New dress
-
ఆహా నా డ్రెస్ అంటా.... ఏఐ డ్రెస్ అంటా...
గూగుల్ సాప్ట్వేర్ ఇంజనీర్ క్రిస్టినా ఎర్నెస్ట్ సృష్టించిన ‘వరల్డ్స్ ఫస్ట్ ఏఐ డ్రెస్’ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ రోబోటిక్ మిదాస్ డ్రెస్ వీడియో 3.6 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. ఈ బ్లాక్ డ్రెస్‌లో ఎన్నో రోబోటిక్ పాములు ఉన్నాయి. చాలామంది ఈ డ్రెస్‌కు ‘ఎక్స్ట్రార్డినరీ’ అని కితాబు ఇవ్వగా కొద్దిమంది మాత్రం ‘బోరింగ్’ అని పెదవి విరిచారు. -
శిథిల దృశ్యం: అంతా బాగుంటే కొత్త డ్రెస్ వేసుకుని.. సందడి చేసేది, కానీ!
కీవ్: ఉక్రెయిన్-రష్యా ఉద్రిక్తతలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. నగరాలు, పట్టణాలను అధీనంలోకి తెచ్చుకునేందుకు మాస్కో సైన్యం ప్రణాళికలు రచిస్తుండగా ఉక్రెయిన్ ఆర్మీ తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తోంది. ఈక్రమంలో కార్యాలయాలు, పాఠశాలలు, పార్కులు, నివాసాలు నేలమట్టమవుతున్నాయి. మరోవైపు రష్యా సైన్యం దాడుల్లో నిత్యం 100 మంది దాకా తమ సైనికులు మరణిస్తున్నారని ఉక్రెయిన్ రక్షణ శాఖ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్ తెలిపారు. రక్తపాతం బాధాకరమని ఫేస్బుక్లో పోస్టు చేశారు. తమ బిడ్డలను కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి👉🏼 పాకిస్తాన్లో హిందూ జనాభా ఎంతో తెలుసా? ఈక్రమంలో ఓ విద్యార్థిని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫొటో కలచివేస్తోంది. ‘అన్నీ బాగుంటే ఈ ఫొటోలో కనిపిస్తున్న అన్నా ఎపిసెవా ఈ ఏడాది తన హైస్కూల్ చదువును పూర్తి చేసేది. ఘనంగా జరిగే తన స్కూల్ వార్షిక సదస్సులో ఆమె, ఆమె స్నేహితులు పాల్గొని సందడి చేసేవారు. అందుకోసం వారంతా కొత్త బట్టలు కూడా కొని తెచ్చుకున్నారు. కానీ, పరిస్థితులు తల్లకిందులయ్యాయి. మాయదారి యుద్ధం కలలను కల్లలు చేసింది. దేశాన్ని, తమ పాఠశాలను సర్వనాశం చేసింది. శిథిలాలుగా మిగిలిపోయిన తన స్కూల్ వద్ద ఎపిసెవా కొత్త డ్రెస్సు ధరించి మౌన రోదన చేసేది కాదు!’ అని ఒలెక్సాండ్రా మాత్విచుక్ తన కజిన్ గురించి ఆవేదనభరితంగా ట్విటర్లో రాసుకొచ్చింది. ఎపిసెవా ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి👉🏼 ప్రవక్త కామెంట్లు: అజిత్ దోవల్ పేరుతో ‘గుణపాఠం ట్వీట్’.. కాసేపటికే డిలీట్ Anna Episheva: My niece was supposed to graduate this year from her high school. She and her friends bought dresses and were looking forward to this day. Then Russians came. Her school was directly hit and destroyed. Today she came back to what is left of her school and her plans pic.twitter.com/q9cJW2j8f0 — Oleksandra Matviichuk (@avalaina) June 7, 2022 -
కొత్త డ్రెస్ కొనిస్తానని తీస్కెళ్లిన అంకుల్.. రైలు పట్టాల చాటున
న్యూఢిల్లీ: బాలికకు కొత్త బట్టలు కొనిస్తానని నమ్మించి బయటకు తీసుకెళ్లిన ఓ వ్యక్తి బట్టలు ఇప్పించకుండా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తన కూతురి వయసు ఉన్న బాలికను రైలు పట్టాల సమీపంలోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయం ఇంట్లో వారికి చెప్పొద్దని బెదిరించాడు. ఇంటికొచ్చిన బాలిక ముభావంగా ఉండడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన 27 ఏళ్ల ఓ వ్యక్తి ఢిల్లీలోని షాలిమార్ బాగ్‌లో నివసిస్తున్నాడు. ఈ ఆదివారం (జూలై 25) ఓ వస్తువు కొనేందుకు ఇంటికెళ్లి బయటకు వచ్చిన తొమ్మిదేళ్ల బాలికను అతడు పరిచయం చేసుకున్నాడు. బాలికను మాటల్లోకి దించి నీకు కొత్త దుస్తులు కొనిస్తానని చెప్పి నమ్మించాడు. మాయ మాటలను నమ్మిన బాలిక అతడి వెంట వెళ్లింది. శాంతి అనే ప్రాంతానికి తీసుకెళ్లి రైలు పట్టాల సమీపంలో బాలికపై బలత్కారం చేశాడు. అనంతరం ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయాడు. బాలిక విచిత్రంగా ప్రవర్తించడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు ఆమె అత్యాచారానికి గురయ్యిందని తెలిపారు. వెంటనే కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. సీసీ ఫుటేజీ పరిశీలించగా అతడి ఆచూకీ లభించింది. వాజీర్‌పూర్ ప్రాంతంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ ఉష రంగనాని తెలిపారు. ఆ వ్యక్తి పలు కర్మాగారాల్లో స్వీపర్‌గా పని చేసేవాడని తెలిసింది. అతడిపై పలు కేసులు నమోదై ఉన్నాయి. స్వగ్రామం రాంపూర్‌లో ఉన్నప్పుడు కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆస్పత్రి నుంచి తప్పించుకుని ఢిల్లీ చేరాడు. దీనిపై అజీమ్‌నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. -
పూలనే చుట్టేయమంటా...
‘పూలనే కునుకేయమంటా... తను వచ్చెనంటా..’ పాట ‘ఐ’ సినిమాలోనిది. విక్రమ్, అమీ జాక్సన్‌లపై పూల మధ్య సాగే ఈ పాట కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు అదా శర్మ ‘పూలనే చుట్టేయమంటా..’ అంటున్నారు. అనడమే కాదు.. చుట్టుకున్నారు కూడా. పూల మొక్కలనే టాప్లా చేసుకుని, ధరించారామె. ఆ ఫొటోను షేర్ చేశారు అదా శర్మ. ‘ఈ సహజ సిద్ధమైన టాప్ చాలా బాగుంది. మీరు చాలా చాలా బాగున్నారు’ అంటూ అదా అభిమానులు ఆమెకు మెసేజ్ పెట్టారు. ఇలా ప్రత్యేకంగా తయారవ్వడం అదాకు ఇది మొదటిదేం కాదు. సమయం కుదిరినప్పుడల్లా ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఫొటోలను అభిమానులతో పంచుకుంటారామె. -
పండుగ కళ కనిపించాలి
