దాడికి సిద్ధంగా ఉండండి
* అరెస్టయిన ఉగ్రవాదులకు అందిన సందేశమిదే
* వెల్లడికాని లక్ష్యం.. మరో ఉగ్రవాది కోసం గాలింపు
జైపూర్: ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) సంస్థకు చెందిన నలుగురు ఉగ్రవాదులు, వారి అనుచరుడిని అరెస్ట్ చేసిన జైపూర్ పోలీ సులు మరో అనుచరుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఇందుకోసం కొన్ని పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ఉగ్రవాది షకీబ్ అన్సారీ ఇద్దరు అనుచరుల పేర్లను బయటపెట్టగా.. ఆదిల్ అనే అతడిని పోలీసులు ఆదివారమే అరెస్ట్ చేశారు. ఇప్పుడు బర్కత్ అనే అనుచరుడి కోసం అన్వేషణ సాగుతోంది. షకీబ్‌కు బర్కత్ పేలుడు పదార్థాలు సరఫరా చేసేవాడని జోథ్‌పూర్ పోలీస్ కమిషనర్ సచిన్ మిట్టల్ వెల్లడించారు. పాకిస్థాన్‌కు చెందిన కరుడుకట్టిన ఐఎం ఉగ్రవాది వకాస్ అతడి ముగ్గురు అనుచరులు విచారణలో తమ లక్ష్యాన్ని బయటపెట్టలేదు. వకాస్‌ను ఢిల్లీ కోర్టు 10 రోజుల పాటు స్పెషల్‌సెల్ పోలీసుల కస్టడీకి పంపిన విషయం తెలిసిందే.అతడి అనుచరులైన మహ్రూఫ్, హనీఫ్, ఖలీద్‌లకు ప్రతేక కోర్టు ఏప్రిల్ 2 వరకు పోలీస్ కస్టడీ విధించింది. దీంతో ఈ నలుగురిని పోలీసులు విచారిస్తున్నారు. ఎవరిని లక్ష్యంగా చేసుకోవాలనుకున్నారు? ఎక్కడ? అనే వివరాలను వారు వెల్లడించలేదని దర్యాప్తులో పాలుపంచుకున్న ఒక అధికారి చెప్పారు. ఐఎం చీఫ్ తెహ్‌సీన్ అక్తర్ దాడికి సిద్ధంగా ఉండాలని మాత్రమే వీరికి చెప్పాడని, లక్ష్యాన్ని ఇంకా తెలియజేయలేదని వెల్లడైంది.
హైదరాబాద్‌కు చెందిన మదర్సా నిర్వాహకుడి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన మదర్సా నిర్వాహకుడు మౌలానా అబ్దుల్ ఖవిని గుజరాత్ పోలీ సులు సోమవారం ఢిల్లీలో అరెస్టు చేశారు. 2004లో గు జరాత్‌లో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నిన కేసులో అబ్దుల్ నిందితుడు. కాగా, అబ్దుల్ అరెస్టును ఐంఐఎం అధినేత అసదుద్దీన్ ఖండించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆయనను అరెస్ట్ చేయడం అన్యాయమని వ్యా ఖ్యానించారు. గతంలో ఇలాంటి కేసుల్లో అరెస్ట్ చేసినవా రిని అమాయకులని తేలడంతో విడిచిపెట్టిన సందర్భాలున్నాయని గుర్తుచేశారు.