
ముంబై: బాలీవుడ్ నటి రిచా చద్దా రాబోయే చిత్రం ‘మేడమ్ చీఫ్ మినిస్టర్’. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ బుధవారం విడుదలైంది. ఇందులో రిచా వెనుకబడిన వర్గాల ప్రజల కోసం పోరాడే పవర్‌ఫుల్ మహిళ నాయకురాలిగా కనిపించనున్నారు. ఈ ట్రైలర్.. ఓ చిన్న గ్రామానికి చెందిన ఒక యువతి కుల వ్యవస్థను, పితృస్వామ్య వ్యవస్థకు బ్రేక్ చేస్తూ రాజకీయాల్లోకి ప్రవేశించి ఆ తర్వాత ఏలా అధికారాన్ని చేపట్టారో చూడోచ్చు.
వెనుకబడిన వర్గాలు, మహిళల అభ్యున్నతి కోసం పాటుపడే క్రమంలో ఆగ్ర వర్ణాలు, ప్రతిపక్షాలు వేసే అడ్డంకులను అధిగమించి ఆమె ముఖ్యమంత్రిగా ఎలా ఎదిగానేది ట్రైలర్ వివరిస్తుంది. అయితే ఇందులో రిచా చిన్న జట్టుతో కొత్త లుక్‌లో కనిపించారు. డైరెక్టర్ సుభాష్ కపూర్ రూపోందిస్తున్న ఈ సినిమాను భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, నరేన్ కుమార్, డింపుల్ ఖర్బందాలు కలిసి నిర్మిస్తున్నారు. రిచాతో పాటు ఈ చిత్రంలో సౌరభ్ శుక్లా, మానవ్ కౌల్, అక్షయ్ ఒబెరాయ్‌లు కీలక పాత్రలో కనిపించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment