సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌లో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. నిందుతుల ఏడాది క్రితం నుంచే డబ్బులు కొట్టేసేందుకు కుట్ర పన్నారని తెలిసింది. అకాడమీ అకౌంట్స్ ఆఫీసర్ రమేష్‌తో కలిసి డబ్బులు కొట్టేసేందుకు ప్లాన్ చేశారు. అకాడమీ నుంచి 3 బ్యాంకుల్లో డిపాజిట్లకు సిఫార్సు చేశారు. బ్యాంకుల డిపాజిట్ల సందర్భంలోనే నకిలీ పత్రాలు, డైరెక్టర్, అకౌంట్ ఆఫీసర్ సంతకాలు ఫోర్జరీ వంటి అంశాలను సెట్ చేసుకున్నారు.
సంవత్సర కాలానికి డిపాజిట్లు పెట్టి.. 15 రోజులకే మార్పు చేశారు. ఒరిజినల్ డిపాజిట్ల సర్టిఫికెట్లు తమ దగ్గరే ఉంచుకుని.. నకిలీ సర్టిఫికెట్లు అకాడమీకి ఇచ్చారు నిందితులు. ఒరిజినల్ ఎఫ్‌డీలతో 64.5 కోట్ల రూపాయలు డ్రా చేసింది ఈ ముఠా. ముందుగానే తెలుగు అకాడమీ పేరుతో నకిలీ అకౌంట్ ఓపెన్ చేశారు. అగ్రసేన్, ఏపీ మర్కంటైల్ సొసైటీల్లో నకిలీ ఖాతాలు సృష్టించారు. ఈ క్రమంలో యూనియన్, కెనరా బ్యాంకుల్లో కాజేసిన నిధులను ముందుగా అగ్రసేన్ బ్యాంక్‌కు తరలించారు.
(చదవండి: తెలుగు అకాడమీ స్కాం: మరింత లోతుగా..)
తర్వాత మర్కంటైల్ సొసైటీకి మళ్లించి 64.5 కోట్ల రూపాయలు డ్రా చేశారు. దీనిలో 6 కోట్ల రూపాయలను బ్యాంకు మేనేజర్లు, సొసైటీ సిబ్బందికి లంచంగా ఇచ్చారు. అకాడమీ అకౌంట్స్ ఆఫీసర్‌కు కోట్ల రూపాయల లంచం ఇచ్చిన ముఠా.. మిగతా మొత్తాన్ని రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టారు. మరి కొంతమంది నిందితులు కాజేసిన నిధులతో అప్పులు తీర్చుకున్నట్టు విచారణలో వెళ్లడయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment