Treated
-
‘సెలవులు పెడితే క్రిమినల్లా చూస్తున్నారు’.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్!
ప్రస్తుతం అన్ని రకాల ఉద్యోగాల్లోనూ పని ఒత్తిడి ఎక్కువైంది. ఇక ప్రైవేటు ఉద్యోగాల సంగతి చెప్పనక్కర్లేదు. పని వేళలకు, కుటుంబ జీవన సమయానికి సమతుల్యత అస్సలు ఉండటం లేదు. పని ఒత్తిడి సహజమే అయినప్పటికీ వర్క్‌ప్లేస్ వాతావరణం ప్రతికూలంగా ఉండటం, పై అధికారులు, తోటి ఉద్యోగుల సహకారం లేకుంటే ఆ ఒత్తిడి మరింత ఎక్కువౌతుంది. ఈ రోజుల్లో చాలా మంది ఉద్యోగులు తమ వృత్తిపరమైన అనుభవాలను, వర్క్‌ప్లేస్‌లో ఎదుర్కొంటున్న సవాళ్లను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఇటీవల ఒక రెడిట్ (Reddit) యూజర్ తన వర్క్‌ప్లేస్‌లో ఎదురైన ప్రతికూల అనుభవాన్ని పంచుకున్నారు. ఎనిమిది నెలల తర్వాత మొదటిసారిగా సెలవులు (Vacation) తీసుకున్న తన పట్ల ఎంత ప్రతికూలంగా ప్రవర్తించారో వివరించారు. ఈ పోస్ట్ కాస్త ఎనిమిది నెలల తర్వాత మొదటిసారిగా.. "నేను కంపెనీలో చేరినప్పటి నుంచి మొదటిసారి సెలవులు పెట్టాను. దీంతో నన్నో క్రిమినల్లా చూస్తున్నారు" అంటూ తన పోస్ట్‌ను మొదలు పెట్టారు. తాను ఉద్యోగంలో చేరిన ఎనిమిది నెలల తర్వాత మొదటిసారిగా ఒకటిన్నర వారం సెలవులు తీసుకున్నానని, కానీ సెలవు పెట్టిన రోజే తనకు పని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. తన సహచరులు కూడా తనను ఏదో తప్పు చేసినట్టు చూశారని వాపోయారు. సెలవులకు వెళ్లినప్పుడు తనతో ల్యాప్‌టాప్ కూడా తీసుకుని వెళ్లి రోజూ ఈమెయిల్స్ చెక్ చేయాలని చెప్పారని, కానీ తాను నిరాకరించినట్లు పేర్కొన్నారు. తాను ల్యాప్‌టాప్ తీసుకెళ్లినా రోజూ ఈమెయిల్స్ చెక్ చేయనని, నాలుగైదు రోజులకోసారి చూస్తారని చెప్పినట్లు తెలిపారు. దీంతో సహచరులు తనపై కోపం ప్రదర్శిస్తూ సెలవులో ఉన్నప్పటికీ రోజూ ఈమెయిల్స్ చెక్ చేయాలని చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ పోస్టు కాస్త వైరల్‌గా మారింది. దీనిపై పలువురు యూజర్లు ప్రతిస్పందించారు. తమకూ ఇలాంటి అనుభవాలు ఎదురైనట్లు పేర్కొన్నారు. సెలవులపై వెళ్లినప్పుడు ల్యాప్‌టాప్ తీసుకువెళ్లకూడదంటూ సలహాలు ఇస్తూ కామెంట్లు పెట్టారు. -
‘ఐటా’ తీరు ఆశ్చర్యం కలిగించలేదు!
