జీసస్ సమైక్యాంధ్రను బహుమతిగా ఇవ్వు | MP Sivaprasad new dress | Sakshi
Sakshi News home page

జీసస్ సమైక్యాంధ్రను బహుమతిగా ఇవ్వు

Published Wed, Dec 25 2013 3:53 PM | Last Updated on Thu, Aug 9 2018 9:09 PM

శాంతా క్లాజ్ వేషంలో శివప్రసాద్ - ఫొటో: ఎన్.మురళి, ఫొటోగ్రాఫర్, చిత్తూరు - Sakshi

శాంతా క్లాజ్ వేషంలో శివప్రసాద్ - ఫొటో: ఎన్.మురళి, ఫొటోగ్రాఫర్, చిత్తూరు

చిత్తూరు: విచిత్ర వేషధారణతో సమైక్యాంధ్ర గురించి ప్రచారం చేస్తున్న టిడిపి ఎంపీ శివప్రసాద్ ఈ రోజు మరో కొత్త వేషం వేశారు. క్రిస్మస్ సందర్భంగా చిత్తూరులో ఆయన శాంతా క్లాజ్ వేషం వేశారు. సమైక్యాంధ్ర చాక్లెట్లు పంచారు. జీసస్ ప్రభు సమైక్యాంధ్రను మాకు బహుమతిగా ఇవ్వు అని పాట కూడా పాడారు. తనతోపాటు పిల్లలను కూడా పాట పాడమని ఆయన కోరారు.

శివప్రసాద్ గతంలో ఢిల్లీలో కూడా అనేక రకాల వేషధారణలతో వార్తలకెక్కారు. కృష్ణుడు, నారదుడు వంటి పౌరాణిక పాత్రల వేషంలో, బుడబుక్కల వాడి వంటి అనేక వేషాలు వేయడం ద్వారా ఆయన  రాష్ట్ర విభజనకు వ్యతిరేకత తెలిపారు. రాష్ట్ర విభజనకు శివప్రసాద్ వంటి వారు ఎంత వ్యతిరేకత తెలిపినా, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం సమైక్యాంధ్రకు మద్దతు తెలుపరు. ఆయన విభజనకే మద్దతు తెలుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement