెళ్లి చూడగా కృష్ణకుమారి మరణించి ఉందని తెలిపారు. హత్య కేసు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. రెండేళ్ల నుంచి ఒకే ఇంట్లో జీవిస్తున్నారని, వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుందని కృష్ణకుమారితో సంతోష్ గొడవ పడేవాడని చెప్పారు. సంతోష్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. చదవండి: (గొల్లపల్లి యువకుడు భార్గవ్‌కు లక్కీ ఛాన్స్.. ఏడాదికి రూ.1.70 కోట్ల జీతం) -
బెంగళూరులో పెరిగిన సహజీవనం కల్చర్.. బాధితులంతా వారే
►ఓ అబ్బాయి, అమ్మాయి ఒకే కంపెనీలో పనిచేస్తారు. పరిచయం పెరిగి సహజీవనం వరకూ వచ్చింది. అతన్నే పెళ్లి చేసుకుందామని యువతి అనుకుంది. కానీ ఇంట్లో మంచి సంబంధాన్ని చూశారని, వారు చెప్పినట్లే చేస్తానని అబ్బాయి చెప్పడంతో ఆమె హతాశురాలైంది. ఇప్పుడు న్యాయం కావాలని అర్థిస్తోంది. ►ఆన్లైన్లో పరిచయమైన ఇద్దరు ప్రైవేటు ఉద్యోగులు ఓ ఫ్లాటులో కాపురం స్టార్ట్ చేశారు. కొన్ని నెలలు పాటు బాగానే సాగింది. అయితే భాగస్వామి అనుమానిస్తూ వేధిస్తుండడంతో విసిగిపోయిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ►ఆధునిక జీవనశైలి కలిగిన సిలికాన్ సిటీలో ఇలాంటి కథలు ఎన్నో. ఆకు– ముల్లు సామెత మాదిరిగా చివరకు అతివలే బాధితులు అవుతున్నారు. సాక్షి, బెంగళూరు(బనశంకరి): ఉద్యాన నగరిలో లివింగ్ టుగెదర్ (సహజీవనం)తో అమాయక యువతులు, మహిళలు వంచనకు గురవుతున్న కేసులు తీవ్రతరమౌతున్నాయి. మోసపోయామంటూ రాష్ట్ర మహిళా కమిషన్‌లో ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయి. అత్యాచారం, కుటుంబ దౌర్జన్యాలు, వరకట్న వేధింపులు, వివాహం చేసుకుంటామని నమ్మించి వంచనకు పాల్పడుతున్నట్లు బాధితులు ఫిర్యాదు చేయడం పెరిగింది. ఇటువంటి కేసులు ఎక్కువ మహిళా కమిషన్ వద్దకు చేరడం విశేషం. గతం నుంచి ఉన్నదే, ఇప్పుడు తీవ్రమైంది విద్యాలయాలు, ఆఫీసుల్లో పరిచయమై లివింగ్ టుగెదర్ నిర్ణయం తీసుకుని ఒకే ఇంట్లో పెళ్లి కాకుండానే జీవించడం బెంగళూరులో ఎప్పటినుంచో ఉన్న ధోరణే. దీనిపై గతంలో కూడా అనేక చర్చోపచర్చలు జరిగాయి. కానీ ఈ పాశ్చాత్య పెడ ధోరణి కొనసాగుతూనే ఉంది. కొత్తగా ఇప్పుడు గొడవలు పెరిగాయి. సహజీవనం చేపట్టి ఏడాది గడిచేలోపు గొడవలు పడి ఆడపిల్లలు న్యాయం చేయాలని మహిళా కమిషన్‌కు మొర పెట్టుకుంటున్నారు. భవిష్యత్ నాశనం చేసుకోవద్దు లివింగ్ టుగెదర్ వ్యవస్థతో ఆడపిల్లలు తమ భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారు. పిల్లల తల్లిదండ్రులు కూడా సాయం కోసం వస్తున్నారని మహిళా కమిషన్ అధ్యక్షురాలు ప్రమీళానాయుడు తెలిపారు. విద్యార్థినులు, మహిళలు విధులు నిర్వహించే స్థలాల్లో ఇప్పటికే లివింగ్ టు గెదర్ మోసాల పట్ల జాగృతం చేసే కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మోసపోయి న్యాయం కోసం ఆశ్రయించే బదులు మోసపోకుండా జాగ్రత్త వహించాల్సి ఉంది. జీవితాన్ని నిర్మించుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చారు. నెలకు సుమారు 8 నుంచి 10 లివింగ్ టు గెదర్ గొడవల కేసులు వస్తున్నాయి. ఏడాది కాలంగా ఫిర్యాదులు రెట్టింపు అయినట్లు ఆమె చెప్పారు. ఈ పెడ ధోరణులకు నష్టపోయేది యువతులే కాబట్టి వారిని తల్లిదండ్రులు జాగృతం చేయాలని తెలిపారు. -
జూనియర్ ఆర్టిస్ట్‌ల ప్రేమాయణం.. నాలుగేళ్లు ఒకరితో.. నాలుగు నెలలు మరొకరితో..
సాక్షి, బంజారాహిల్స్: తాజా ప్రియుడితో కలిసి మాజీ ప్రియుడిని రెండో అంతస్తు నుంచి కిందకు తోసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో యువతీ, యువకులను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే... శ్రీకాకుళం జిల్లాకు చెందిన తిరుమల్‌రెడ్డి సూర్యనారాయణ(30) సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్‌గా పని చేస్తూ యూసుఫ్‌గూడ సమీపంలోని శ్రీకృష్ణానగర్‌లో నివాసం ఉంటున్నాడు. నాలుగేళ్ల క్రితం తనతో పాటు జూనియర్ ఆర్టిస్ట్‌గా పని చేస్తున్న నాగవర్ధినితో ఏర్పడ్డ పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరూ కలిసి సహజీవనం చేసేదాకా కొనసాగింది. అదే భవనంలో ఈ ఇద్దరూ కలిసి రెండో అంతస్తులో నాలుగేళ్లుగా నివాసం ఉంటున్నారు. నాలుగు నెలల క్రితం ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. చదవండి: ('నాన్నా అమ్మను రోజూ ఎందుకు కొడతావు.. మాతో ఎందుకు సంతోషంగా ఉండవు') ఎవరికి వారు వేర్వేరుగా ఉండాలని నిర్ణయించుకొని ఈ మేరకు సూర్యనారాయణ అదే భవనంలో ఆమె నుంచి విడిపోయి నాల్గో అంతస్తులో కిరాయికి ఉంటున్నాడు. ఈ లోపు నాగవర్ధిని రాజమండ్రికి చెందిన మరో జూనియర్ ఆర్టిస్ట్ శ్రీనివాస్‌రెడ్డితో ప్రేమలో పడింది. ఇద్దరూ కలిసి గత నాలుగు నెలలుగా ఒకే గదిలో ఉంటున్నారు. ఈ విషయంపై సూర్యనారాయణ ఇటీవల ఆమెను నిలదీశాడు. శ్రీనివాస్‌రెడ్డితో సహజీవనం మానుకోవాలని తనతో పాటే ఉండాలని గొడవకు దిగేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి సూర్యనారాయణను ఆమె గదిలోకి వెళ్లగా శ్రీనివాస్‌రెడ్డి, నాగవర్ధిని ఇద్దరూ కనిపించడంతో వారితో గొడవపడ్డాడు. మాటా మాటా పెరగడంతో వారిద్దరూ కలిసి సూర్యనారాయణను అదే అంతస్తు పైనుంచి కిందికి తోసేశారు. పక్కటెముకలు విరిగిపోయి ఓ ఎముక ఊపిరితిత్తుల్లో గుచ్చుకోవడంతో అతడి పరిస్థితి విషమించింది. బాధితుడిని పంజగుట్టలోని మురుగన్ ఆస్పత్రిలో బాధితుడిని చేర్నించగా ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. నిందితులు శ్రీనివాస్‌రెడ్డి, నాగవర్ధినిలను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అప్పటికే నాగవర్ధినికి వివాహం జరిగినట్లు తేలింది. వీరిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రియుడితో పెళ్లి.. ఆ ఫోటోలను భర్తకు పంపి) -
Hyderabad: భర్తకు దూరంగా సుధీర్‌తో సహజీవనం.. ఆపై..
సాక్షి, హైదరాబాద్: హైదర్‌గూడలో విషాదం చోటుచేసుకుంది. నాగలతా రెడ్డి అనే వివాహిత గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సుధీర్ అనే వ్యక్తి తనను మోసం చేశాడని, డబ్బుల కోసం తనను శారీరకంగా వాడుకొని తన మోజు తీర్చుకున్నాడని సూసైడ్ నోట్లో పేర్కొంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దరాప్తు చేస్తున్నారు. మృతురాలు గత కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటూ.. సుధీర్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: (హైదరాబాద్‌లో ఫింగర్ ప్రింట్ సర్జరీ ముఠా గుట్టురట్టు) -
భర్తను వదిలి ప్రియుడితో మూడేళ్లు సహజీవనం.. ఆ క్రమంలోనే..
