ఏక్‌బార్ ఉటోజీ.. | Auto driver died road accident | Sakshi
Sakshi News home page

ఏక్‌బార్ ఉటోజీ..

Published Sun, Nov 10 2013 2:28 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

Auto driver died road accident

నార్పల న్యూస్‌లైన్ : ‘గూగూడు చిన్నసరిగెత్తుకు ఇంటిల్లిపాది వెళ్దాం.. శనివారం బడేచోటుకు (పిల్లలు) కొత్త బట్టలు తెస్తానచెప్పి.. ఇక తిరిగిరాని లోకానికి వెళ్లావే.. ఏక్‌బార్ ఉటోజీ’ అంటూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆటో డ్రైవర్ రహంతుల్లా భార్య బీబీ రోదించిన తీరు చూపరులను కలచివేసింది. ఈ ఒక్క రోజు ఆటో నడిపి సాయంత్రం నార్పలలో పిల్లలకు కొత్త బట్టలు తీసుకొస్తాను.
 
 ఆదివారం గూగూడుకు పోయి కుళ్లాయిస్వామికి చక్కెర చదివిద్దామని పొద్దున చెప్పి పోతివేనని ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది. ఏక్‌బార్ ఉటోజీ అంటూ విలపిస్తూ బీబీ సొమ్మసిల్లిపోయింది. శనివారం సాయంత్రం పప్పూరు వద్ద ఆటో, వ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో బండ్లపల్లి బాబుషా కొడుకు అంజూ (రహంతుల్లా) ఆటో ప్రమాదానికి గురైందన్న సమాచారం తెలియగానే ఒక్కసారిగా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రహంతుల్లా నార్పల-బత్తలపల్లికి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement