జైపూర్ కమిషనర్గా పదేళ్ల బాలుడు
జైపూర్: రాజస్థాన్ లోని జైపూర్ పోలీస్ కమిషనర్గా పదేళ్ల బాలుడు బాధ్యతలు స్వీకరించారు. వెంట వెంటనే తన దిగువ అధికారులకు ఆదేశాలు జారీ చేశాడు. అదేంటి పదేళ్ల బాలుడు పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించడమా.. అని ఆశ్చర్యపోతున్నారా.. మరేంలేదు. రాజస్థాన్కు చెందిన గిరీశ్ శర్మ అనే బాలుడు గత కొద్ది కాలంగా తీవ్ర కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాడు. అతని పరిస్థితి కాస్తంత విషాధంగానే ఉంది. అయితే, ఆ బాలుడికి ఐపీఎస్ చదివి పోలీస్ కమిషనర్ కావాలని కోరిక. అతడి కోరికను గుర్తించిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ మేక్ ఏ విష్ పౌండేషన్ ఈ విషయాన్ని పోలీస్ కమిషనర్ జంగా శ్రీనివాసరావుకు వివరించింది.
దీంతో ఆయన అనుమతించి ఒకరోజు పోలీస్ కమిషనర్గా బాధ్యతలు అప్పగించి అతడి కోరికను తీర్చారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రత్యేక చాంబర్లో గిరీశ్ శర్మ సమావేశం ఏర్పాటు చేశాడు. కింది స్థాయి అధికారులతో మాట్లాడారు. అనంతరం చాలా ఫైళ్లపై సంతకాలు కూడా చేశాడు. అనంతరం వారందరి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ దేశానికి ద్రోహం చేసేది ఎక్కువ దొంగలేనని వారిని అరెస్టు చేయడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా చెప్పాడు. గిరీశ్ శర్మ మూడో తరగతి చదువుతున్నాడు.