పీలేరు రూరల్ : ప్రియుడి వేధింపులతో సహజీవనం చేస్తున్న మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం పీలేరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలావున్నాయి. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన వెంకటముని కుమార్తె పొన్ను నిరోషా (28)కు పదేళ్ల క్రితం దేవరకొండ పంచాయతీ మైలవాండ్లపల్లెకు మంజునాథ్‌తో వివాహమై ఒక కుమారుడు ఉన్నాడు. అయితే మూడేళ్ల క్రితం పీలేరు పట్టణం రాఘవేంద్రనగర్‌కు చెందిన యుగంధర్ ఆచారితో నిరోషాకు వివాహేతర సంబంధం ఏర్పడింది. నిరోషా భర్తతో గొడవ పడి యుగంధర్ ఆచారి వద్దకు చేరుకుంది. మూడేళ్లుగా సహజీవనం సాగిస్తోంది. కొంతకాలంగా యుగంధర్ఆచారి వేధింపులతో జీవితంపై విరక్తి చెందిన నిరోషా శుక్రవారం ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన యుగంధర్ ఆచారి ఆయన భార్య భవ్య హుటాహుటిన నిరోషాను కిందకు దింపి చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నిరోషా తండ్రి వెంకటముని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తిప్పేస్వామి తెలిపారు. చదవండి: (రూ.2లక్షల అప్పు.. భర్త స్నేహితుడితో వివాహేతర సంబంధం..) -
ఇద్దరితో పెళ్లి.. మరొకరితో సహజీవనం.. చివరకు..
వేంపల్లె: వేంపల్లె పట్టణం భరత్‌నగర్ వీధికి చెందిన షేక్ ఫర్హనా (28) అనే వివాహిత దారుణ హత్యకు గురైంది. మృతురాలి తల్లి షహారున్నీషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఫర్హనా 11ఏళ్ల క్రితం పట్టణ పరిధిలోని రాజీవ్ నగర్‌కాలనీకి చెందిన ప్రవీణ్‌తో ప్రేమ వివాహం చేసుకుంది. వీరిద్దరికి లతీఫ్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. అనంతరం జావీద్ ఉరఫ్ మహ్మద్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వీరిద్దరికి జహీన్ షే అనే కుమారుడు ఉన్నాడు. మూడేళ్ల క్రితం భర్త జావీద్ జీవనోపాధి కోసం కువైట్‌కు వెళ్లాడు. భర్త పట్టించుకోకపోవడంతో షేక్ బాష ఉరఫ్ ఇడ్లీ బాషతో పరిచయం ఏర్పడి సహజీవనం చేస్తుండేది. ఈ నేపథ్యంలో డబ్బుల విషయమై ఇడ్లీ బాషతో గొడవ జరిగేది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. చదవండి: (Hyderabad: స్పా ముసుగులో వ్యభిచారం, ఐదుగురి అరెస్టు) ఫర్హనాకు కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఇడ్లీ బాష బుధవారం రాత్రి ఆమె ఇంటికి వెళ్లి వాదనకు దిగాడు. గురువారం తెల్లవారుజామున ఇడ్లీ బాష ఫర్హనా గొంతు కోసి అతికిరాతకంగా చంపినట్లు పర్హనా తల్లి షేక్ షహారున్నీషా పోలీసులకు వివరించింది. అనంతరం ఫర్హనా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు, వేంపల్లె సీఐ సీతారామిరెడ్డి, ఎస్ఐ తిరుపాల్ నాయక్ పరిశీలించారు. షేక్ బాష ఉరఫ్ ఇడ్లీ బాషను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: (Hyderabad: ఎవరికైనా చెబితే చంపేస్తా.!) -
భర్తతో విడిపోయి.. వంశీతో సహజీవనం.. చివరకు అతడి చేతిలోనే..
నెల్లూరు(క్రైమ్): సహజీవనం చేస్తున్న యువకుడే ఆమె పాలిట కాలయముడయ్యాడు. గొంతు నులిమి.. నాలుగో అంతస్తు నుంచి కిందకు తోసేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన 14వ తేదీ అర్ధరాత్రి నెల్లూరులోని భగత్‌సింగ్‌కాలనీ టిడ్కో ఇళ్లలో చోటుచేసుకుంది. బుధవారం పోలీసులు వివరాలు వెల్లడించారు. దర్గామిట్ట రామ్‌నగర్‌కు చెందిన రమణ (31), వెంకటరమణలు దంపతులు. వారికి ఒక కుమారుడున్నాడు. విభేదాల నేపథ్యంలో భార్యాభర్తలు విడిపోయారు. రమణ తన కుమారుడిని ఇందుకూరుపేటలోని డానియేల్ ఫౌండేషన్ వసతిగృహంలో చేర్పించి ఒంటరిగా నివాసం ఉంటోంది. ఈక్రమంలో ఆమెకు చిల్లకూరు మండలం మిక్చర్ కాలనీకి చెందిన వీడీ వంశీతో రెండున్నర సంవత్సరాల క్రితం పరిచయం ఏర్పడింది. ఇద్దరూ సన్నిహితంగా ఉండసాగారు. చదవండి: (భర్తను వదిలి ప్రియుడితో సహజీవనం.. పిల్లలు అమ్మా అని...) కొంతకాలం కరెంటాఫీసు సెంటర్ గాయత్రినగర్‌లో సహజీవనం చేశారు. రెండునెలల క్రితం భగత్‌సింగ్‌కాలనీలోని టిడ్కో అపార్ట్మెంట్ జీ–4 బ్లాక్‌కు నివాసం మార్చారు. వంశీ కొంతకాలంగా రమణపై అనుమానం పెంచుకోవడంతోపాటు చీటికి మాటికి గొడవపడుతుండేవాడు. ఇటీవల నెల్లూరు రామ్‌నగర్‌లో నివాసం ఉంటున్న రమణ సోదరి గంగ తన కుమార్తెతో కలిసి వారి వద్దకు వచ్చింది. 14వ తేదీ అర్ధరాత్రి అందరూ కలిసి అపార్ట్‌మెంట్‌పైన నిద్రించేందుకు వెళ్లారు. ఈక్రమంలో వంశీ రమణతో గొడవపడ్డాడు. ఆమె గొంతు నులిమి అపార్ట్మెంట్ పైనుంచి కిందకు తోసేయడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఈ విషయాన్ని గమనించిన గంగ, ఆమె కుమార్తె నవాబుపేట పోలీసులకు సమాచారం అందించారు. ఇన్స్పెక్టర్ టీవీ సుబ్బారావు, ఎస్సై రమేష్‌బాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. సుబ్బారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న వంశీ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. -
భర్తను వదిలి ప్రియుడితో సహజీవనం.. పిల్లలు అమ్మా అని...
ప్రొద్దుటూరు క్రైం : ‘జరిగిందేదో జరిగిపోయింది.. మన ఇంటికి పోదాం రా’అని భార్య అనురాధను పిలిచాడు. పలుమార్లు పిలిచినా ఇమ్మానియేల్‌ను వదిలి పెట్టి రానని భర్తతో తెగేసి చెప్పింది. తన పిల్లలకు తల్లిని లేకుండా చేసిన ఇమ్మానియేల్‌పై అతను(రవి) పగ పెంచుకున్నాడు. తన భార్య మరో వ్యక్తితో సహజీవనం చేయడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. అతన్ని ఎలాగైనా హతమార్చాలని వ్యూహం పన్నాడు. అవకాశం కోసం ఎదురు చూశాడు. రెండు రోజుల క్రితం ఇమ్మానియేల్ నిద్రపోతుండగా పిడిబాకుతో పొడిచి హత్య చేశాడు. ఈ హత్య చేసిన కేసులో నిందితుడు రవిని టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ ప్రసాదరావు బుధవారం సాయంత్రం టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో అరెస్ట్ వివరాలను మీడియాకు వెల్లడించారు. ప్రకాష్‌నగర్‌లోని ఇటుకల ఫ్యాక్టరీ వద్ద నివాసం ఉంటున్న ఇమ్మానియేల్‌ను హత్య చేసి రవి పారిపోయాడు. ఈ సంఘటనపై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అరెస్ట్ వివరాలను మీడియాకు వెల్లడిస్తున్న డీఎస్పీ ప్రసాదరావు సుమారు ఐదేళ్ల కిందట రవి భార్య అనురాధ తన భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి ఇమ్మానియేల్‌తో ప్రొద్దుటూరుకు వచ్చింది. కొన్ని