obscene postings
-
చేటుతెచ్చే పోస్టులొద్దు
సాక్షి, అమరావతి : ఎవరిపైనైనా అసభ్యకర పదజాలంతో, దూషణలతో లేదా కించపరిచే చిత్రాలు, మీమ్స్, ఇతర విధాలుగా సోషల్ మీడియాలో పోస్టు పెడితే అడ్డంగా బుక్కయినట్టే. సొంత ఐడీ అయినా, ఫేక్ ఐడీ అయినా ఇలాంటి పోస్టులు పెట్టిన వారిని రాష్ట్ర సీఐడీ ఇట్టే పట్టేస్తుంది. ఇందుకు తగ్గ అధునాతన పరిజ్ఞానాన్ని ఇప్పటికే సీఐడీ అంది పుచ్చుకుంది. దాని ఆధారంగా సోషల్ మీడియా వేధింపులకు కళ్లెం వేసేందుకు పటిష్ట కార్యాచరణకు ఉపక్రమించింది. ప్రధానంగా ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ సోషల్ మీడియాలో రాజకీయ పార్టీ అనుబంధ సోషల్ మీడియా విభాగాలు ప్రత్యర్థులను దూషిస్తూ, వేధిస్తూ పోస్టులు పెట్టే అవకాశాలున్నందున వీటిపై గట్టి నిఘా పెట్టింది. ఈ పోస్టులు పెట్టే వారిని గుర్తించి, చర్యలు తీసుకోవడానికి ప్రత్యేకంగా సోషల్ మీడియా మానిటరింగ్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ విభాగం నిత్యం సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను వడపోసి, అసభ్యకర పోస్టులపై కఠిన చర్యలు చేపడుతోంది. ఇప్పుడీ విభాగాన్ని మరింత పటిష్టం చేసి, అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై చర్యలను వేగవంతం చేయనుంది. 100 మందికి పైగా నిపుణులు సీఐడీ కేంద్ర కార్యాలయంలో సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేశారు. అందులో సోషల్ మీడియా, ఆన్లైన్, సైబర్ వ్యవహారాలపై నైపుణ్యం ఉన్న ఇన్స్పెక్టర్లు, ఎంపిక చేసిన కానిస్టేబుళ్లతో ఈ విభాగం క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. ఇప్పుడీ విభాగంలో మరో 25 మంది నిపుణులైన అధికారులను నియమించనున్నారు. దాంతోపాటు జిల్లాల్లో పని చేస్తున్న 75 మంది నిపుణులైన పోలీసు అధికారులు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లను ప్రత్యేకంగా ఎంపిక చేశారు. దీంతో 100 మందికిపైగా నిపుణులతో పటిష్ట విభాగం అందుబాటులోకి వస్తోంది. ఈ మేరకు మౌలిక వసతులు, ఇతర అంశాలతో కూడిన నివేదికకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. నిరంతర నిఘా.. సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ద్వారా నిత్యం వివిధ సోషల్ మీడియా ఖాతాలను సీఐడీ పరిశీలిస్తోంది. అన్ని రకాల సోషల్ మీడియా పోస్టులను రోజూ కాచి వడపోస్తోంది. అసభ్యకర, వేధింపులకు పాల్పడే, వైషమ్యాలు రెచ్చగొట్టే, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులను గుర్తించి, వాటిని పెట్టిన వారిపై వెంటనే కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. అందుకోసం సోషల్ మీడియా సంస్థల ప్రధాన కార్యాలయాలను అనుసంధానిస్తూ ప్రత్యేక వ్యవస్థను కూడా అందుబాటులోకి తెచి్చంది. అసభ్యకర పోస్టులను వెంటనే తొలగిస్తోంది. అందుకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేస్తోంది. విదేశాల నుంచి అసభ్యకర పోస్టులు పెడుతూ రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొడుతున్నవారిని కూడా ఉపేక్షించడంలేదు. వారిపైనా చర్యల కోసం సంబంధిత దేశాల రాయబార కార్యాలయాలను సంప్రదించి వేగంగా దర్యాప్తు చేస్తోంది. అవసరమైతే లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేస్తోంది. అసభ్యకర పోస్టులు పెడుతున్నవారిపై సైబర్ బుల్లీయింగ్ షీట్లు తెరుస్తోంది. న్యాయస్థానాల ద్వారా తగిన శిక్షలు పడేలా పటిష్టంగా, వేగంగా దర్యాప్తు చేస్తోంది. పదే పదే కుట్రపూరితంగా సోషల్ మీడియా వేధింపులకు పాల్పడే వారి ఆస్తులు అటాచ్ చేసేందుకు కూడా నిర్ణయించింది. ప్రధానంగా ఏడాది నుంచి సీఐడీ దూకుడు బాగా పెంచింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రెట్టింపు సంఖ్యలో సోషల్ మీడియాలో అస భ్యకర పోస్టులపై సీఐడీ కఠిన చర్యలు చేపట్టింది. ఆ గణాంకాలు ఇలా ఉన్నాయి... ♦ 2022లో తొలగించిన అసభ్యకర సోషల్ మీడియా పోస్టులు: 1,450 ♦ 2023లో ఇప్పటివరకు తొలగించిన అసభ్యకర సోషల్ మీడియా పోస్టులు: 2,170 ♦నిత్యం పరిశీలిస్తున్న సందేహాస్పద సోషల్ మీడియా ఖాతాలు: 2000 ♦ అసభ్యకర పోస్టులు పెడుతున్నారని గుర్తించిన సోషల్ మీడియా ఖాతాలు: 405 ♦ ఇప్పటివరకు తెరిచిన సైబర్ బుల్లీయింగ్ షీట్లు: 2,995 ♦ విదేశాల నుంచి సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై చర్యల కోసం ఆయా దేశాలతో సంప్రదించిన కేసులు: 45 ♦ జారీ చేసిన లుక్ అవుట్ నోటీసులు: 5 -
మహిళలను లోకేష్ హింసిస్తున్నాడు
మంగళగిరి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన ఐటీ టీమ్ ద్వారా సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యకర పోస్టులు పెట్టించి హింసిస్తున్నాడని టీడీపీ మాజీ మహిళా నేత పాలేటి కృష్ణవేణి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆమె లోకేష్‌తో పాటు ఆయన ఐటీ టీమ్‌పై మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. నారా లోకేష్ ఒక పథకం ప్రకారం మహిళలను కించపరుస్తూ పోస్టులు పెట్టిస్తున్నారని విమర్శించారు. తన పేరుతో ట్విట్టర్ పోస్టును మార్ఫింగ్ చేసి.. తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాపోయారు. మహిళలు టీడీపీలో ఉన్నంతకాలం లోకేష్‌కు దేవతల్లా కనిపిస్తారని.. అక్కడి నుంచి బయటకు రాగానే బజారు మనుషుల్లా కనిపిస్తారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మహిళల విషయంలో ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారంటే.. ఇక అధికారంలోకి వస్తే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఏ పార్టీ కోసం, ఏ నాయకుడి కోసమైతే పని చేశానో అదే నాయకుడు నేడు తనపై దుష్ప్రచారం చేయిస్తున్నారన్నారు. లోకేష్‌కు దమ్ముంటే మంగళగిరి నియోజకవర్గం ఒక్కచోటే నామినేషన్ వేసి గెలవాలని సవాల్ విసిరారు. -
కదిరి ఎమ్మెల్యేపై కందికుంట అనుచరుల అసభ్యకర పోస్టులు.. పోలీసులకు ఫిర్యాదు
సాక్షి, కదిరి: ‘టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పలు కేసుల్లో నేరస్తుడు, 12 ఏళ్లు శిక్ష పడిన ఖైదీ. డీడీల దొంగ. ఆయన ఇకపై వార్డు మెంబర్‌గా కూడా పోటీ చేయడానికి అర్హుడు కాదని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది’ అని కదిరి ఎమ్మెల్యే డా.పీవీ సిద్దారెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కందికుంట అనుచరులు ఫేస్బుక్లో పెట్టిన అసభ్యకర పోస్టులపై గురువారం పట్టణ సీఐ సత్యబాబుకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్ ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కందికుంట అనుచరులు పోరెడ్డి ఓబుళరెడ్డి, మారుతీకుమార్, కళ్యాణ్‌చిన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టిన అసభ్యకర పోస్టులను చదివి వినిపించారు. ఉగాండాలో బోరుబండి దగ్గర పైపులు మోసుకునే పోరెడ్డి ఓబుళరెడ్డికి పెద్దగా చదువు రాదని, మాజీ సీఎం చంద్రబాబు ఎలాగైతే పట్టాభి చేత సీఎం వైఎస్ జగన్‌ను తిట్టించారో, అలాగే ఇక్కడ కూడా కందికుంట తన అనుచరుల ద్వారా తనతో పాటు తన కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా పోస్టులు పెట్టించి శాంతి భద్రతలకు విఘాతం కల్గించాలని కుట్ర చేస్తున్నారని చెప్పారు. విచారణకు పిలిపిస్తే తప్పేంటి?.. ఉగాండాలో ఉన్న వ్యక్తి తనపై అసభ్యంగా ఫేస్బుక్లో పోస్టులు పెడితే విచారణలో భాగంగా పోలీసులు ఆయన తండ్రిని పోలీసుస్టేషన్‌కు పిలిపిస్తే తప్పేంటని ఎమ్మెల్యే సిద్దారెడ్డి ప్రశ్నించారు. ఇదేదో పెద్ద నేరమైనట్లు ఎల్లో మీడియా తమ ఛానళ్లలో డిబేట్లు పెట్టి ప్రసారం చేశాయని, అదే మీడియా తనపై, తన కుటుంబ సభ్యులపై పెట్టిన అసభ్యకర పోస్టులపై ఎందుకు కథనాలు ప్రసారం చేయలేదో చెప్పాలన్నారు. ఇదే అవమానం మీ ఇంట్లో ఆడవాళ్లకు జరిగితే ఇలాగే వ్యవహరిస్తారా? అని మండిపడ్డారు. అసభ్యకర పోస్టులు పెట్టిన వారికి మద్దతుగా మాజీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్ తన ట్విట్టర్లో స్పందించడం సరికాదన్నారు. అలాగే కదిరి ‘సాక్షి’ విలేకరిపై అసభ్యకర పోస్టులు పెట్టినా.. జర్నలిస్టు యూనియన్ నాయకులు ఎందుకు స్పందించ లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: (చంద్రదండు అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు అరెస్ట్) డీఎస్పీకి భయమెందుకు?.. కదిరి డీఎస్పీ భవ్యకిషోర్ నేరస్తుడైన కందికుంటకు ఎందుకు భయపడుతున్నారని ఎమ్మెల్యే సిద్దారెడ్డి ప్రశ్నించారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు అధికారులే నేరస్తులకు భయపడితే ఇక సామాన్యులు పరిస్థితి ఏం కావాలన్నారు. మహిళలను దూషిస్తూ ఫేస్బుక్లో పోస్టులు పెట్టిన వారిపై సాటి మహిళగా ఆమె ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూద్దామన్నారు. కాగా.. ఎమ్మెల్యే పీఏ అబూబాకర్ సైతం తనపై పెట్టిన అసభ్యకర పోస్టులపై మరో ఫిర్యాదు చేశారు. -
ఫేస్బుక్ వేధింపులు: యువతి అరెస్టు
స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్బుక్ అకౌంట్లు తెరిచి, వాళ్ల ఫొటోలతో అసభ్య సందేశాలు పోస్ట్ చేస్తూ వాళ్ల పరువు గంగలో కలుపుతున్న 22 ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టుచేశారు. మొత్తం ఎనిమిది మంది పేర్ల మీద నకిలీ ఫేస్బుక్ ఐడీలను ఆమె తెరిచింది. అయితే.. ఆమె ప్రాక్సీ సర్వర్లను ఉపయోగించి ఈ అకౌంట్లను క్రియేట్ చేయడంతో పోలీసులకు ఈ కేసు ఛేదించడం పెద్ద సవాలుగానే మారింది. ఎట్టకేలకు ఆమె ఆచూకీని తెలుసుకోగలిగినట్లు గోవా సైబర్ క్రైం ఎస్పీ కార్తీక్ కశ్యప్ తెలిపారు. ఈ నేరం చేయడానికి ఆమె ఉపయోగించిన పరికరాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆమెకు నకిలీ ఫేస్బుక్ అకౌంట్లు క్రియేట్ చేయడం అలవాటు. ఎవరూ తనను ట్రాక్ చేయకుండా ఉండేందుకు తెల్లవారుజామున ఈ నకిలీ ప్రొఫైళ్లు క్రియేట్ చేయడం, వాటిలో పోస్టింగులు అన్నీ చేసేదని, అసలు ఆమె ఇలా చేయడానికి గల కారణం ఏంటో చూస్తున్నామని కశ్యప్ చెప్పారు.