గ్రీన్‌సిగ్నల్‌ | Nayanthara and Nivin Pauly Reunite for Dear Student | Sakshi
Sakshi News home page

గ్రీన్‌సిగ్నల్‌

Published Mon, Apr 15 2024 2:27 AM | Last Updated on Mon, Apr 15 2024 2:27 AM

Nayanthara and Nivin Pauly Reunite for Dear Student - Sakshi

మలయాళ చిత్రం ‘డియర్‌ స్టూడెంట్స్‌’ సినిమాకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు నయనతార. మలయాళ నటుడు నివిన్‌ ΄పౌలి నటించనున్న చిత్రం ‘డియర్‌ స్టూడెంట్స్‌’. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించనున్నారామె. ఈ విషయాన్ని మేకర్స్‌ అధికారికంగా ప్రకటించి, ‘డియర్‌ స్టూడెంట్స్‌’ చిత్రంలో నయనతార నటిస్తున్నట్లు ఓ మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు.

సందీప్‌ కుమార్‌ అండ్‌ జార్జ్‌ ఫిలిప్‌ రాయ్‌ ద్వయం ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. నివిన్‌ ΄పౌలికి చెందిన ΄పౌలి జూనియర్‌ పిక్చర్స్, కర్మ మీడియా నెట్‌వర్క్‌ ఎల్‌ఎల్‌పీ, రౌడీ పిక్చర్స్‌ అండ్‌ అల్ట్రా కలిసి ‘డియర్‌ స్టూడెంట్స్‌’ చిత్రాన్ని నిర్మించనున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement