
రిచా చద్దా
కొత్త పాత్ర కోసం ఉర్దూ పాఠాలు నేర్చుకుంటున్నారు బాలీవుడ్ బ్యూటీ రిచా చద్దా. ఉర్దూను సరిగ్గా పలకడం కోసం ఓ కోచ్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నారట. కునాల్ కోహ్లీ దర్శకత్వంలో రిచా చద్దా ముఖ్య తారగా తెరకెక్కుతున్న చిత్రం ‘లాహోర్ కాన్స్‌పిరసీ’. ఇందులో రిచా రహస్య గూడచారి పాత్రలో నటిస్తున్నారు. ఒకే షెడ్యూల్‌లో సినిమా చిత్రీకరణ మొత్తాన్ని పూర్తి చేయాలనుకుంటున్నారు. ‘‘ఒక పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేయడం యాక్టర్ లక్షణం అయ్యుండాలని నమ్ముతాను. అందుకే ఈ సినిమాలోని పాత్ర కోసం ఉర్దూ నేర్చుకుంటున్నాను. కొత్త కొత్త విషయాలన్నీ తెలుసుకునే అవకాశం సినిమా ఎప్పుడూ కల్పిస్తూనే ఉంటుంది’’ అన్నారు రిచా.
Comments
Please login to add a commentAdd a comment