
దక్షిణాదిలో అగ్ర కథానాయికగా రాణిస్తున్న నటి నయనతార. ఈమె గురించి నిత్యం ఏదో ఒక వార్త ప్రచారం అవుతునే ఉంటుంది. ఎక్కడో కేరళలో పుట్టి కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి కథానాయికగా గుర్తింపు పొంది నంబర్ వన్ స్థానానికి చేరుకోవడమే కాకుండా లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకుంది.
తాజాగా జవాన్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నయన్ ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు, అవమానాలు, అంతకుమించి శ్రమపడింది. నటిగా మంచి పేరు తెచ్చుకున్నా, వ్యక్తిగతంగా చాలా చేదు అనుభవాలను చవి చూసింది. మొదట్లో నటుడు శింబుతో ప్రేమాయణం, ఆ కథ కంచికి చేరడంతో ఆపై ప్రభుదేవాతో చట్టాపట్టాల్, అదీ మానసిక క్షోభనే మిగల్చడంతో కొంతకాలం ప్రేమ, పెళ్లి విషయాలను పక్కనపెట్టి నటనపైనే దృష్టి సారించింది.
చదవండి: (సూపర్ స్పీడ్)
అలాంటి పరిస్థితుల్లో దర్శకుడు విఘ్నేష్ శివన్ ఆమె మనసులో చోటు సంపాదించుకున్నాడు. అలా వీరిద్దరి మధ్య ప్రేమ సహజీవనానికి దారి తీసింది. అలా వీరి ప్రేమ ఇటీవలే పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెలిసింది. ఇక నటిగా కోట్లకు పడగలెత్తిన నయనతార తాజాగా అమ్మతనం కోసం ఆరాట పడుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. నాలుగు పదుల వయసు టచ్ చేసిన నయనతార పిల్లలను కనడానికి సమయం మించిపోతోందని భావించినట్లు, అందువల్ల తల్లి కావాలని కోరుకుంటున్నట్లు తన స్నేహితులతో చెప్పినట్లు సమాచారం.
ఈ క్రమంలో నటనకు గుడ్ బై చెప్పాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే సినిమాలకు పూర్తిగా దూరం కాకుండా నిర్మాతగా మంచి చిత్రాలు నిర్మించాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇందులో నిజం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. అయినా అగ్రకథానాయికగా రాణిస్తున్న నయనతార అంత సులభంగా నటనకు దూరం కాగలుగుతుందా? అన్నది కొశ్చన్ మార్కే.
Comments
Please login to add a commentAdd a comment