![Nayanthara Special Gift For Samantha - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/31/nayan.gif.webp?itok=wX0wEc4A)
స్టార్ హీరోయిన్ సమంత కోలీవుడ్‌లో కాతువాకుల రెండు కాదల్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ట్రయాంగిల్ ప్రేమకథతో రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ సేతపతి, నయనతార నటించారు. నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా ద్వారా నయనతార, సమంతల మధ్యఫ్రెండ్‌షిప్ మరింత బలపడినట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలో సమంత కోసం నయనతార ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్ పంపించింది. 'డియర్ ఖతీజా.. విత్ లవ్.. కణ్మణి' అంటూ నయన్ సమంత కోసం కాస్ట్‌లీ గిఫ్ట్ పంపించింది. దీనికి సంబంధించిన ఫోటోలను సామ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. థ్యాంక్యూ డార్లింగ్ నయన్ అంటూ పోస్ట్ చేసింది. తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా ఏప్రిల్ 28న విడుదల కానుంది. కాగా ఈ చిత్రంతో పాటు శాకుంతలం, యశోద సినిమాలతో పాటు సామ్ హిందీలో ఓ వెబ్‌సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment