కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు అవార్డులు, రివార్డులు, ప్రోత్సాహకాలు ఇవ్వడం, పనితీరు బాగా లేదు అనుకున్న వాళ్లని ఉద్యోగం నుంచి తొలగించడం చాలా కామన్. కానీ ఒక కంపెనీ మాత్రం ఉద్యోగులకు గుణపాఠం చెప్పే పేరుతో టాప్ పెర్ఫార్మర్‌నే ఉద్యోగంలోంచి తీసేసింది. దీనికి సంబంధించిన కథనం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. (నీతా అంబానీ అద్భుత గిఫ్ట్: మురిసిపోతున్న కాబోయే కోడలు)
సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం రెడిట్ ఒక యూజర్ ఈ స్టోరీని షేర్ చేశాడు. కంపెనీలో బాగా పని చేసే టాప్ పెర్ఫార్మర్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ విషయాన్ని రెడిట్ యూజర్ పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. దీంతో ఇదెక్కడి చోద్యం రా బాబూ అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఉద్యోగులను భయపెట్టేందుకు బాగా పనిచేస్తున్న ఉద్యోగిని తీసివేయడం ఎంతవరకు సబబు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. (సినిమాలకు బ్రేక్: సమంతకు ఆర్థికంగా అన్ని కోట్లు నష్టమా?)
అంతేకాదు కంపెనీకి సంబంధించి తర విషయాల గురించి కూడా చెప్పాడు. కార్మికుల కమీషన్లు దొంగిలించడం, కాంట్రాక్ట్ నిబంధనలను బేఖాతరు చేయడం, కనీసం వాష్‌రూంలో 5 నిమిషాల కంటే ఎక్కువ సమయం గడిపినా వేధించడం, నచ్చకపోతే తలుపు తెరిచి ఉందని చెప్పడం లాంటివి చాలా వరకు తగ్గాయంటూ వీటి తీవ్రతను చెప్పుకొచ్చాడు రెడిటర్ పోస్ట్‌లో తెలిపారు.
టార్గెట్ రీచ్ అవ్వని కారణంగా తొలగిస్తామని బెదిరించారు. నిజానికి నానుంచి కమీషన్ తీసుకున్నందుకు చేసిన పని అది. ఇది ఇలా ఉంటే అకస్మాత్తుగా టాప్ పెర్ఫార్మర్ అయినా తన సహో ద్యోగిని తొలగించారనీ వాపోయాడు. అంతేకాద సేల్స్ ఫిగర్స్ కాస్త తక్కువగా ఉండటంతో అంచనాలను అందుకోలేదని వారు చెప్పారు. కానీ ఇక్కడ అసలు విషయం ఏమిటంటే తమను ప్రశ్నించిన వారిక ఇలాటి గతే పడుతుందని ఇతర ఉద్యోగులకు ఇది పరోక్ష హెచ్చరిక అని కమెంట్ చేశారు.కమీషన్ కాంట్రాక్ట్ ఒప్పందాలను ఉల్లంఘిండం లాంటి విషయాలపై ఎవరైనా ప్రశ్నిస్తే ఇదే గతి పడుతుందనే మెసేజ్‌ను డైరెక్ట్ మేనేజర్ ఇచ్చారని రెడిట్ పోస్టులో రాసుకొచ్చారు ఆ కంపెనీ ఉద్యోగి. ప్రస్తుతం ఇది ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment