వాషింగ్టన్: సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ సంస్థ వేలాది ఫేక్ న్యూస్ అకౌంట్లను శుక్రవారం తొలగించింది. సౌదీ అరేబియాలో యుద్ధం అంటూ సౌదీకి అనుకూలంగా తప్పుడు సమాచారం శుక్రవారం ట్విటర్‌లో వైరల్ కావడంతో ట్విటర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అదేవిధంగా హాంకాంగ్‌లో ఆందోళనల గురించి చైనా నుంచి వస్తున్న పోస్టులకు సంబంధించిన అకౌంట్లను కూడా ట్విటర్ రద్దు చేసింది. ఇంకా స్పెయిన్, ఈక్వెడార్‌లోని అదనపు ఫేక్ అకౌంట్లను తొలగించింది. హాంకాంగ్ నిరసనకారుల గురించి పోస్టులు పెడుతున్న 4302 నకిలీ ఖాతాలను రద్దు చేసినట్టు ట్విటర్ వెల్లడించింది. హాంకాంగ్‌లో నిరసనలపై పోస్టులు పెట్టిన చైనా చెందిన 2 లక్షల నకిలీ ఖాతాలను గత ఆగస్టులో ట్విటర్ తొలగించింది. (చదవండి: ట్విటర్ సీఈవో అకౌంట్ హ్యాక్)
Comments
Please login to add a commentAdd a comment