ఆ హీరోయిన్ పేరుతో ఉన్నవన్నీ నకిలీ ఎకౌంట్లే | Rani Mukerji not on social media | Sakshi
Sakshi News home page

ఆ హీరోయిన్ పేరుతో ఉన్నవన్నీ నకిలీ ఎకౌంట్లే

Published Mon, Jul 11 2016 4:33 PM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM

ఆ హీరోయిన్ పేరుతో ఉన్నవన్నీ నకిలీ ఎకౌంట్లే - Sakshi

ఆ హీరోయిన్ పేరుతో ఉన్నవన్నీ నకిలీ ఎకౌంట్లే

ముంబై: హీరో, హీరోయిన్ల పేరుతో కొందరు సోషల్ మీడియాలో నకిలీ ఎకౌంట్లు ఓపెన్ చేయడం, అందులో వారి విషయాలు, ఫొటోలను పోస్ట్ చేసిన సంఘటనలు గతంలో వెలుగుచూశాయి. ఈ తర్వాత సంబంధిత నటులు ఈ విషయం తెలుసుకుని స్పందించారు. అవి నకిలీ ఎకౌంట్లను, తమకు సంబంధంలేదని స్పష్టం చేశారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ రాణి ముఖర్జీకి ఇలాంటి అనుభవమే ఎదురైంది.

రాణి ముఖర్జీ ముద్దుల తనయ అడిరా ఫొటో ఇంటర్నెట్లో చక్కర్లుకొట్టడంతో ఆమె తరఫున ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశాడు. రాణి ముఖర్జీకి ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనూ ఎకౌంట్ లేదని తెలియజేశాడు. ఇక మీదట కూడా ఉండబోదని చెప్పాడు. సోషల్ మీడియాలో రాణి ముఖర్జీ పేరు మీద నకిలీ ఎకౌంట్లు చాలా ఉన్నాయని ఆమె ప్రతినిధి వెల్లడించారు. అభిమానులు ఈ విషయాన్ని గుర్తించుకోవాలని, రాణి పేరు మీదున్న ఎకౌంట్లను ఫాలోకావద్దని, వాటిలో పోస్ట్ చేసే వివరాలు నిజంకాదని చెప్పాడు.

2014లో రాణి ముఖర్జీ నిర్మాత ఆదిత్య చోప్రాను ఇటలీలో వివాహం చేసుకుంది. ఈ దంపతులకు గతేడాది డిసెంబర్లో ఓ పాప జన్మించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement