ప్రేమమ్ హీరోతో 'పెళ్లిచూపులు' | Pelli Choopulu remake with Premam Hero Nivin pauly | Sakshi
Sakshi News home page

ప్రేమమ్ హీరోతో 'పెళ్లిచూపులు'

Published Sun, Nov 27 2016 12:30 PM | Last Updated on Mon, Sep 4 2017 9:17 PM

ప్రేమమ్ హీరోతో 'పెళ్లిచూపులు'

ప్రేమమ్ హీరోతో 'పెళ్లిచూపులు'

ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై ఘనవిజయం నమోదు చేసిన చిత్రం పెళ్లిచూపులు. తరుణ్ భాసర్క్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రీతూవర్మ జంటగా తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాదించటంతో ఇతర భాషల నుంచి భారీగా రీమేక్ ఆఫర్స్ వచ్చాయి. ఇప్పటికే హిందీతో పాటు దక్షిణాది భాషలన్నింటిలో పెళ్లి చూపులు రీమేక్కు సన్నాహాలు జరుగుతున్నాయి. అన్ని భాషల్లో స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ సినిమా రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నారు.

దక్షిణాదిలో ఈ సినిమా రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్, ప్రేమమ్ ఫేం నివీన్ పౌలీ హీరోగా రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు. నివీన్ మలయాళ స్టార్ కావటంతో తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించనున్నాడు. ప్రేమమ్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న నివీన్, పెళ్లి చూపులు రీమేక్తో మరోసారి మ్యాజిక్ రిపీట్ చేస్తాడని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement