
సోషల్ మీడియాలో సెలబ్రిటీల పేరిట నకిలీ ఖాతాలు సృష్టించడం కొందరు ఆకతాయిలకు పరిపాటిగా మారింది. ముఖ్యంగా అధికారిక గుర్తింపు లేని ఖాతాలు కలిగిన నటీనటులకు ఇది చాలా ఇబ్బందికరంగా మారింది. అభిమానులు కూడా ఇందులో ఏది నిజమైన అకౌంట్ తేల్చుకోలేకపోతున్నారు. పలు సందర్భాల్లో ఫేక్ అకౌంట్ల ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడంతో సెలబ్రిటీలు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ప్రముఖ నటి నివేదా పేతురాజ్ పేరిట కూడా ట్విటర్‌లో పదులు సంఖ్యల్లో అకౌంట్‌లు ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ వీడియో విడుదల చేసిన నివేదా.. వాటిని నమ్మవద్దని కోరారు. దయచేసిన ఫేక్ అకౌంట్లను ఎంకరేజ్ చేయవద్దని చెప్పారు.
‘ట్విటర్‌లో పెద్ద సంఖ్యలో నా పేరు మీద ఫేక్ అకౌంట్‌లు ఉన్నాయి. @Nivetha_Tweets అనేది నాకున్న ఏకైక ట్విటర్ ఐడీ. ఫేక్ అకౌంట్లను ఎంకరేజ్ చేయండి. నా ఖాతాకు వెరిఫై చేయించడానికి ప్రయత్నిస్తున్నాను’ అని నివేదా తెలిపారు. కాగా, చెన్నైలో పుట్టిన నివేదా.. తన బాల్యం అంతా దుబాయ్‌లో గడిపారు. తొలుత మోడలింగ్ రంగాన్ని ఎంచుకున్న ఆమె.. తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాలతో ఆమె బిజీగా ఉన్నారు. ఇటీవల విడుదలైన అల.. వైకుంఠపురములో.. చిత్రంలో ఆమె సుశాంత్‌కు జోడిగా కనిపించారు. తెలుగులో ప్రస్తుతం ఆమె కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ హీరోగా నటిస్తున్న రెడ్ చిత్రంలో నటిస్తున్నారు.
చదవండి : నిఖిల్ పెళ్లి మరోసారి వాయిదా..
Comments
Please login to add a commentAdd a comment