► ఏపీ విద్యార్థులకు ఆగిన పుస్తకాల సరఫరా
► హైకోర్టులో దాఖలైన పిల్
సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీని విభజించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పునర్విభజన చట్టం వచ్చాక ఏడాది మాత్రమే ఏపీ లోని విద్యార్థులకు పుస్తకాలు సరఫరా చేసిన తెలుగు అకాడమీ తర్వాత తెలంగాణకు మాత్రమే ఇస్తోందంటూ గుంటూరు జిల్లా వినుకొండ వాసి, ఆలిండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏపీ కౌన్సెల్ సభ్యుడు ఎం.వెంకట సుబ్బారావు పిల్ దాఖలు చేశారు.
పునర్విభజన చట్టం సెక్షన్ 82 ప్రకారం పదో షెడ్యూల్‌లోని స్వతంత్ర సంస్థల్లో సిబ్బంది, ఆస్తులు, అప్పులను ఏడాదిలోగా విభజిం చాలని, మూడేళ్లయినా 61 సంస్థల్లోని వాటిని 2 రాష్ట్రాలకు పంపిణీ చేయలేద న్నారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిఏడాది మాత్రమే ఏపీకి పుస్తకాలను సరఫరా చేసిందన్నారు. తెలంగాణ కు మాత్రమే పుస్తకాలు సరఫరా చేయడం వల్ల ఏపీ విద్యార్థులు నష్టపోతున్నారన్నారు. ప్రతివాదులుగా కేంద్ర హోం శాఖతోపాటు, తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శులను చేశారు.