రోజుల తర్వాత రవి తన భార్య అనురాధ వద్దకు వెళ్లి సంసారానికి రమ్మని ప్రాధేయపడ్డాడు. పిల్లలు అమ్మా అని తపిస్తున్నారు.. పోదాం రా అని ఎంతగా బతిమాలినా ఆమె కనికరించలేదు. ఇమ్మానియేల్‌ను వదిలేసి రానని భర్తతో తెగేసి చెప్పింది. ఇలా పలుమార్లు వచ్చి పిలిచినా ఆమె మనసు కరగలేదు. నిన్ను చంపేసి నా భార్యను తీసుకెళ్తా : రవి దీనంతటికీ కారకుడైన ఇమ్మానియేల్‌పై రవి పగ పెంచుకున్నాడు. ‘నా పిల్లలకు తల్లిని లేకుండా చేశావ్. ఎప్పటికైనా నిన్ను చంపేసి నా భార్యను తీసుకుపోతా ’అని అతన్ని రవి హెచ్చరించాడు. అయినా ఇమ్మానియేల్ లైట్‌గా తీసుకున్నాడు. ఆ రోజు నుంచి ఇమ్మానియేల్‌ను హతమార్చేందుకు అవకాశం కోసం రవి ఎదురుచూస్తూ వచ్చాడు. అతను ఇటుకల బట్టి వద్ద బయట పడుకుంటున్నాడని పసిగట్టిన రవి ఇదే మంచి తరుణమని భావించాడు. సోమవారం అర్ధరాత్రి ఇమ్మానియేల్ నిద్రపోతున్న సమయంలో పిడిబాకుతో కసితీరా పొడిచి చంపాడు. అనంతరం రవి బైక్‌పై వెళ్తుండగా మోడంపల్లె బైపాస్ రోడ్డులో సీఐ ఇబ్రహీం సిబ్బందితో కలిసి అతన్ని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి బైక్, కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రవిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. 24 గంటల్లోనే హంతకుడ్ని అరెస్ట్ చేసిన సీఐ ఇబ్రహీం, సిబ్బందిని డీఎస్పీ అభినందించి నగదు రివార్డును అందజేశారు. -
మోసం చేసిందనే మల్లీశ్వరిని చంపా: బాషా
అద్దంకి: 'భర్తను వదిలేసిన తర్వాత నాకు దగ్గరైంది. మొదట్లో అన్యోన్యంగానే ఉన్నాం. కానీ రానురానూ తాను విపరీతంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఎవరెవరితోనో మాట్లాడేది. ఎక్కడెక్కడికో వెళ్లేది. వద్దని ఎంత మొత్తుకున్నా వినేదికాదు. గట్టిగా అడిగితే నిన్నొదిలేసి హైదరాబాద్ వెళ్లిపోతానని బెదిరించేది. అంతే, పట్టలేని కోపంతో పక్కనున్న నవారు తీసుకొని తన గొంతు నులిమా' అంటూ మల్లేశ్వరిని ఎందుకు చంపాడో పోలీసులకు వివరించాడు బాషా. ప్రకాశం జిల్లా అద్దంకిలో సంచలనంరేపిన ఈ హత్యకేసు పూర్వాపరాల్లోకి వెళితే.. చీమకుర్తి మండలం పల్లమల్లి గ్రామానికి చెందిన మల్లీశ్వరి(25)కి అద్దంకి మండలం మనికేషం గ్రామానికి చెందిన రామారావుతో వివాహమైంది. చాలా ఏళ్ల కిందటే వారు విడిపోయారు. భర్తతో తెగదెంపుల అనంతరం కొత్తదామవారిపాలెంకు చేరుకున్న మల్లీశ్వరి అక్కడ ఒంటరిగా నివసిచసాగింది. ఈ క్రమంలో ముజావర్ పాలెంకు చెందిన బాషా(30) అనే వ్యక్తితో పరిచయమైంది. అదికాస్తా ప్రేమగామారి ఇరువురూ సహజీవనం చేస్తున్నారు. తనతో కలిసి ఉంటూనే మరికొందరితోనూ దగ్గరగా ఉంటోందని మల్లేశ్వరిపై అనుమానం పెంచుకున్నాడు బాషా. చాలాసార్లు హెచ్చరించి చూశాడు. శనివారం రాత్రి కూడా ఇరువురి మధ్య ఇదేవిషయంలో ఘర్షణ జరిగింది. తనను అనుమానిస్తే హైదరాబాద్ వెళ్లిపోతానని మల్లేశ్వరి బెదిరించింది. దీంతో కోపోద్రిక్తుడైన బాషా ఇంట్లో ఉన్న నవారుతో ఆమెకు ఉరి వేసి.. ఏమి తెలియనట్లు నటించాడు. తాను రావడానికి ముందే మల్లీశ్వరి ఉరి వేసుకుందని చుట్టుపక్కలవారిని నమ్మించే ప్రయత్నం చేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి బాషాను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా మల్లీశ్వరిని తానే చంపానని బాషా అంగీకరించాడు. దీంతో బాషాపై హత్య కేసు నమోదు చేశారు పోలీసులు.