Telugu Acadamy
-
సాక్షి కార్టూన్ 1-11-2021
-
తెలుగు అకాడమీ కేసు: రంగంలోకి ఈడీ
సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరెట్ రంగంలోకి దిగింది. సీసీఎస్ పోలీసుల కేసు ఆధారంగా కోట్ల రూపాయలు దారి మళ్లించిన కేసులో ఈడీ దర్యాప్తు చేపట్టింది. కాగా తెలుగు అకాడమీకి చెందిన రూ.64.5కోట్లును ముఠా కొల్లగొట్టిన విషయం తెలసిందే. ఆ దోచుకున్న సొమ్మును ఎక్కడ దాచారనే కోణంలో దర్యాప్తు చేయనుంది. మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ దర్యాప్తు చేయనుంది. తెలుగు అకాడమీ కేసులో పద్మనాభన్‌ను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. బ్యాంక్ డిపాజిట్ల పత్రాలను కలర్ జిరాక్స్ తీసి ఫోర్జరీ చేసిన పద్మనాభన్‌ను కోయంబత్తూర్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణారెడ్డి, భూపతి, యోహన్, రమణారెడ్డి పలువురు నిందితులు ఇంకా పరారీలో ఉన్నారు. ఫోర్జరీరీ డాక్యుమెంట్లు, ఫేక్ అకౌంట్స్, ఐడీలు నిందితులు సృష్టించారు. మరోవైపు నేడు మూడవ రోజు కస్టడికి యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలీ హాజరుకానున్నారు. అయితే అరెస్ట్ అయిన ఇతర నిందితులను సైతం పోలీసులు కస్టడికి కోరారు. చదవండి: బతుకమ్మల పైనుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు?.. మండిపడ్డ వీహెచ్ -
Telugu Academy: రిమాండ్ రిపోర్టు కీలక విషయాలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమి డిపాజిట్లలో కేసులో పోలీసులు రిమాండ్ రిపోర్టును విడుదల చేశారు. తొమ్మిది పేజీల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే 10మంది అరెస్ట్ చేశామని, రిమాండ్ రిపోర్టులో సీసీఎస్ పోలీసులు తెలిపారు. కీలక సూత్రదారి సాయికుమార్‌గా పోలీసులు తేల్చారు. కృష్ణారెడ్డి, పద్మనాభన్, మదన్, భూపతి, యోహన్ రాజ్ పరారీలో ఉన్నారని తెలిపారు. భూపతి సాయంతో తెలుగు అకాడమీ డిపాజిట్లను యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యేలా సాయి కుమార్ చూశారని పేర్కొన్నారు. ఏడాది కాల వ్యవధికి చేయాల్సిన డిపాజిట్లను పదిహేను రోజులకే ఈ ముఠా చేసిందని అన్నారు. కృష్ణారెడ్డి, పద్మనాభన్, మదన్‌లు డిపాజిట్ పత్రాలను ఫోర్జరీ చేసినట్లు పేర్కొన్నారు. 64.5కోట్లను కొల్లగొట్టి నిందితులు వాటాలు పంచుకున్నారని, 20కోట్లు సాయి కుమార్, 7కోట్లు వేంకటరమణ, 3కోట్లు రాజ్ కుమార్, 3కోట్లు వేంకటేశ్వర్ రావు, 6కోట్లు కృష్ణారెడ్డి, 2.5కోట్లు భూపతి, 6కోట్లు రమణా రెడ్డి, 50లక్షలు పద్మనాభన్, 30 లక్షలు మదన్, 10కోట్లు సత్యనారాయణ, 2.5 కోట్లు మస్తాన్ వలీ, 2కోట్లు కెనరా బ్యాంకు మేనేజర్ సాధన, 50 లక్షలు యోహన్ రాజు తీసుకున్నారని తెలిపారు. నిందితులు సాక్షులను తారుమారు చేసే అవకాశం ఉందని, కస్టడికి తీసుకొని విచారించాల్సి ఉందని చెప్పారు. అదేవిధంగా పరారీ నిందితుల కోసం గాలిస్తున్నామని సీసీఎస్ పోలీసులు రిమాండ్ రిపోర్టు వివరించారు. -
Telugu Academy: ఏడాది క్రితం నుంచే డబ్బులు కొట్టేసేందుకు కుట్ర
సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌లో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. నిందుతుల ఏడాది క్రితం నుంచే డబ్బులు కొట్టేసేందుకు కుట్ర పన్నారని తెలిసింది. అకాడమీ అకౌంట్స్ ఆఫీసర్ రమేష్‌తో కలిసి డబ్బులు కొట్టేసేందుకు ప్లాన్ చేశారు. అకాడమీ నుంచి 3 బ్యాంకుల్లో డిపాజిట్లకు సిఫార్సు చేశారు. బ్యాంకుల డిపాజిట్ల సందర్భంలోనే నకిలీ పత్రాలు, డైరెక్టర్, అకౌంట్ ఆఫీసర్ సంతకాలు ఫోర్జరీ వంటి అంశాలను సెట్ చేసుకున్నారు. సంవత్సర కాలానికి డిపాజిట్లు పెట్టి.. 15 రోజులకే మార్పు చేశారు. ఒరిజినల్ డిపాజిట్ల సర్టిఫికెట్లు తమ దగ్గరే ఉంచుకుని.. నకిలీ సర్టిఫికెట్లు అకాడమీకి ఇచ్చారు నిందితులు. ఒరిజినల్ ఎఫ్డీలతో 64.5 కోట్ల రూపాయలు డ్రా చేసింది ఈ ముఠా. ముందుగానే తెలుగు అకాడమీ పేరుతో నకిలీ అకౌంట్ ఓపెన్ చేశారు. అగ్రసేన్, ఏపీ మర్కంటైల్ సొసైటీల్లో నకిలీ ఖాతాలు సృష్టించారు. ఈ క్రమంలో యూనియన్, కెనరా బ్యాంకుల్లో కాజేసిన నిధులను ముందుగా అగ్రసేన్ బ్యాంక్‌కు తరలించారు. (చదవండి: తెలుగు అకాడమీ స్కాం: మరింత లోతుగా..) తర్వాత మర్కంటైల్ సొసైటీకి మళ్లించి 64.5 కోట్ల రూపాయలు డ్రా చేశారు. దీనిలో 6 కోట్ల రూపాయలను బ్యాంకు మేనేజర్లు, సొసైటీ సిబ్బందికి లంచంగా ఇచ్చారు. అకాడమీ అకౌంట్స్ ఆఫీసర్‌కు కోట్ల రూపాయల లంచం ఇచ్చిన ముఠా.. మిగతా మొత్తాన్ని రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టారు. మరి కొంతమంది నిందితులు కాజేసిన నిధులతో అప్పులు తీర్చుకున్నట్టు విచారణలో వెళ్లడయ్యింది. చదవండి: తెలుగు అకాడమీ స్కాం: మరో రూ.20 కోట్లకు స్కెచ్! -
తెలుగు భాష సంస్కృతం నుంచే మమేకమైందని గుర్తించాలి: లక్ష్మీపార్వతి
-
చంద్రబాబు హయాంలోనే తెలుగు అకాడమీ అస్థిత్వాన్ని కోల్పోయింది: మంత్రి సురేష్
-
‘బాబు హయాంలో తెలుగు అకాడమీ అస్థిత్వాన్ని కోల్పోయింది’
సాక్షి, అమరావతి: తెలుగు సంస్కృత అకాడమీపై విమర్శలెందుకో అర్థంకావడం లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. అకాడమీపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుభాష అభివృద్ధి, విస్తృతి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. చంద్రబాబు హయాంలో తెలుగు అకాడమీ అస్థిత్వాన్ని కోల్పోయిందని మండిపడ్డారు. తెలుగు, సంస్కృత భాషలను వేర్వేరుగా చూడలేమని, తెలుగుభాష మూలాలు తెలుసుకోవాలంటే పరిశోధన అవసరమని తెలిపారు. తెలుగు అకాడమీ ఆస్తుల పంపకంపై తెలంగాణతో చర్చించామని పేర్కొన్నారు. విభజన చట్టం మేరకు రూ.200 కోట్ల వరకు నిధులు రావాల్సి ఉందమని ఆయన తెలిపారు. తెలుగు అకాడమీ పబ్లికేషన్స్ డివిజన్‌ను గతంలో మూసేశారని అన్నారు. పోటీ పరీక్షలకు ఉపకరించే ఈ పబ్లికేషన్స్‌ను మళ్లీ మొదలుపెట్టాల్సి ఉందని మంత్రి చెప్పారు. -
తెలుగు అకాడమీ.. ఇకపై తెలుగు సంస్కృత అకాడమీ
సాక్షి, అమరావతి: తెలుగు అకాడమీ పేరును తెలుగు సంస్కృత అకాడమీగా మారుస్తూ ఉన్నత విద్యాశాఖ శనివారం ఉత్తర్వులిచ్చింది. దీనికి నలుగురు సభ్యులతో గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేసింది. ఎస్వీ వర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ డి.భాస్కరరెడ్డి, డా.రాజకుమార్ నేరెళ్ల, డా.ఎం.విజయశ్రీ, డా.కప్పనగంతు రామకృష్ణలను గవర్నింగ్ సభ్యులుగా నియమించింది. ఎక్స్ ఆఫీషియో మెంబర్‌గా పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఉంటారు. యూజీసీ నామినీగా తిరుపతి నేషనల్ సంస్కృత వర్సిటీ వీసీ మురళీధరశర్మను నియమించారు. -
తెలుగు అకాడమీని విభజించాలి
► ఏపీ విద్యార్థులకు ఆగిన పుస్తకాల సరఫరా ► హైకోర్టులో దాఖలైన పిల్ సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీని విభజించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పునర్విభజన చట్టం వచ్చాక ఏడాది మాత్రమే ఏపీ లోని విద్యార్థులకు పుస్తకాలు సరఫరా చేసిన తెలుగు అకాడమీ తర్వాత తెలంగాణకు మాత్రమే ఇస్తోందంటూ గుంటూరు జిల్లా వినుకొండ వాసి, ఆలిండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏపీ కౌన్సెల్ సభ్యుడు ఎం.వెంకట సుబ్బారావు పిల్ దాఖలు చేశారు. పునర్విభజన చట్టం సెక్షన్ 82 ప్రకారం పదో షెడ్యూల్లోని స్వతంత్ర సంస్థల్లో సిబ్బంది, ఆస్తులు, అప్పులను ఏడాదిలోగా విభజిం చాలని, మూడేళ్లయినా 61 సంస్థల్లోని వాటిని 2 రాష్ట్రాలకు పంపిణీ చేయలేద న్నారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిఏడాది మాత్రమే ఏపీకి పుస్తకాలను సరఫరా చేసిందన్నారు. తెలంగాణ కు మాత్రమే పుస్తకాలు సరఫరా చేయడం వల్ల ఏపీ విద్యార్థులు నష్టపోతున్నారన్నారు. ప్రతివాదులుగా కేంద్ర హోం శాఖతోపాటు, తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శులను చేశారు.