పోలీసులతో హీరోయిన్‌ గొడవ.. వీడియో వైరల్‌ | Nivetha Pethuraj Argue With Police, Video Goes Viral | Sakshi
Sakshi News home page

పోలీసులతో హీరోయిన్‌ గొడవ.. వీడియో వైరల్‌

May 30 2024 11:32 AM | Updated on May 30 2024 12:38 PM

Nivetha Pethuraj Argue With Police, Video Goes Viral

నివేతా పేతురాజ్‌.. తమిళనాడుకు చెందిన  ఈ బ్యూటీ 'మెంటల్‌ మదిలో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత చిత్రలహరి మూవీతో ఇక్కడ మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఆపై విశ్వక్‌ సేన్‌తో కలిసి నటించిన పాగల్‌, దాస్‌ కా దమ్కీ చిత్రాలతో తన మార్క్‌ నటనతో ఫిదా చేసింది. అయితే, సుమారు రెండేళ్లుగా ఆమె నటించిన సినిమా ఏదీ కూడా తెరపై కనిపించలేదు. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది.

నివేతా పేతురాజ్‌ కారులో వెళ్తున్న సమయంలో చెకింగ్‌ పేరుతో పోలీసులు ఆపుతారు. కారు డిక్కీ ఓపెన్‌ చేయమని ఆమెను పోలీసులు కోరడంతో అందుకు ఆమె నిరాకరిస్తుంది. ఎందుకు ఓపెన్‌ చేయాలని చిన్నపాటి గొడవకు దిగుతుంది. పేపర్లు అన్నీ ఉన్నాయి కావాలంటే చెక్‌ చేసుకోండి అంటూ వారిస్తుంది. 'కారు డిక్కి మాత్రం ఓపెన్‌ చేయను, అది నా పరువుకు సంబంధించిన అంశం. మీకు చెప్పినా అర్థం కాదు. నేను డిక్కీ మాత్రం ఓపెన్‌ చేయను అంటూ.. పోలీసులతో గొడవకు దిగుతుంది. ఈ క్రమంలో వీడియో తీస్తున్న పోలీసును ఆమె అడ్డగిస్తుంది. ఈ వివాధానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది.

ఈ వీడియో చూసిన ప్రేక్షకులు తమదైన స్టైల్లో కామెంట్లు చేస్తున్నారు. ఇదంతా ఏదైనా సినిమా ప్రమోషన్‌ అయి ఉండవచ్చని చెబుతున్నారు. అదీ కాకుంటే తన నటిస్తున్న కొత్త సినిమాకు సంబంధించిన ఒక సీన్‌ అయి ఉంటుందని ఆమె తెలుపుతున్నారు. పోలీసులుగా ఉన్న వారిలో ఒకరు సాధారణ చెప్పులు ధరించడాన్ని నెటిజన్లు గుర్తించారు. డ్యూటీలో ఉన్న పోలీసు అధికారులు తప్పకుండా షూస్‌ ధరిస్తారని తెలిసిందే. దీంతో ఇదంతా సినిమా స్టంట్‌ అని నెటిజన్లు చెబుతున్నారు.  ఇంత చక్కగా అమ్మాయి నటిస్తుంటే ప్రమోషన్స్‌ ఎందుకు..? అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. 

కొత్త సినిమా అప్‌డేట్‌?
నివేదా పేతురాజ్..మొన్నటి వరకు అటు తమిళ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ వరుస సినిమాలతో అలరించింది. టాలీవుడ్‌లో చివరగా ఈ బ్యూటీ విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘దాస్ కా ధమ్కీ(2023)’ చిత్రంలో నటించింది. ఈ వెంటనే ఆమె నటించిన హిందీ వెబ్‌ సిరీస్‌ ‘కాలా’ కూడా రిలీజైంది. ప్రస్తుతం అటు తమిళ్‌లో కానీ ఇటు తెలుగు కానీ నివేదాకు సినిమాలు లేవు. దీంతో తన కొత్త సినిమా ప్రకటన అందరికి రీచ్‌ అవ్వాలనే ఇలాంటి ఫ్రాంక్‌ వీడియో ప్లాన్‌ చేసిందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement