ప్రస్తుతం అన్ని రకాల ఉద్యోగాల్లోనూ పని ఒత్తిడి ఎక్కువైంది. ఇక ప్రైవేటు ఉద్యోగాల సంగతి చెప్పనక్కర్లేదు. పని వేళలకు, కుటుంబ జీవన సమయానికి సమతుల్యత అస్సలు ఉండటం లేదు. పని ఒత్తిడి సహజమే అయినప్పటికీ వర్క్‌ప్లేస్ వాతావరణం ప్రతికూలంగా ఉండటం, పై అధికారులు, తోటి ఉద్యోగుల సహకారం లేకుంటే ఆ ఒత్తిడి మరింత ఎక్కువౌతుంది.
ఈ రోజుల్లో చాలా మంది ఉద్యోగులు తమ వృత్తిపరమైన అనుభవాలను, వర్క్‌ప్లేస్‌లో ఎదుర్కొంటున్న సవాళ్లను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఇటీవల ఒక రెడిట్ (Reddit) యూజర్ తన వర్క్‌ప్లేస్‌లో ఎదురైన ప్రతికూల అనుభవాన్ని పంచుకున్నారు. ఎనిమిది నెలల తర్వాత మొదటిసారిగా సెలవులు (Vacation) తీసుకున్న తన పట్ల ఎంత ప్రతికూలంగా ప్రవర్తించారో వివరించారు. ఈ పోస్ట్ కాస్త
ఎనిమిది నెలల తర్వాత మొదటిసారిగా..
"నేను కంపెనీలో చేరినప్పటి నుంచి మొదటిసారి సెలవులు పెట్టాను. దీంతో నన్నో క్రిమినల్‌లా చూస్తున్నారు" అంటూ తన పోస్ట్‌ను మొదలు పెట్టారు. తాను ఉద్యోగంలో చేరిన ఎనిమిది నెలల తర్వాత మొదటిసారిగా ఒకటిన్నర వారం సెలవులు తీసుకున్నానని, కానీ సెలవు పెట్టిన రోజే తనకు పని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. తన సహచరులు కూడా తనను ఏదో తప్పు చేసినట్టు చూశారని వాపోయారు.
సెలవులకు వెళ్లినప్పుడు తనతో ల్యాప్‌టాప్ కూడా తీసుకుని వెళ్లి రోజూ ఈమెయిల్స్ చెక్ చేయాలని చెప్పారని, కానీ తాను నిరాకరించినట్లు పేర్కొన్నారు. తాను ల్యాప్‌టాప్ తీసుకెళ్లినా రోజూ ఈమెయిల్స్ చెక్ చేయనని, నాలుగైదు రోజులకోసారి చూస్తారని చెప్పినట్లు తెలిపారు. దీంతో సహచరులు తనపై కోపం ప్రదర్శిస్తూ సెలవులో ఉన్నప్పటికీ రోజూ ఈమెయిల్స్ చెక్ చేయాలని చెప్పినట్లు పేర్కొన్నారు.
ఈ పోస్టు కాస్త వైరల్‌గా మారింది. దీనిపై పలువురు యూజర్లు ప్రతిస్పందించారు. తమకూ ఇలాంటి అనుభవాలు ఎదురైనట్లు పేర్కొన్నారు. సెలవులపై వెళ్లినప్పుడు ల్యాప్‌టాప్ తీసుకువెళ్లకూడదంటూ సలహాలు ఇస్తూ కామెంట్లు పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment