ట్విటర్‌లో ఫేక్/స్పాన్ ఖాతాలు ఎన్ని ఉన్నాయనే అంశంపై ఈలాన్ మస్క్ వెనక్కి తగ్గడం లేదు. ట్విటర్ ప్రస్తుత యాజమాన్యం చెబుతున్న సంఖ్యలు వాస్తవ పరిస్థితులకు మధ్యన పొంతన ఉండటం లేదంటూ బల్లగుద్ది మరీ వాదిస్తున్నారు. తన వాదనను సమర్థించుకునేలా అనేక ఉదాహారణలు చూపెడుతున్నారు. ట్విటర్ బోర్డుకు చుక్కులు చూపెడుతున్నాడు..
ట్విటర్‌ను టేకోవర్ చేసే విషయంలో ఈలాన్‌మస్క్ పునారాలోచనలో పడ్డట్టు ప్రకటించారు. దీనిపై ఇటీవల జరిగిన ఓ పోడ్‌కాస్ట్‌లో ఈలాన్ మస్క్ స్పందించారు. ట్విటర్‌లో ఫేక్ ఖాతాలు 20 శాతానికి పైగానే ఉన్నాయని, ఇక మనుషుల ఖాతాల్లోనూ యాక్టివ్ యూజర్ల సంఖ్య మరింత తక్కువ అంటూ వివరణ ఇచ్చారు. ఇందులో కోసం ఇటీవల తాను చేసిన ఓ ట్వీట్‌కి వచ్చిన స్పందనను ఉదహారించారు.
మస్క్ రికార్డ్
ట్విటర్‌ను కొనుగోలు చేస్తున్నట్టు ఈలాన్ మస్క్ ప్రకటించిన తర్వాత నెక్ట్స్ ఏం కొనబోతున్నారంటూ ఓ యూజర్ ప్రశ్నించాడు.. దానికి బదులిస్తూ నెక్ట్స్ కోకకోలాను కొనుగోలు చేసి అందులో కొకైన్ పెడతానంటూ ఈలాన్ మస్క్ చమత్కరించాడు. అయితే ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. మొత్తం మీద ఈ ట్వీట్‌కి 4.8 మిలియన్ లైక్స్ వచ్చాయి. ప్రపంచంలో జీవించి ఉన్న మనుషుల్లో అత్యధిక లైకులు సాధించిన ట్వీట్‌గా ఇది రికార్డు సృష్టించింది.
Next I’m buying Coca-Cola to put the cocaine back in
— Elon Musk (@elonmusk) April 28, 2022
ఇంత తక్కువగా అంటే..
రికార్డు సృష్టించిన కోకకోలా - కొకైన్ ట్వీట్‌పై ఈలాన్ మస్క్ స్పందిస్తూ.. ట్వీటర్‌కు 217 మిలియన్ల మానిటైజ్డ్ యాక్టివ్ యూజర్ల ఉన్నట్టుగా ట్విటర్ చెబుతోంది. ఇదే సమయంలో రికార్డు సృష్టించిన కోక్ - కొకైన్ ట్వీట్‌కి వచ్చిన లైకులును పరిశీలిస్తే ఇది కేవలం 2 లేదా 2.5 శాతానికి మించదు అన్నారు. అంతమంది యాక్టివ్ యూజర్లు ఉన్నప్పుడు రికార్డు ట్వీట్‌కే ఇంత తక్కువ లైక్స్ రావడం అనేక సందేహాలకు తావిస్తోందంటున్నాడు ఈలాన్ మస్క్. నా ట్వీట్ అనే కాదు బాగా వైరల్ అయ్యే ట్వీట్స్‌కి కూడా నాలుగు మిలియన్ లైకులు వస్తున్నాయి. అంటే యాక్టివ్ యూజర్ల సంఖ్య 2 శాతం దగ్గరే ఉంటోంది. దీనికి కారణం ఫేక్/స్పామ్ అకౌంట్లు అంటూ తర్కిస్తున్నాడు ఈలాన్ మస్క్. ప్రజలకు నిజాలు తెలియాలంటూ డిమాండ్ చేస్తున్నాడు.
నీకో దండం బాబు
ఇక ఈలాన్‌మస్క్ చేస్తున్న ఆరోపణలు సమర్థించేవారు ఉన్నారు. ట్వీటర్ బోర్డు ఫేక్ ఖాతాలు కేవలం 5 శాతం ఉన్నట్టుగా చెబుతోంది. అయితే ఈ ఐదు శాతం అన్నది కనిష్టం. గరిష్టంగా ఇంది 20 శాతానికి పైగానే ఉంటుందంటున్నారు. ఓ వైపు మస్క్ ఆరోపణలు..మరోవైపు అతనికి పెరుగుతున్న మద్దతులో ట్విటర్‌కి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. 44 బిలియన్ డాలర్ల డీల్ సంగతి దేవుడెరుగు! ఈలాన్‌తో వచ్చిన తంటా తొలగిపోతే చాలనుకునే పరిస్థితి క్రమంగా బలపడుతోంది?
అత్యధిక లైకులు ఈ ట్వీట్‌కే
ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యధిక లైకులు సాధించిన ట్వీట్ బ్లాక్ పాంథర్ చిత్ర నటుడు చాడ్‌విక్ బోస్‌మన్ పేరిట ఉంది. ఆయన మరణించినప్పుడు కుటుంబ సభ్యలు ఆ విషయాన్ని ఆయన ట్విటర్ ఖాతా ద్వారా తెలిపారు. ఈ ట్వీట్ 7.1 మిలియన్ లైకులు సాధించి నంబర్ వన్ స్థానంలో ఉంది.
— Chadwick Boseman (@chadwickboseman) August 29, 2020
అప్పట్లో కొకైన్ ఉండేది
చాలామందికి ఫేవరేట్ డ్రింకులలో ఒకటైన కోకకోలాలో ప్రారంభంలో కొకైన్ కలిపేవారు. కోలా ఆకుల నుంచి సంగ్రహించిన కొకైన్‌ను, కోలా నట్స్ నుంచి సేకరించిన కోలాను కలిపి ఈ డ్రింకును 1890లలో తయారు చేశారు అప్పట్లో అమెరికాలో కొకైన్‌ను ఔషధంగా వినియోగించేవారు. ప్రతీ కోక్ బాటిల్‌లో 9 మిల్లీగ్రాముల కొకైన్ ఉండేది. అయితే కాలక్రమేనా కొకైన్ వాడకంపై విమర్శలు రావడంతో.. అమెరికా కోలాలో కొకైన్ కలపడాన్ని నిషేధించింది. ఇక ఈలాన్‌మస్క్ - ట్విటర్ డీల్ విషయంలో ఇప్పుడు కోక్‌బ్రాండ్‌కి ఉచితంగా పబ్లిసిటీ దొరుకుతోంది.
Comments
Please login to add a commentAdd a comment