న్యూఢిల్లీ: వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్ష నేషనల్ ఎలిజి బిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)ను ఇక నుంచి ఉర్దూలోనూ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంగళవారం కేంద్రం సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి నీట్‌ను ఉర్దూ లోనూ నిర్వహిస్తామని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ సుప్రీంకోర్టుకు హాజరై జస్టిస్ దీపక్ మిశ్రా ధర్మాసనానికి లిఖితపూర్వక వివరణ నిచ్చారు. గతంలో ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా అనే ఓ విద్యార్థి సంఘం ‘నీట్’ను ఉర్దూలో నిర్వ హించాలని కోరుతూ వ్యాజ్యం వేసింది.