తన ఆవరణలోని పొదల్లో చిక్కుకున్న ఎర్ర రంగు గాలిబుడగను చూసి అమెరికా–మెక్సికో సరిహద్దుల్లోని అరిజోనా రాష్ట్రం పాటగోనియాకు చెందిన రాండీ హెయిస్ ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే పగిలిపోయిన ఓ బెలూన్ దారపు కొనకు ఓ చిన్నారి రాసిన ఆశల చిట్టా ఉంది. అది స్పానిష్‌లో రాసి ఉంది. స్పానిష్ చదవడం రాకపోయినా కూడా అందులోని భావం అర్థమయింది తనకు. ఆ ఎరుపురంగు బెలూన్‌తో పాటు సరిహద్దులు దాటి వచ్చిన పాపాయి కోరికల జాబితా 60 ఏళ్ల వయసున్న రాండీ హెయిస్‌ను తన చిన్ననాటి జ్ఞాపకాల్లోకి నడిపించింది. తను కూడా చిన్నప్పుడు ఇలా తనకేమేం కావాలో జాబితా రాసి బెలూన్‌తో సహా ఎగరేస్తే తెల్లారేసరికల్లా శాంతాక్లాజా బహుమానాలు మోసుకొచ్చేస్తాడని భావించేవాడు రాండీ హెయిస్.
కానీ ఏ ఒక్క క్రిస్‌మస్‌కి కూడా తన కోరికలు తీర్చేందుకు శాంతాక్లాజా దిగిరాలేదు. అందుకే సరిహద్దులు దాటి వచ్చిన ఆ చిట్టాలోని చిన్నారి కోర్కెలను ఎలాగైనా తీర్చాలనుకున్నాడు హెయిస్. అది కష్టమైన పనే.. కానీ ఆయనకి కొన్ని క్లూస్ ఉన్నాయి. అయితే అదంత సులభమేం కాదు. ఎక్కడినుంచి ఎగిరివచ్చిందో తెలియని ఆ పాపాయి అడ్రస్ కోసం వేట ప్రారంభించాడు. సరిహద్దులకావల సౌత్ వెస్ట్‌లో 20 మైళ్ల దూరంలో మెక్సికోలో నోగేల్స్ అనే పట్టణం ఉంది. చిన్నారి పేరు దయామి అని తెలుసుకున్నాడు. గౌన్లు, ఎంచాంటిమల్స్ అనే బొమ్మలు, ఇతర దుస్తులూ తదితరాలేవో రాసి ఉన్నాయి. దయామి గురించి తెలుసుకోవాలన్న తన తపనను ఫేస్‌బుక్‌లో పెట్టాడు హెయిస్. ఈ బుధవారం నోగెల్స్‌లోని స్థానిక జెనీ రేడియో స్టేషన్ ఫేస్‌బుక్ పేజీలో ఈ విషయాన్ని పోస్ట్ చేశాడు. దయామిని కనుగొన్నామనీ తమ రేడియో స్టేషన్‌లోనే ఆ చిన్నారిని పరిచయం చేస్తామనీ కబురు పంపాడు. దీంతో ఆ రేడియో స్టేషన్‌కు వెళ్లి దయామికి కోరుకున్న బహుమతులన్నీ ఇచ్చారు.
క్రిస్‌మస్ తాతయ్య వచ్చాడు.!
Published Sun, Dec 23 2018 1:25 AM | Last Updated on Sun, Dec 23 2018 11:23 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment