బనశంకరి(బెంగళూరు): జేజే.నగర చంద్రు హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. తొలుత అందరూ అనుకున్నట్లుగా అతని మృతికి బైక్ ప్రమాదం కాదని, ఉర్దూ భాషలో మాట్లాడలేదని హత్య చేశారని సీఐడీ కోర్టుకు అందజేసిన 179 పేజీల చార్జిషీట్‌లో పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 5న స్నేహితుడు సైమన్ పుట్టినరోజు వేడుకల్లో చంద్రు పాల్గొన్నాడని, అనంతరం ఇద్దరూ చికెన్‌కబాబ్ తినడానికి హోటల్‌కు వెళ్లారని పేర్కొంది.
హోటల్ పక్కన బైకు పార్కింగ్ చేసి బేకరిలోకి వెళ్లే సమయంలో సైమన్, చంద్రుకు షహీన్ అనే వ్యక్తి ఎదురుపడ్డాడు. ఈ సమయంలో షహీన్ ఉర్దూలో తిట్టడం మొదలుపెట్టాడు. దీంతో చంద్రు, సైమన్లు షహీన్‌తో గొడవపడ్డారని, ఈక్రమంలో చంద్రు హత్యకు గురైనట్లు సీఐడీ తన చార్జ్‌షీట్‌లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment