బుమ్రా ఎందుకిలా చేశాడు? | Jasprit Bumrah Hits Back At Trolls After India Win | Sakshi
Sakshi News home page

దీటుగా బదులిచ్చిన బుమ్రా

Published Sat, Sep 29 2018 8:14 PM | Last Updated on Sat, Sep 29 2018 8:23 PM

Jasprit Bumrah Hits Back At Trolls After India Win - Sakshi

దుబాయ్‌: తనను పరిహాసం చేసిన పోలీసులకు ఆటతోనే బదులిచ్చాడు టీమిండియా బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా. తాజాగా ముగిసిన ఆసియాకప్‌లో సత్తా చాటి విమర్శకుల నోళ్లు మూయించాడు. పోస్టర్లపై తనను అవమానించిన వారికి తగిన విధంగా జవాబిచ్చాడు.

అసలేం జరిగింది?
గతేడాది పాకిస్తాన్‌తో జరిగిన ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌లో బుమ్రా నోబాల్‌ వేయడంతో పాక్‌ బ్యాట్స్‌మన్‌ ఫఖర్‌ జమాన్‌ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. బుమ్రా నోబాల్‌తో బతికిపోయిన అతడు సెంచరీ(114)తో చెలరేగాడు. తుదిపోరులో 180 పరుగుల భారీ తేడాతో ఓడిపోయి టీమిండియా టైటిల్‌ చేజార్చుకుంది. సీన్‌ కట్‌ చేస్తే బుమ్రా నోబాల్‌ ఫొటోను జైపూర్‌ ట్రాఫిక్‌ పోలీసులు చాలా క్రియేటివ్‌గా వాడుకున్నారు. ‘లైను దాటకండి. లైను దాటితే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంద’ని ఈ ఫొటోలో హోర్డింగ్‌లు పెట్టారు. ఈ ఫొటో సోషల్‌ మీడియాలో తెగ వైరలైంది. దేశం కోసం ఆడుతున్న క్రికెటర్లకు ఎంత గౌరవం ఇస్తారో దీన్ని బట్టి అర్థమైందని అప్పట్లోనే ట్విటర్‌లో బుమ్రా ఆవేదన వెలిబుచ్చాడు.

ఇప్పుడేమైంది?
బంగ్లాదేశ్‌ను ఓడించి ఆసియా కప్‌ను టీమిండియా కైవశం చేసుకుంది. ట్రోఫి పట్టుకుని దిగిన ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన తనను అవమానించిన వారికి బుమ్రా బదులిచ్చాడు. ‘కొంత మంది తమ సృజనను సైన్‌ బోర్డుల మీద చూపించడానికి ఇష్టపడతారు. అలాంటి వారికి ఇదే నా సమాధానం’ అంటూ ట్వీట్‌ చేశాడు. తాజాగా జరిగిన ఆసియా కప్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన బుమ్రా 16 సగటుతో 8 వికెట్లు పడగొట్టి భారత్‌ విజయంతో తనవంతు పాత్ర పోషించాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement