Koffee With Karan: Fans Trolls On Karan Johar Over His Comments On Nayanthara Stardom - Sakshi
Sakshi News home page

Nayanthara: నయనతారను కించపరిచిన ప్రముఖ నిర్మాత.. కరణ్‌కు ఫ్యాన్స్‌ చురకలు

Published Tue, Jul 26 2022 4:28 PM | Last Updated on Tue, Jul 26 2022 5:25 PM

Nayanthara Fans Slams Karan Johar Over His Comments In Koffee With Kara - Sakshi

స్టార్‌ హీరోయిన్‌ నయనతార ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన నటనతో తొలి సౌత్‌ లేడీ సూపర్‌స్టార్‌గా ఎదిగింది. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే ఆమెకు దక్షిణాన విపరీతమైన క్రేజ్‌ ఉంది. హీరోలకు సమానంగా పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఆమెదే మొదటి స్థానం. అలాంటి నయన్‌పై ప్రముఖ దర్శకుడు, నిర్మాత సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. దీంతో సదరు నిర్మాతపై నయన్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. కాగా ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌ హోస్ట్‌గా వస్తున్న కాఫీ విత్‌ కరణ్‌ షోలో రీసెంట్‌గా సమంత పాల్గొన్న సంగతి తెలిసిందే. 

చదవండి: జై బాలయ్య అంటూ ఈలలు వేస్తూ పెద్దావిడ రచ్చ, వీడియో వైరల్‌

ఈ సందర్భంగా సామ్‌ను ప్రస్తుతం సౌత్‌లో నెంబర్‌ వన్‌ హీరోయిన్‌ ఎవరని అనుకుంటున్నారని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా.. 'సౌత్‌లో బిగ్గెస్ట్‌ హీరోయిన్‌ అయిన నయనతారతో ఇటీవల నేను ఓ సినిమాను చేశాను. తనతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది’ అంటూ పరోక్షంగా నయనతార పేరు చెప్పంది సమంత. అయితే దీనికి కరణ్‌ ‘కానీ.. తను నా జాబితాలో లేదు’ అంటూ వ్యాఖ్యానించాడు. ఇక కరణ్‌ కామెంట్స్‌పై నయన్‌ ఫ్యాన్స్‌ అసహనం వ్యక్తం చేస్తున్నారు. సౌత్‌ లేడీ సూపర్‌ స్టార్‌ అయిన నయన్‌ను గుర్తించలేదనడం ఇది ఆమెను కించపరిచనట్లే అంటున్నారు.

అంతేకాదు స్టుపిడ్‌ కాఫీ విత్‌ కరణ్‌ షోలో నయనతారు అవమానించే అర్హత ఆయనకు లేదు. తను సాధించిన విజయంలో కనీసం సగం కూడా నువ్వు సాధించేలేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండ తన సొంతగా స్టార్‌గా ఎదిగారు. మీలా నెపోటిజంతో ఎదగలేదు’, ‘ఇంతకి ఈ కరణ్‌ జోహార్‌ ఎవరూ?’ అంటూ కరణ్‌ను ఏకిపారేస్తున్నారు. అంతేకాదు ధర్మ ప్రొడక్ష్‌న్‌, కరణ్‌ జోహార్‌ను అసలు బ్యాన్‌ చేయాలంటూ ట్విటర్‌ వేదికగా కరణ్‌పై నయన్‌ ఫ్యాన్స్‌ విరుచుకుపడుతున్నారు. అయితే ప్రస్తుతం కరణ్ నిర్మిస్తున్న జాన్వీ కపూర్ మూవీ 'గుడ్ లక్ జెర్రీ'.. నయన్ నటించిన 'కొలమాను కోకిల' రీమేక్ అని మర్చిపోవద్దని గుర్తుచేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు సౌత్ నటీనటులపై కాంట్రవర్షియల్ వ్యాఖ్యలు చేసిన కరణ్.. మరోసారి నయన్ గురించి అలా అనడం హాట్ టాపిక్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement