హైదరాబాద్: క్యాసినో, హవాలా వ్యవహారాలకు సంబంధించి చీకోటి ప్రవీణ్ కేసు సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ చేస్తోంది. ఈ క్రమంలోనే చికోటి ప్రవీణ్ ట్వీట్స్ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చీకోటి ప్రవీణ్ పేరుతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసినట్లు తెలిసింది. @praveenchikotii పేరుతో ట్విట్టర్‌లో నకిలీ ఖాతాను గుర్తించాడు చీకోటి ప్రవీణ్. వాటి ద్వారా ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నేతలను ప్రవీణ్ బెదిరిస్తున్నట్టు.. ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను సైతం ఆయా ట్వీట్లలో ప్రస్తావిస్తు ఫేక్ పోస్ట్‌లు పెట్టినట్లు సమాచారం.
సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు..
సోషల్ మీడియాల్లో ఫేక్ అకౌంట్లపై ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించాడు చీకోటి ప్రవీణ్. తప్పుడు ఫేక్ అకౌంట్‌లపై చర్యలు తీసుకుంటానని పేర్కొన‍్నాడు. ఆయా నకిలీ ఖాతాలపై చర్యలు తీసుకోవాలని.. సీసీఎస్ పోలీస్‌లకు ఫిర్యాదు చేశాడు ప్రవీణ్. ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: ‘చీకోటి’ ల్యాప్‌టాప్‌లో ఏముంది?.. ఈడీ ముందుకు ప్రవీణ్
Comments
Please login to add a commentAdd a comment