చలిలో చమటలపడుతున్నాయ్. డాక్టర్‌కి చూపించుకుంటాను. ఒక్కరోజు లీవ్ కావాలి అంటూ ఉద్యోగి అడిగిన పాపానికి.. సదరు యజమాని అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఉద్యోగి నువ్వు వద్దు.. నీ ఉద్యోగం వద్దంటూ మొహం మీదే చెప్పాడు. ఆపై సంస్థకు రాజీనామా చేశాడు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఓ సంస్థలో ఉన్నత స్థాయి ఉద్యోగికి.. ఆయన టీంలో పనిచేసే ఉద్యోగికి మధ్య వాట్సప్ చాటింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగికి వాతావారణం ఎంత చల్లగా ఉన్న చెమటలు పడుతుంటాయి. ట్రీట్మెంట్ కోసం డాక్టర్‌కి దగ్గరికి వెళ్దామంటే చేతిలో చిల్లిగవ్వలేదు. చేసేది లేక మూడేళ్లు కాలం వెళ్ల దీశాడు. చివిరికి అతని ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చింది. ఇందుకోసం ఆఫీస్ బాస్‌కి మెసేజ్ చేశాడు సదరు ఉద్యోగి. అనారోగ్యంగా ఉంది. వీపరీతంగా బాడీ పెయిన్స్ ఉన్నాయి. మీరు ఒక్క రోజు లీవ్ ఇస్తే డాక్టర్‌కి చూయించుకుంటాను. డాక్టర్ ట్రీట్మెంట్‌కు అయ్యే ఖర్చు ఆఫీస్ బరిస్తుందా? అంటూ బాస్‌ను అడిగాడు.
అందుకు ఆ బాస్.. మీరు అనారోగ్యంగా ఉన్నారని డాక్టర్ రాసిన లెటర్ ఇవ్వండి అని రిప్లయి ఇచ్చాడు.
అందుకు ఉద్యోగి సార్ నాకున్న ఆర్ధిక ఇబ్బందుల వల్ల 3ఏళ్లగా డాక్టర్ దగ్గరికి వెళ్లలేకపోయాను. కానీ నిన్ననే కొంతమొత్తాన్ని చెల్లించి నేను డాక్టర్ కన్సల్టేషన్ తీసుకున్నాను అని రాశాడు.
ఉద్యోగి చేసిన వాట్సప్ మెసేజ్ దెబ్బకు బాస్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చిన్నాచితకా వాటికే లీవ్ పెడితే ఎలా? లీవ్ పెట్టుకో కాని నాకు డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ కావాలని అడిగాడు. దీంతో బాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉద్యోగి తన జాబ్‌కు రిజైన్ చేస్తున్నట్లు తెలిపాడు.
ఇక, ఈ సంభాషణపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఉద్యోగికి అనారోగ్యం బాగలేనప్పుడు బాస్ తీసుకునే నిర్ణయాలు అసంతృప్తిగా ఉంటున్నాయి. మొత్తానికి ఉద్యోగి రాజీనామా చేసి బాస్ తిక్కకుదిర్చాడంటూ నెటిజన్లు రిప్లయి ఇస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment