Jaipur Police
-
‘పాపం.. ఆ పసి మనసుకేం తెలుసు!’
Viral Story: సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కథనాలకు తలాతోక ఉండదు. నిజనిర్ధారణ(Fact Check) చేసుకోకుండా పోస్టులు పెడుతుంటారు కొందరు. అలాగే.. ఆ పోస్టుల ఆధారంగా మీమ్స్ సైతం వస్తున్న రోజులివి. తాజాగా సిసింద్రీ క్లైమాక్స్‌ను గుర్తు చేస్తోందంటూ ఓ ఘటన నెట్టింట హల్చల్ చేస్తోంది.వైరల్ వీడియోలో ఏముందంటే..పోలీస్ స్టేషన్లో.. ఓ వ్యక్తి చెర నుంచి రెండేళ్ల ఓ చిన్నారిని విడదీస్తారు పోలీసులు. ఆ టైంలో ఆ చిన్నారి ఆ వ్యక్తిని గట్టిగా పట్టుకుంటాడు. అయినా పోలీసులు బలవంతంగా లాక్కుంటారు. ఆ చిన్నారి ఏడుపుతో పాటు కిడ్నాపర్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటాడు. అలా ఆ బిడ్డను బయటకు తీసుకెళ్లాక.. ఓ మహిళకు అప్పగిస్తారు. ఆమెతో పాటు ఓ వ్యక్తి, వృద్ధజంటను ఆ బాలుడి గురించి ఆరా తీస్తారు. అయినా ఆ చిన్నారి లోపల ఉన్న కిడ్నాపర్ కోసం గుక్కపట్టి ఏడుస్తూనే ఉంటాడు.Jaipur- A #child who was #kidnapped at 11 months old and kept with the kidnappers for 14 months, hugged the kidnapper, Tanuj, and began crying loudly when he was finally #rescued.This emotional moment even brought tears to the eyes of the accused."pic.twitter.com/UUpAAspTfG— Chaudhary Parvez (@ChaudharyParvez) August 30, 2024అయితే ఆ బిడ్డకు అతనే తండ్రి అని, విడిపోయిన నేపథ్యంలో భార్య అతనిపై కేసు పెట్టిందని ఓ ప్రచారం జరుగుతోంది. అలాగే.. కిడ్నాపర్ మీద మమకారం పెంచుకుని అలా ఆ చిన్నారి ఏడ్చాడంటూ మరో ప్రచారం జరుగుతోంది. కానీ, ఇందులో ఏది నిజమంటే..అసలు విషయం ఏంటంటే..ఆ వీడియోలో ఉన్న వ్యక్తి పేరు తనూజ్ చాహర్(33).ఆ వీడియోలో ఉన్న చిన్నారి పేరు పృథ్వీ. ఆగ్రాకు చెందిన తనూజ్ గతంలో అలీఘడ్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేశాడు. కారణం తెలియదుగానీ.. అతను సస్పెన్షన్‌లో ఉన్నాడు. అయితే.. ఆ చిన్నారి తల్లి పూనమ్ చౌదరితో అతనికి పరిచయం ఉంది. ఈ క్రమంలో తనతో వచ్చేయాలని ఆమెపై ఒత్తిడి చేశాడతను. ఆమె ఒప్పుకోకపోవడంతో.. కోపం పెంచుకుని ఆమె 11 నెలల కొడుకును ఎత్తుకెళ్లాడు.అలా సుమారు 14 నెలలపాటు ఆ బిడ్డతో ఎవరికీ దొరక్కుండా తిరిగాడు తనూజ్. పోలీసుగా తనకు ఉన్న అనుభవం ఉపయోగించడంతో పాటు ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు గడ్డం పెంచుకుని తిరిగాడు. ఆ బిడ్డను తన బిడ్డగా అందరికీ చెప్పుకుంటూ.. మధుర, ఆగ్రా, బృందావన్.. అన్నిచోట్లా తిరిగాడు. యమునా నది తీరాన ఓ గుడిసె వేసుకుని తనను తాను ఓ సాధువుగా అందరినీ నమ్మించే యత్నం చేశాడు. చివరకు ఈ మధ్య అలీగఢ్‌లో అతని జాడను గుర్తించిన జైపూర్ పోలీసులు.. 8 కిలోమీటర్లపాటు ఛేజ్ చేసి పట్టుకున్నాడు.తల్లిదండ్రులకు దూరం చేసిన ఆ వ్యక్తితో ఏడాది పాటు ఉన్న పృథ్వీ.. ఇన్నాళ్లు తనని సాకినందుకు ఆ కిడ్నాపర్‌పైనే మమకారం పెంచుకుని రోదిస్తుండడం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. -
ఏమ్మా.. శర్మాజీ ఇల్లెక్కడ?
సాక్షి, హైదరాబాద్: ఇతడో కాస్ట్లీ నేరగాడు. విమానాల్లో వస్తాడు. ఖరీదైన ప్రాంతాలకు వెళ్తాడు. మహిళల మెడలోని బంగారు గొలుసులను తస్కరిస్తాడు. ఈవిధంగా దేశవ్యాప్తంగా 11 నగరాల్లో 150 నేరాలకు పాల్పడ్డాడు. ఎట్టకేలకు రాజస్తాన్ పోలీసులకు ఆదివారం చిక్కాడు. అతడే రామ్‌చంద్ర బవారియా. ఉత్తరప్రదేశ్‌లోని శామ్లీ ప్రాంతానికి చెందిన ఇతడు పదిహేడేళ్ల ప్రాయం నుంచే నేరాల బాటపట్టాడు. 13 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్నాడు. ఇతడు హైదరాబాద్‌లోనూ నేరాలు చేసినట్లు అక్కడి పోలీసులు అనుమానిస్తున్నారు. 150కిపైగా నేరాలు: తొలినాళ్లలో ఇళ్లలో చోరీలు, దోపిడీలు చేసిన బవారియా కొన్నేళ్లుగా కేవలం చైన్‌స్నాచింగ్స్‌కు పాల్పడుతున్నాడు. దేశవ్యాప్తంగా ఉన్న 11 నగరాల్లో ఇప్పటి వరకు 150కి పైగా నేరాలు చేశాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, హరియాణా, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌ల్లో ఇతడికి నెట్వర్క్ ఉంది. ఒక్కడే ఆయా రాష్ట్రాల్లోని నగరాలకు విమానాల్లో వెళ్తుంటాడు. తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడున్న బంధువులు, స్నేహితుల సాయంతో హైస్పీడ్ బైక్‌లు సమీకరించుకుంటాడు. స్నాచింగ్‌కు వెళ్లేప్పుడు వాహనం వెనుక కూర్చునే (పిలియన్ రైడర్) ఇతడు ఖరీదైన ప్రాంతాల్లోనే ఎక్కువగా చేతివాటం ప్రదర్శిస్తాడు. శర్మాజీ పేరుతో ‘వెతుకులాట’.. నేరం చేయడానికి వెళ్లే ప్రతిసారీ కచ్చితంగా టోపీ పెట్టుకుంటాడు. అందుకే ఇతడికి నేర ప్రపంచంలో టోపీవాలా అనే పేరు కూడా ఉంది. బైక్‌ను ఆపి చిరునామా వెతుకుతున్నట్లు నటిస్తూ ‘టార్గెట్’దగ్గరకు వెళ్తాడు. ‘శర్మాజీ ఇల్లు ఎక్కడ?’అంటూ వారిని ప్రశ్నిస్తాడు. సమాధానం చెప్పిన ఆ మహిళలు వెనక్కి తిరగ్గానే మెడలోని చైన్ లాక్కుని బైక్‌పై ఉడాయిస్తాడు. కొన్ని సందర్భాల్లో మాత్రం రాణాజీ ఇల్లు ఎక్కడ? అని కూడా అడుగుతుంటాడని పోలీసులు చెప్తున్నారు. స్నాచింగ్ చేసిన వెంటనే దొంగసొత్తుతో తన స్వస్థలానికి వెళ్లిపోతుంటాడు. జైపూర్ పోలీసులకు ముప్పుతిప్పలు... ఐదు నెలలుగా రాజస్తాన్‌లోని జైపూర్‌లో షెల్టర్ ఏర్పాటు చేసుకున్న టోపీవాలా అక్కడి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. అదే ప్రాంతానికి చెందిన తన బంధువుతోపాటు మరో ఇద్దరితో కలసి 50 నేరాలు చేశాడు. ఒక్కోరోజు ఏకంగా ఎనిమిది నేరాలు చేసేవాడు. బోగస్ పత్రాలను వినియోగించి, సొత్తు విలువలో 50 నుంచి 70 శాతం వచ్చేలా ఫైనాన్స్ కంపెనీల్లో తాకట్టు పెడతాడు. ఒకవేళ తాను పోలీసులకు చిక్కినా రికవరీ ఉండకూడదనే ఇలా చేస్తుంటాడని పోలీసులు చెప్తున్నారు. ఓ సీసీ కెమెరా ఫుటేజ్‌లో చిక్కిన ఆధారంతో రామ్‌చంద్రను పోలీసులు గుర్తించారు. విమాన ప్రయాణాల ఆధారంగా... ప్రత్యేక పోలీసు బృందం రంగంలోకి దిగి జైపూర్‌లో అతడిని పట్టుకుంది. ఇతడి ఆర్థిక లావాదేవీలు, ఇతర అంశాలను పరిశీలించగా చెన్నై, బెంగళూరు, సూరత్, హైదరాబాద్‌కు అనేకసార్లు విమానంలో ప్రయాణించినట్లు తేలింది. దీని ఆధారంగా అతడు ఆయా నగరాల్లో నేరాలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్నాక లోతుగా విచారించాలని భావిస్తున్నారు. హైదరాబాద్‌లోని మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఎక్కడ నేరం చేశాడో తెలుసుకోవడానికి జైపూర్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి త్వరలో ఇక్కడి అధికారుల్ని సంప్రదించి రామ్‌చంద్ర వివరాలు అందించాలని భావిస్తున్నారు. -
బుమ్రా ఎందుకిలా చేశాడు?
దుబాయ్: తనను పరిహాసం చేసిన పోలీసులకు ఆటతోనే బదులిచ్చాడు టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. తాజాగా ముగిసిన ఆసియాకప్‌లో సత్తా చాటి విమర్శకుల నోళ్లు మూయించాడు. పోస్టర్లపై తనను అవమానించిన వారికి తగిన విధంగా జవాబిచ్చాడు. @traffic_jpr well done Jaipur traffic police this shows how much respect you get after giving your best for the country. pic.twitter.com/y0PU6v9uEc — Jasprit bumrah (@Jaspritbumrah93) June 23, 2017 అసలేం జరిగింది? గతేడాది పాకిస్తాన్‌తో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో బుమ్రా నోబాల్ వేయడంతో పాక్ బ్యాట్స్‌మన్ ఫఖర్ జమాన్ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. బుమ్రా నోబాల్‌తో బతికిపోయిన అతడు సెంచరీ(114)తో చెలరేగాడు. తుదిపోరులో 180 పరుగుల భారీ తేడాతో ఓడిపోయి టీమిండియా టైటిల్ చేజార్చుకుంది. సీన్ కట్ చేస్తే బుమ్రా నోబాల్ ఫొటోను జైపూర్ ట్రాఫిక్ పోలీసులు చాలా క్రియేటివ్‌గా వాడుకున్నారు. ‘లైను దాటకండి. లైను దాటితే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంద’ని ఈ ఫొటోలో హోర్డింగ్‌లు పెట్టారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరలైంది. దేశం కోసం ఆడుతున్న క్రికెటర్లకు ఎంత గౌరవం ఇస్తారో దీన్ని బట్టి అర్థమైందని అప్పట్లోనే ట్విటర్లో బుమ్రా ఆవేదన వెలిబుచ్చాడు. ఇప్పుడేమైంది? బంగ్లాదేశ్‌ను ఓడించి ఆసియా కప్‌ను టీమిండియా కైవశం చేసుకుంది. ట్రోఫి పట్టుకుని దిగిన ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేసిన తనను అవమానించిన వారికి బుమ్రా బదులిచ్చాడు. ‘కొంత మంది తమ సృజనను సైన్ బోర్డుల మీద చూపించడానికి ఇష్టపడతారు. అలాంటి వారికి ఇదే నా సమాధానం’ అంటూ ట్వీట్ చేశాడు. తాజాగా జరిగిన ఆసియా కప్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన బుమ్రా 16 సగటుతో 8 వికెట్లు పడగొట్టి భారత్ విజయంతో తనవంతు పాత్ర పోషించాడు. Some people love to use their creativity on the sign boards. Hope this one fits there as well!! 😁💪#Champions#AsiaCup2018 #lionalwaysroars🦁 pic.twitter.com/VWiJidwmaA — Jasprit bumrah (@Jaspritbumrah93) September 28, 2018 -
పోలీసుల ప్రచారం.. బిత్తరపోయాడు
సాక్షి, తిరువనంతపురం/జైపూర్: ప్రపంచం మొత్తాన్ని ఊపేస్తూ చర్చనీయాంశంగా మారింది కీకీ ఛాలెంజ్. పోలీసులు మాత్రం అది ప్రమాదకరమైందంటూ ఆంక్షలు విధించేస్తున్నా.. యువత అవేం పట్టించుకోకుండా సవాల్‌గా తీసుకుని మరీ ఊగిపోతోంది. అయితే ఈ ఛాలెంజ్‌కు అడ్డుకట్ట వేసే క్రమంలో జైపూర్ పోలీసులు చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘ఇన్ లవింగ్ మెమోరీ ఆఫ్ కేకే.. కీకీ ఛాలెంజ్‌లో షీగ్గీ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు’ అంటూ దండేసి ఉన్న ఓ యువకుడి ఫోటో జైపూర్ పోలీసులు ట్విటర్ ఖాతాలో ఉంచారు. ‘ఛాలెంజ్ చేసి ప్రాణాలు తీసుకోకండి’ అంటూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఆ యాడ్‌ను కొచ్చి(కేరళ)కి చెందిన జవహార్ సుభాష్ చంద్ర(30) చూసి బిత్తర పోయాడు. అందుకు కారణం ఆ ఫోటోలో ఉంది అతనే కాబట్టే. సోషల్ మీడియాలో విస్తృతంగా ఆ ఫోటో వైరల్ కావటంతో ఏం జరిగిందోనన్న కంగారుతో బంధువులు అతనికి ఫోన్ కాల్స్ చేయటం ప్రారంభించారంట. మీడియా ముందుకు వచ్చిన జవహార్ ఈ విషయాన్ని చెబుతూ వాపోతున్నాడు. (కీకీ విన్నర్స్ ‘తెలంగాణ’ కుర్రాళ్లే...) ఫోటో ఎలా దొరికిందంటే.. ఎక్కడో కొచ్చిలో ఉంటున్న అతని ఫోటో జైపూర్ పోలీసులకు ఎలా దొరికిందంటే.. 2008లో జవహార్ మోడలింగ్ చేసేవాడు. ఆ సమయంలో ఫోటోగ్రాఫర్ అయిన జవహార్ అంకుల్.. అతన్ని ఫోటోలు తీసి వాటిని షట్టర్‌స్టాక్‌లో ఉంచారు. ఆ సైట్ నుంచి ఫోటోలను కొనుగోలు చేసిన పోలీసులు ఇప్పుడు ఇలా యాడ్ ఇచ్చారన్న మాట. ‘ఇదొక ప్రచార కార్యక్రమం. ప్రజలకు మంచి చేయాలనే ప్రయత్నం. లీగల్‌గానే అతని ఫోటోను కొనగోలు చేశాం. ఎట్టి పరిస్థితుల్లో యాడ్‌ను వెనక్కి తీసుకోం. అతను అభ్యంతరం వ్యక్తం చేసినా సరే’ అని కమిషనర్ సంజయ్ అగర్వాల్ స్పష్టం చేశారు. (దొంగతనం చేసి మరీ...) -
జైపూర్ కమిషనర్‌గా పదేళ్ల బాలుడు
జైపూర్: రాజస్థాన్ లోని జైపూర్ పోలీస్ కమిషనర్‌గా పదేళ్ల బాలుడు బాధ్యతలు స్వీకరించారు. వెంట వెంటనే తన దిగువ అధికారులకు ఆదేశాలు జారీ చేశాడు. అదేంటి పదేళ్ల బాలుడు పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించడమా.. అని ఆశ్చర్యపోతున్నారా.. మరేంలేదు. రాజస్థాన్‌కు చెందిన గిరీశ్ శర్మ అనే బాలుడు గత కొద్ది కాలంగా తీవ్ర కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాడు. అతని పరిస్థితి కాస్తంత విషాధంగానే ఉంది. అయితే, ఆ బాలుడికి ఐపీఎస్ చదివి పోలీస్ కమిషనర్ కావాలని కోరిక. అతడి కోరికను గుర్తించిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ మేక్ ఏ విష్ పౌండేషన్ ఈ విషయాన్ని పోలీస్ కమిషనర్ జంగా శ్రీనివాసరావుకు వివరించింది. దీంతో ఆయన అనుమతించి ఒకరోజు పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించి అతడి కోరికను తీర్చారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రత్యేక చాంబర్లో గిరీశ్ శర్మ సమావేశం ఏర్పాటు చేశాడు. కింది స్థాయి అధికారులతో మాట్లాడారు. అనంతరం చాలా ఫైళ్లపై సంతకాలు కూడా చేశాడు. అనంతరం వారందరి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ దేశానికి ద్రోహం చేసేది ఎక్కువ దొంగలేనని వారిని అరెస్టు చేయడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా చెప్పాడు. గిరీశ్ శర్మ మూడో తరగతి చదువుతున్నాడు. -
దాడికి సిద్ధంగా ఉండండి
* అరెస్టయిన ఉగ్రవాదులకు అందిన సందేశమిదే * వెల్లడికాని లక్ష్యం.. మరో ఉగ్రవాది కోసం గాలింపు జైపూర్: ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) సంస్థకు చెందిన నలుగురు ఉగ్రవాదులు, వారి అనుచరుడిని అరెస్ట్ చేసిన జైపూర్ పోలీ సులు మరో అనుచరుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఇందుకోసం కొన్ని పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ఉగ్రవాది షకీబ్ అన్సారీ ఇద్దరు అనుచరుల పేర్లను బయటపెట్టగా.. ఆదిల్ అనే అతడిని పోలీసులు ఆదివారమే అరెస్ట్ చేశారు. ఇప్పుడు బర్కత్ అనే అనుచరుడి కోసం అన్వేషణ సాగుతోంది. షకీబ్‌కు బర్కత్ పేలుడు పదార్థాలు సరఫరా చేసేవాడని జోథ్‌పూర్ పోలీస్ కమిషనర్ సచిన్ మిట్టల్ వెల్లడించారు. పాకిస్థాన్‌కు చెందిన కరుడుకట్టిన ఐఎం ఉగ్రవాది వకాస్ అతడి ముగ్గురు అనుచరులు విచారణలో తమ లక్ష్యాన్ని బయటపెట్టలేదు. వకాస్‌ను ఢిల్లీ కోర్టు 10 రోజుల పాటు స్పెషల్‌సెల్ పోలీసుల కస్టడీకి పంపిన విషయం తెలిసిందే.అతడి అనుచరులైన మహ్రూఫ్, హనీఫ్, ఖలీద్లకు ప్రతేక కోర్టు ఏప్రిల్ 2 వరకు పోలీస్ కస్టడీ విధించింది. దీంతో ఈ నలుగురిని పోలీసులు విచారిస్తున్నారు. ఎవరిని లక్ష్యంగా చేసుకోవాలనుకున్నారు? ఎక్కడ? అనే వివరాలను వారు వెల్లడించలేదని దర్యాప్తులో పాలుపంచుకున్న ఒక అధికారి చెప్పారు. ఐఎం చీఫ్ తెహ్సీన్ అక్తర్ దాడికి సిద్ధంగా ఉండాలని మాత్రమే వీరికి చెప్పాడని, లక్ష్యాన్ని ఇంకా తెలియజేయలేదని వెల్లడైంది. హైదరాబాద్‌కు చెందిన మదర్సా నిర్వాహకుడి అరెస్ట్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన మదర్సా నిర్వాహకుడు మౌలానా అబ్దుల్ ఖవిని గుజరాత్ పోలీ సులు సోమవారం ఢిల్లీలో అరెస్టు చేశారు. 2004లో గు జరాత్‌లో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నిన కేసులో అబ్దుల్ నిందితుడు. కాగా, అబ్దుల్ అరెస్టును ఐంఐఎం అధినేత అసదుద్దీన్ ఖండించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆయనను అరెస్ట్ చేయడం అన్యాయమని వ్యా ఖ్యానించారు. గతంలో ఇలాంటి కేసుల్లో అరెస్ట్ చేసినవా రిని అమాయకులని తేలడంతో విడిచిపెట్టిన సందర్భాలున్నాయని గుర్తుచేశారు.