సిద్దిపేట టౌన్ : సర్కార్ బడుల తీరును ప్రజలు పరిశీలించడానికి తద్వారా విద్యార్థుల సంఖ్యను పెంచడానికి, పాఠశాలలోని సమస్యలను పరిష్కరించడానికి వీలుగా అన్ని పాఠశాలల ముందు రెండు స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటుకు ఇన్‌చార్జ్ కలెక్టర్ శరత్ వీడియో కాన్ఫరెన్సులో 15 రోజుల క్రితం విద్యాధికారులకు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కానీ వీటి నిర్మాణానికి నిధులు ఎలా వస్తాయో చెప్పలేదు. విద్యాధికారులు నిధుల విషయమై ఆర్ అండ్‌బీ, పంచాయతీ రాజ్ అధికారులను సంప్రదిస్తే తమకు ఎలాంటి ఉత్తర్వులు లేవని చేతులెత్తేస్తున్నారు. దీంతో పాఠశాల నిర్వహణ నిధులు కూడా విడుదల కానీ స్కూల్స్ స్పీడ్ బ్రేకర్లను, సైన్ బోర్డులను ఎలా ఏర్పాటు చేయాలో తెలియక ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నాయి.
రూ. ఐదు కోట్ల నిధులు అనివార్యం..
సిద్దిపేట డివిజన్‌లో 162 హైస్కూల్స్, సుమారు 500 ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్‌లో అన్ని పాఠశాలల ముందు వీటిని ఏర్పాటు చేయాలంటే సుమారు రూ. 5 కోట్ల నిధులు అనివార్యం. కానీ నిధులు ఎలా వస్తాయో తెలియక అటూ ప్రధానోపాధ్యాయులు, ఇటూ విద్యాధికారులు ఆందోళన చెందుతున్నారు. చాలీచాలని స్కూల్ గ్రాంట్స్‌తో కనీస అవసరాలనే తీర్చలేకపోతున్నామని ఈ క్రమంలో వీటిని ఎలా నిర్మిస్తామని పలువురు ఉపాధ్యాయులు అంటున్నారు.
కలెక్టర్ మాటకు పక్షం రోజులు
Published Sun, Aug 10 2014 12:00 AM | Last Updated on Sat, Sep 2 2017 11:38 AM
Advertisement
Advertisement