ఒకసారి డాక్టర్ పట్టాభి సీతారామయ్యగారు హైదరాబాదు వచ్చారు. ప్రజల్లో ఆయన విప్లవం యెక్కడ తెస్తారో అని జడిసి ఆయన్ని గిరఫ్తార్(అరెస్టు) చేయవలసిందిగా వారెంటు జారీచేశారు. అది ఉర్దూలో వుంది. ఉర్దూకు ఫారసీ లిపిని ఉపయోగిస్తారు. ఉర్దూ భాషకు స్వంతలిపి అంటూ లేదు. ఫారసీ లిపిలో భారతీయ శబ్దాలు వ్రాయడం కష్టం. ‘‘పట్టాభి సీతారామయ్య’’ అని రాయాలంటే ‘‘టప్పాబహీ సత్తార్ మియా’’లా వుంటుంది.
డాక్టర్ పట్టాభిగారు బసచేసిన చోటికి పోలీసువారు వారంటు పట్టుకు వచ్చారు. ‘‘టప్పాబహీ సత్తార్ మియా హై క్యా’’ అని అడిగారు. అది పసిగట్టిన యన్.కె.రావుగారు ‘‘యహా సత్తార్ మియా కోయీ నహీ. ఇన్కానాంతో సీతారామయ్యా హై’’ (ఇక్కడ సత్తార్ మియా యెవరూ లేరు. వీరి పేరు సీతారామయ్య) అన్నారు. పొరపాటు చేశామనుకుని పోలీసువారు వెళ్ళిపోయారు. వెంటనే సీతారామయ్య గారిని సురక్షిత ప్రదేశానికి పంపించివేశారు రావుగారు. లిపిమార్పు వల్ల పేరు మారింది.
(దాశరథి కృష్ణమాచార్య ‘యాత్రాస్మృతి’ లోంచి...)
Comments
Please login to add a commentAdd a comment