ముంబై: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) తనతో వ్యవహరించిన తీరు తనను తీవ్రంగా బాధించిందని మాజీ ఆటగాడు మహేశ్ భూపతి వ్యాఖ్యానించాడు. అయితే ‘ఐటా’ గత రికార్డును బట్టి చూస్తే ఇది తనకు ఏమాత్రం ఆశ్చర్యం కలిగించలేదని అతను అన్నాడు. పాకిస్తాన్‌తో జరిగే డేవిస్ కప్ మ్యాచ్ కోసం ముందుగా మహేశ్నే నాన్‌ప్లేయింగ్ కెప్టెన్‌గా ‘ఐటా’ ఎంపిక చేసింది. అయితే అతను పాకిస్తాన్ ప్రయాణించేందుకు ఇష్టపడటం లేదంటూ తొలగించింది. దీనిపై భూపతి స్పందించాడు. ‘నేను కెప్టెన్‌గా పనికి రానని వారు భావిస్తే తప్పు లేదు. కానీ ప్రస్తుతం నీకు బదులుగా మరొకరిని ఎంపిక చేస్తున్నామని ఒక్క ఫోన్ కాల్ చేసినా బాగుండేది. కానీ నాకు కనీస సమాచారం కూడా అందించలేదు. నన్ను కెప్టెన్‌గా ఎంపిక చేయాలని భావించిన రోజున హైదరాబాద్‌కు వచ్చి మరీ నాతో కలిసి మాట్లాడారు. కానీ ఇప్పుడు వారి ప్రవర్తన తీవ్ర నిరాశ కలిగించింది. నేను బాధ పడటం కూడా సహజం. అయితే గత ఇరవై ఏళ్లుగా భారత టెన్నిస్ సంఘం పలువురు ఆటగాళ్లతో వ్యవహరించిన తీరును బట్టి చూస్తే ఇది ఆశ్చర్యం కలిగించలేదు’ అని భూపతి వివరించాడు. -
మహిళపై పోలీసు అధికారి జులుం..వీడియో హల్చల్
పట్నా: పేదవాళ్లపై, అభాగ్యులపై పోలీసులు దాష్టీకాలు పరిపాటిగా మారిపోయాయి ముఖ్యంగా మహిళలపై వారి అరాచకాలకు అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా బిహార్ రాజధాని పట్నా నగర వీధుల్లో ఇలాంటి అమానుషం ఒకటి వెలుగుచూసింది. శుక్రవారం చోటు చేసుకున్న ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో నెట్ లో హల్ చల్ చేస్తోంది. మహిళపై ఓ పోలీసు అధికారి ప్రదర్శించిన జులుం, ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. సాక్షాత్తూ ఓ పోలీసు ఉన్నతాధి కారి మహిళపై దాడిచేసిన దృశ్యాలు,అమానుషంగా ప్రవర్తించిన దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. స్థానిక మీడియా సిబ్బంది ఈ దృశ్యాలను చిత్రీకరించారు. పాట్నాలోని స్థానిక ఎగ్జిబిషన్ గ్రౌండ్ ప్రాంతంలో నివసిస్తున్న గుడిసె వాసులపై ఒక బిల్డర్ తన అనుచరులతో దాడికి దిగాడు. ఆ స్థలంలో వారిని ఖాళీ చేయిల్సాందిగా హుకుం జారీ చేశాడు. ఈ క్రమంలో స్థానికులపై దాడికి దిగగా, అక్కడ వున్నవారంతా తిరగబడటంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకునేసరికి రియల్ ఎస్టేట్ డెవలపర్ , మరికొంతమంది దుండగులు అక్కడినుంచి ఉడాయించారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడున్న వారిపై విరుచుకుపడ్డారు. విచక్షణా రహితంగా దాడి చేస్తూతమ ప్రకోపాన్ని ప్రదర్శించారు. అటు సామరస్యంగా సమస్యను పరిష్కరించాల్సిన సాక్షాత్తూ డిప్యూటీ సూపరింటెండెంట్ కైలాష్ ప్రసాద్ స్తానిక మహిళపై దారుణంగా హింసకు పాల్పడ్డాడు. అక్కడున్న పురుషుడిపై దాడిచేస్తుండగా, ఇంట్లో నుంచి బయటకు వచ్చి మాట్లాడుతన్న ఆమెను జుట్టు పట్టుకుని తోసేశాడు. పలుమార్లు ఆమెపై చేయిచేసుకున్నాడు. ఈ సన్నివేశాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి అయితే ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు డీజీపీ షాలిన్ చెప్పారు. వీడియో దృశ్యాలను పరిశీలించిన మీదట సంబంధిత చర్య తీసుకుంటామన్నారు. -
ప్రజల వద్దకే మలేరియా డిటెక్షన్ యూనిట్!
మలేరియాను నిర్మూలించడంలో మంగళూరు అధికారులు మరో అడుగు ముందుకేశారు. కర్నాటక ప్రాంతంలో గుర్తించిన మొత్తం 7800 మలేరియా కేసుల్లో మంగుళూరులోనే 4000 వరకూ ఉండటంతో అప్రమత్తమయ్యారు. ప్రజా వైద్య సౌకర్యాలను మెరుగు పరిచే దిశగా మొబైల్ మలేరియా డిటెక్షన్ యూనిట్ ను ప్రారంభించారు. కర్నాటక మంగుళూరు నగరంలో మలేరియా నివారణ, నియంత్రణ దిశగా చర్యలు ప్రారంభించారు. కర్నాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మొదటిసారి మొబైల్ మలేరియా గుర్తింపు యూనిట్ ను ప్రారంభించింది. ఆరుగురు నిపుణుల బృదంతోపాటు, విశ్లేషణా పరికరాలు, మందులతో కూడిన వాహనాన్ని అత్యధికంగా మలేరియా కేసులు నమోదవుతున్న మంగళూరు నగరంలో మార్చి 19న ప్రారంభించింది. ఇందులో భాగంగా వైద్య కార్మికులు ఉచిత పరీక్ష, చికిత్స అందించడంతో పాటు... విశ్లేషణా కిట్ సహాయంతో నిమిషాల్లో ఫలితాలను అందిస్తారు. ముందుగా రక్త నమూనాలను సేకరించి కిట్ ద్వారా పరిశీలిస్తారు. ఫలితం ప్రతికూలంగా చూపితే.. రక్త నమూనాలను మరింత విశ్లేషణ జరిపేందుకు మలేరియా టెస్టింగ్ సెంటర్ కు పంపిస్తారు. ఫలితాలు సానుకూలంగా చూపితే రోగులకు వెంటనే మందులను అందిస్తారు. రక్త పరీక్షలతోపాటు, మందులుకూడ ఉచితంగానే ఇస్తారు. ప్రజలు ఒక్క ఫోన్ కాల్ చేసి, అడ్రస్ ఇస్తే చాలు అరగంటలోపు మొబైల్ యూనిట్ వారింటిముందుండేట్టుగా ఈ ప్రత్యేక సౌకర్యాన్ని కల్పించారు. ఈ సౌకర్యం వినియోగించుకొనేందుకు ఓ హాట్ లైన్ నెంబర్ (9448556872) ను ప్రవేశ పెట్టారు. మలేరియా పరీక్షలు నిర్వహించిన ప్రతి వ్యక్తి వివరాలను ఈ మొబైల్ యూనిట్ రిజిస్టర్ చేస్తుంది. మలేరియా వ్యాప్తి నిరోధించడంలో భాగంగా ఆ వివరాలను మంగళూరు సిటీ కార్పొరేషన్ కు అప్పగిస్తుంది. గతేడాది అక్టోబర్ లో స్థాపించిన మలేరియా కంట్రోల్ సాఫ్ట్ వేర్ సిస్టమ్ ద్వారా ఆ వివరాలను అప్ లోడ్ చేస్తారు. నగరంలోని మలేరియా కేసుల వివరాలను తెలిపేందుకు, ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు ఈ సాఫ్ట్ వేర్ మ్యాపింగ్ టూల్ గా ఉపయోగపడుతుంది. నగరంలో ఏర్పాటు చేసిన ప్రతి చికిత్సా కేంద్రానికి అనుబంధంగా ఈ మొబైల్ యూనిట్.. సేవలు అందిస్తుందని జిల్లా డిసీజ్ కంట్రోల్ ఆఫీసర్ అరుణ్ కుమార్ ఎస్ బి. తెలిపారు. -
సొంతదేశం పొమ్మంది.. వలస దేశం వద్దంది..