పండుగ రోజున డ్రెస్‌కు తగ్గట్టు అలంకరణ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. అప్పుడే కళగా కనిపిస్తారు. కొందరు కేవలం ముఖం ఒక్కటే బాగుంటే చాలు అనుకుంటారు. అలా కాకుండా కాలి వేళ్ల నుంచి కేశాల వరకూ పండగరోజున ప్రత్యేక అలంకరణతో మెరిసిపోవచ్చు. ►డ్రెస్ ఎంపిక పండగ కళను రెట్టింపు చేసేదై ఉండాలి. చీరలైనా, డ్రెస్సులైనా.. కాంతిమంతమైన రంగులు, డిజైనర్ వర్క్, మిర్రర్‌వర్క్.. వంటివి సౌకర్యంగా ఉండేవి ఎంచుకోవాలి. ►ఎదుటివారి చూపు వేసుకున్న డ్రెస్ తర్వాత మన కేశాలంకరణ మీద పడుతుంది. తలకు నూనె పెడితే ముఖం జిడ్డుగా కనిపిస్తుంది కాబట్టి శిరోజాలను శుభ్రపరిచి, ఆరబెట్టుకున్నాక సంప్రదాయ అల్లికలను ఎంచుకోవాలి. వీటిలో జడ లేదా ముడులలోనే ప్రత్యేక అలంకరణలు బాగుంటాయి. ►ముఖారవిందానికి కళ తెచ్చేవి కళ్లు, కనుబొమ్మలు, పెదాలు. ఎండ, ఉక్కపోతను దృష్టిలో పెట్టుకొని ఫౌండేషన్ ఎక్కువ వాడకుండా కళ్లు, కనుబొమ్మలు, పెదాలను తీర్చిదిద్దుకోవాలి. -
రీమేక్ న్యూ లుక్
ఆనాటి చీరలు ఈనాడు కొత్త హంగులు అద్దుకుంటున్నాయి. ట్రంకు పెట్టెల్లో భద్రపరిచిన అమ్మమ్మ, నానమ్మల జ్ఞాపకాలు ఒంటిపై సందడి చేస్తున్నాయి. పాతకాలం పట్టుచీరలకు రీమేక్‌తో న్యూలుక్ అందిస్తున్నారు సిటీ డిజైనర్లు. ఇప్పుడిది ట్రెండ్‌గా మారింది. సాక్షి, సిటీబ్యూరో :అందరూ పెళ్లి చీరలు భద్రంగా దాచుకుంటారు. అయితే వాటిని తరచూ ధరించే అవకాశం ఉండదు. అలాగే పండగలు, వివిధ సందర్భాల్లో వేల రూపాయల చీరలు కొంటారు. ఇంకొంత మందికి అమ్మ, అమ్మమ్మ, నానమ్మ చీరలని ఎన్నో సెంటిమెంట్స్ ఉంటాయి. ఒక్కో చీర ఒక్కో మధురానుభూతికి చిహ్నంగా నిలుస్తుంది. అయితే ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా వాటిని ధరించే వీలులేకపోవడంతో బీర్వాలు, లాకర్లకే పరిమితమవుతున్నాయి. ఇప్పుడు వీటికి మెరుగులద్ది కొంగొత్తగా తీర్చిదిద్దుతున్నారు డిజైనర్లు. క్వాలిటీ.. క్రియేటివిటీ.. ఒకప్పుడు ఓ ఊపు ఊపేసిన చీరలు ఇప్పుడు ఓల్డ్ ఫ్యాషన్ అయిపోతున్నాయి. పాత ఉప్పాడ, కంచి, కాంజీవరం, నారాయణపేట్, వెంకటగిరి, ధర్మవరం, గద్వాల్, బెనారస్, పోచంపల్లి... తదితర ఎన్నో రకాల చీరలు క్వాలిటీకి పెట్టింది పేరు. ఇలాంటి క్వాలిటీ చీరలకు క్రియేటివిటీని జతచేసి రీమేక్‌తో న్యూలుక్ అందిస్తున్నారు డిజైనర్లు. మగ్గం వర్క్, థ్రెడ్ వర్క్, మిర్రర్ వర్క్, జర్దోసి వర్క్, గోట పట్టి, సీక్వెన్స్... ఇలా విభిన్న డిజైన్లతో కొత్తందాలు ఇస్తున్నారు. అమ్మమ్మ, నానమ్మల చీరలను మనవరాళ్లు తమకు నప్పేట్టుగా డ్రెస్సులుగా మార్పించుకుంటున్నారు. నేత చీరలతో అనార్కలీ సూట్లు.. కంచి, ఉప్పాడ, బెనారస్, కాంజీవరం తదితర పట్టు చీరలతో ఫ్లోర్‌లెంగ్త్ ఫ్రాక్‌లు, పలాజో సూట్లు, గాగ్రా చోళీలు, లంగా ఓణీలు, దోతి శారీస్... ఇలా విభిన్న ఇండోవెస్ట్రన్ డ్రెస్సెస్‌ని తయారు చేయించుకుంటున్నారు. మా అమ్మ చీర.. ఇది మా అమ్మ చీర(సిల్క్ శారీ). నాకు బాగానచ్చిన చీర. అయితే నాకు చీరలు కట్టుకుంటే కంఫర్ట్ ఉండదు. అందుకే ఈ చీరను ‘డిజైనర్ గాగ్రా‘గా తయారు చేయించుకున్నాను. చీరను లెహంగాగా, చీర చెంగును పైన టాప్‌గా డిజైన్ చేయించి... మ్యాచింగ్ రాసిల్క్ మెరూన్ లేస్‌ని లెహంగాకు బోర్డర్‌గా వేయించాను. డిఫరెంట్ లుక్‌తో నాకు చాలా బాగా నచ్చిందీ డ్రెస్. – శ్రీదేవి ఇది నానమ్మ చీర... ఇది మా నానమ్మ చీర(పోచంపల్లి పట్టు). ఇందులోని కలర్ కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టం. నానమ్మ ఈ చీర కట్టుకున్నప్పుడల్లా నాకిచ్చేయమని అడిగేదాన్ని. 15ఏళ్ల క్రితం కొన్న ఈ చీర ధర రూ.?? వేలు. నేను ఈ చీరను ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్టుగా, ట్రెడిషనల్‌గా, ఫంక్షన్స్, పార్టీకి వేసుకునేటట్టు ‘కోల్డ్ షోల్డర్స్‌తో ఫ్లోర్‌లెంగ్త్ ఫ్రాక్‘ డిజైన్ చేయించుకున్నాను. ఐ లవ్ దిస్ స్పెషల్ ఔట్ఫిట్. – అనిత, మోడల్ సెంటిమెంట్స్కిఅనుగుణంగా... చాలామంది తమ దగ్గర ఎంతో విలువైన పాతకాలం పట్టు చీరలున్నాయని, వాటిని ట్రెండ్‌కి అనుగుణంగా రీమేక్ చేసివ్వమని అడుగుతున్నారు. వారి సెంటిమెంట్స్‌కి అనుగుణంగా రీమేక్ చేస్తున్నాం. అమ్మాయిలు తమ అమ్మమ్మ, నానమ్మ చీరలను ఫ్రాక్‌లు, లంగా ఓణీలుగా మార్చుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. వాటికి ట్రెండీ వర్క్స్ జోడిస్తున్నారు. ఇందుకు ఎంత ఖర్చయినా వెనకాడట్లేదు. ఈ తరహా మేకింగ్‌కు రూ.4వేల నుంచి రూ.40 వరకు ఖర్చవుతుంది. సెలబ్రిటీలు సైతం ఇలా రీమేక్ చేయించుకుంటున్నారు. – శ్వేతారెడ్డి, పేజ్‌త్రీ డిజైనర్ నా తొలి చీర.. ఇది పదేళ్ల క్రితం ఫంక్షన్‌కి కొనుకున్న నా ఫస్ట్ శారీ(ప్యూర్ షిఫాన్ డిజైనరీ శారీ). నాలుగేళ్లు ధరించాను. ఇక మళ్లీ మళ్లీ కట్టుకుంటే బోర్ కట్టేసింది. అందుకే రీమేక్ చేయించుకున్నాను. ‘టు పీసెస్ ఫ్లోర్‌లెంగ్త్ డిజైనర్ ఫిష్ డ్రెస్‘గా మార్పించుకున్నాను. – అపేక్ష -
నాకు కొత్త డ్రస్సు వచ్చిందోచ్!!
ఎవరికైనా కూడా కొత్త బట్టలు వచ్చాయంటే సంతోషమే కదూ. హీరోయిన్లు కూడా ఇందుకు అతీతులేం కారు. ఇలా కొత్తగా డిజైన్ చేయించుకున్న దుస్తులు టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతకు తెగ నచ్చేశాయి. వెంటనే ఆ డ్రస్సు వేసుకుని ఫొటోషూట్ చేయించేసుకుంది. దాంతోపాటు ట్విట్టర్లోనూ ఆ ఫొటోలు షేర్ చేసేసింది. ఇంత అద్భుతమైన డ్రస్ డిజైన్ చేసిందంటూ క్రెషాబజాజ్కి చాలా చాలా థాంక్స్ చెప్పేసింది. ఈ అమ్మాయికి ఎంత చెప్పినా తక్కువేనంటూ.. లవ్యూ బేబ్ అని చెప్పింది. నలుపు, తెలుపు కాంబినేషన్లో ఉన్న ఈ గౌనులో చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలు తీయించుకుంది. Thankyou my most awesome @kreshabajaj . This girl I can't get enough off. Love you babe pic.twitter.com/WHoIkpduUv — Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) November 22, 2014 -
అతికేస్తే.. కొత్తగా!
డ్రెస్ కుట్టడానికి ముందు క్లాత్‌ను కత్తెర్తో తగిన కొలతలలో కత్తిరించి, కుడతాం. అలా కుట్టిన డ్రెస్‌ను ఎప్పుడూ ఒకే విధంగా ధరించాలి. ఒకసారి వేసుకున్న డ్రెస్‌ను మరోసారి ధరించాలంటే నేటి రోజుల్లో అమ్మాయిలు అంతగా ఇష్టపడటం లేదు. ప్రతిసారీ కొత్త డ్రెస్ కావాలంటే కష్టం. అందుకే ఒకే డ్రెస్‌ను రెండు, మూడు విధాలుగా మార్చుకొని ‘కొత్త డ్రెస్’గా రూపొందించుకోవచ్చు. ఇందుకు కావాల్సింది కాస్త సృజన, ఇంకాస్త నేర్పు. ఇక్కడ మీ సౌలభ్యం కోసం ఒక డ్రెస్‌ను రెండు విధాలుగా ఎలా మార్చుకోవచ్చో చూపిస్తున్నాం. లంగా ఓణీ అనార్కలీగా... నిమ్మ పండు రంగు లెహంగా, గులాబీ రంగు బ్లౌజ్, గోధుమ రంగు నెటెడ్ ఓణీతో తీర్చిదిద్దిన డ్రెస్ ఇది. లంగా ఓణీని కొన్ని సార్లు ధరించాక మళ్లీ అదే డ్రెస్ వేసుకోవాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. వేడుకలో మరో కొత్త డ్రెస్ ఉంటే బాగుండు అనుకునేవారు లంగా ఓణీనే అనార్కలీగా మార్చేసుకోవచ్చు.బ్లౌజ్ భాగాన్ని, స్కర్ట్ భాగానికి జత చేసి కుట్టాలి. ఓణీని దుపట్టాలా వేసుకోవాలి. ఈ డ్రెస్‌కు బాటమ్‌గా లెగ్గింగ్ లేదా చుడీ వాడితే సరిపోతుంది.ఇప్పుడు అనార్కలీ డ్రెస్సులను మడమల వరకు ధరించడం ట్రెండ్‌గా ఉంది. కాబట్టి లెహంగాలను పొడవాటి అనార్కలీ గౌన్లుగా రూపొందించుకోవచ్చు. నోట్: అనార్కలీని లంగా ఓణీలా కూడా మార్చేసుకోవచ్చు. పొడవాటి అనార్కలీ టాప్‌ను బ్లౌజ్ భాగంలో విడదీసి, మళ్లీ జాగ్రత్తగా కుట్టేయాలి.ఈ తరహా డ్రెస్‌ల రూపకల్పనకు రెగ్యులర్‌గా వాడే మెటీరియల్స్ కాకుండా షిఫాన్, జార్జెట్, నెట్ ఫ్యాబ్రిక్ వాడితే డ్రెస్‌ల అందం చూడచక్కగా ఉంటుంది. స్వరోస్కి, కుందన్స్, లేసులతో అంచుభాగాలను తీర్చిదిద్ది ఎక్కువ లేయర్స్‌గా కూడా అనార్కలీ, లంగాఓణీలను నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు. -
మనసు నొప్పించే విషయాలు
చనువు ఉందని ‘డర్టీ’ విషయాలు మాట్లాడడం. సమస్యలో ఉన్నపుడు మీకు పని ఉందని కారణం చూపుతూ, ఆమెకు తోడు లేకపోవడం. వారి కొత్త డ్రెస్‌ను ఏ మాత్రం పట్టించుకోకపోవడం.. అది బాలేకున్నా! ఆమెకు సంబంధించిన దేనిపైన అయినా వ్యతిరేకతను నేరుగా వ్యక్తం చేయడం. ఆమె అందం గురించి ప్రతికూల విషయాలు నేరుగా చెప్పడం. ఇతర అమ్మాయిల అందచందాలను ఆమె ముందు పొగడటం. గమనిక: మీరు ఊహించని కొన్ని విషయాలకు కూడా వారు హర్ట్ అవుతుంటారు. మనసు మెప్పించే విషయాలు వీలైనన్ని ఎక్కువ సార్లు మీరు ప్రేమను వ్యక్తం చేయాలని కోరుకుంటారు. అమ్మాయిలే తెలుసుకోగలిగిన బహుమతులు వారికి నచ్చేలా ఇవ్వగలగడం (గాజులు, లిప్‌స్టిక్, పర్ఫ్యూమ్). ఆమె తప్పులను కూడా పొరపాట్లు అని చిత్రీకరించి చెప్పగలిగే మీ నైపుణ్యం! ప్రశంసలు... వాటిని కూడా అందంగా వ్యక్తం చేయాలి. ఆమె ప్రైవేట్ టైం, ప్రైవేట్ విషయాలు ఎప్పుడూ అడగకపోవడం (పూర్తిగా చనువు ఏర్పడక ముందు). ఇతరులను ఆమె వద్ద ఎప్పుడూ తిట్టకపోవడం. -
జీసస్ సమైక్యాంధ్రను బహుమతిగా ఇవ్వు
చిత్తూరు: విచిత్ర వేషధారణతో సమైక్యాంధ్ర గురించి ప్రచారం చేస్తున్న టిడిపి ఎంపీ శివప్రసాద్ ఈ రోజు మరో కొత్త వేషం వేశారు. క్రిస్మస్ సందర్భంగా చిత్తూరులో ఆయన శాంతా క్లాజ్ వేషం వేశారు. సమైక్యాంధ్ర చాక్లెట్లు పంచారు. జీసస్ ప్రభు సమైక్యాంధ్రను మాకు బహుమతిగా ఇవ్వు అని పాట కూడా పాడారు. తనతోపాటు పిల్లలను కూడా పాట పాడమని ఆయన కోరారు. శివప్రసాద్ గతంలో ఢిల్లీలో కూడా అనేక రకాల వేషధారణలతో వార్తలకెక్కారు. కృష్ణుడు, నారదుడు వంటి పౌరాణిక పాత్రల వేషంలో, బుడబుక్కల వాడి వంటి అనేక వేషాలు వేయడం ద్వారా ఆయన రాష్ట్ర విభజనకు వ్యతిరేకత తెలిపారు. రాష్ట్ర విభజనకు శివప్రసాద్ వంటి వారు ఎంత వ్యతిరేకత తెలిపినా, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం సమైక్యాంధ్రకు మద్దతు తెలుపరు. ఆయన విభజనకే మద్దతు తెలుపుతున్నారు. -
ఏక్‌బార్ ఉటోజీ..
నార్పల న్యూస్‌లైన్ : ‘గూగూడు చిన్నసరిగెత్తుకు ఇంటిల్లిపాది వెళ్దాం.. శనివారం బడేచోటుకు (పిల్లలు) కొత్త బట్టలు తెస్తానచెప్పి.. ఇక తిరిగిరాని లోకానికి వెళ్లావే.. ఏక్‌బార్ ఉటోజీ’ అంటూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆటో డ్రైవర్ రహంతుల్లా భార్య బీబీ రోదించిన తీరు చూపరులను కలచివేసింది. ఈ ఒక్క రోజు ఆటో నడిపి సాయంత్రం నార్పలలో పిల్లలకు కొత్త బట్టలు తీసుకొస్తాను. ఆదివారం గూగూడుకు పోయి కుళ్లాయిస్వామికి చక్కెర చదివిద్దామని పొద్దున చెప్పి పోతివేనని ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది. ఏక్‌బార్ ఉటోజీ అంటూ విలపిస్తూ బీబీ సొమ్మసిల్లిపోయింది. శనివారం సాయంత్రం పప్పూరు వద్ద ఆటో, వ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో బండ్లపల్లి బాబుషా కొడుకు అంజూ (రహంతుల్లా) ఆటో ప్రమాదానికి గురైందన్న సమాచారం తెలియగానే ఒక్కసారిగా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రహంతుల్లా నార్పల-బత్తలపల్లికి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు.