న్యూఢిల్లీ: సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విటర్, ప్రపంచ కుబేరుడు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. 44 బిలియన్ డాలర్ల ట్విటర్ కొనుగోలు ఒప్పందంనుంచి తప్పుకోవడంతో ట్విటర్ మస్క్‌పై చట్టపరమైన పోరాటానికి దిగింది. ఈ నేపథ్యంలో మస్క్ శుక్రవారం ట్విటర్‌కు వ్యతిరేకంగా 164 పేజీల కౌంటర్‌సూట్ దాఖలు చేశారు. ట్విటర్ పిటిషన్‌పై ఈ అక్టోబర్ 17 నుండి ఐదు రోజుల పాటు విచారణ ప్రారంభం కానుందని డెలావేర్ కోర్టు ప్రకటించిన అనంతరం ఈ వ్యాజ్యం దాఖలు చేయడం విశేషం.
కాగా నకిలీ ఖాతాల వెల్లడి విషయంలో ట్విటర్ సరియైన సమాచారాన్ని అందించ లేదంటూ వాదించిన ఎలాన్ మాస్క్ ట్విటర్ కొనుగోలు డీల్‌నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. దీంతో మస్క్ నిర్ణయంతో తమ వ్యాపారానికి విఘాతం కలిగిందని, ఒప్పందాన్ని కొనసాగించేలా ఆయనను ఆదేశించాలని కోరుతూ ట్విటర్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజా పరిణామంపై ట్విటర్ ఇంకా స్సందించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment