top performers
-
ఈ కారణంతో టాప్ పెర్ఫార్మర్‌నే పీకేసిన కంపెనీ! ఇదేం చోద్యం అంటున్న నెటిజన్లు
కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు అవార్డులు, రివార్డులు, ప్రోత్సాహకాలు ఇవ్వడం, పనితీరు బాగా లేదు అనుకున్న వాళ్లని ఉద్యోగం నుంచి తొలగించడం చాలా కామన్. కానీ ఒక కంపెనీ మాత్రం ఉద్యోగులకు గుణపాఠం చెప్పే పేరుతో టాప్ పెర్ఫార్మర్‌నే ఉద్యోగంలోంచి తీసేసింది. దీనికి సంబంధించిన కథనం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. (నీతా అంబానీ అద్భుత గిఫ్ట్: మురిసిపోతున్న కాబోయే కోడలు) సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం రెడిట్ ఒక యూజర్ ఈ స్టోరీని షేర్ చేశాడు. కంపెనీలో బాగా పని చేసే టాప్ పెర్ఫార్మర్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ విషయాన్ని రెడిట్ యూజర్ పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. దీంతో ఇదెక్కడి చోద్యం రా బాబూ అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఉద్యోగులను భయపెట్టేందుకు బాగా పనిచేస్తున్న ఉద్యోగిని తీసివేయడం ఎంతవరకు సబబు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. (సినిమాలకు బ్రేక్: సమంతకు ఆర్థికంగా అన్ని కోట్లు నష్టమా?) అంతేకాదు కంపెనీకి సంబంధించి తర విషయాల గురించి కూడా చెప్పాడు. కార్మికుల కమీషన్లు దొంగిలించడం, కాంట్రాక్ట్ నిబంధనలను బేఖాతరు చేయడం, కనీసం వాష్‌రూంలో 5 నిమిషాల కంటే ఎక్కువ సమయం గడిపినా వేధించడం, నచ్చకపోతే తలుపు తెరిచి ఉందని చెప్పడం లాంటివి చాలా వరకు తగ్గాయంటూ వీటి తీవ్రతను చెప్పుకొచ్చాడు రెడిటర్ పోస్ట్‌లో తెలిపారు. టార్గెట్ రీచ్ అవ్వని కారణంగా తొలగిస్తామని బెదిరించారు. నిజానికి నానుంచి కమీషన్ తీసుకున్నందుకు చేసిన పని అది. ఇది ఇలా ఉంటే అకస్మాత్తుగా టాప్ పెర్ఫార్మర్ అయినా తన సహో ద్యోగిని తొలగించారనీ వాపోయాడు. అంతేకాద సేల్స్ ఫిగర్స్ కాస్త తక్కువగా ఉండటంతో అంచనాలను అందుకోలేదని వారు చెప్పారు. కానీ ఇక్కడ అసలు విషయం ఏమిటంటే తమను ప్రశ్నించిన వారిక ఇలాటి గతే పడుతుందని ఇతర ఉద్యోగులకు ఇది పరోక్ష హెచ్చరిక అని కమెంట్ చేశారు.కమీషన్ కాంట్రాక్ట్ ఒప్పందాలను ఉల్లంఘిండం లాంటి విషయాలపై ఎవరైనా ప్రశ్నిస్తే ఇదే గతి పడుతుందనే మెసేజ్‌ను డైరెక్ట్ మేనేజర్ ఇచ్చారని రెడిట్ పోస్టులో రాసుకొచ్చారు ఆ కంపెనీ ఉద్యోగి. ప్రస్తుతం ఇది ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ - వివరాలు
స్టాక్ మార్కెట్ ఈ రోజు ఆల్ టైమ్ హైలో నిలిచింది. నిఫ్టీ, సెన్సెక్స్ రెండూ సూచీలు కూడా 0.4 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఇంట్రాడేలో 19,400 మార్కుని చేరి కొత్త రికార్డుని సృష్టించింది. సెన్సెక్స్ 274 పాయింట్ల లాభంతో 65,479 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 66 పాయింట్ల లాభం వద్ద 19,389 పాయింట్ల వద్ద నిలిచింది. ఇందులో టెక్ సూచీలు 0.54 శాతం, ఐటీ సూచీలు 0.84 శాతం, హెల్త్ కేర్ సూచీలు 0.3 శాతం లాభపడ్డాయి. ఎక్కువ లాభం పొందిన జాబితాలో బజాజ్ ఫైనాన్స్, హీరో మోటోకార్ప్ ఉన్నాయి. నష్టపోయిన జాబితాలో ఐషర్ మోటార్స్, భారతి ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా ఉన్నాయి. మరిన్ని వివరాలు బిజినెస్ కన్సల్టెంట్ 'కారుణ్య రావ్' (Karunya Rao) మాటల్లో ఈ వీడియోలో చూడవచ్చు. -
ముకేష్ అంబానీ మరో ఎత్తుగడ..?
ముంబై: బిలియనీర్, రిలయన్స్ ఇండస్ట్నీస్ అధినేత ముఖేష్ అంబానీ తన వ్యాపార విస్తరణలో భాగంగా ముఖ్యమైన ఉద్యోగులను నిలబెట్టుకునేందుకు కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. కంపెనీలో మూడు సంవత్సరాల పాటు పనిచేసిన ప్రతిభ గల టాప్ వంద మంది ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించనున్నారు. సగటున రెండుకోట్ల జీతం తీసుకుంటున్నఉద్యోగులకు వారి వేతనాల్లో 10-15శాతం మేరకు సంస్థ షేర్ల రూపంలో అందించనున్నారు. లాంగ్-టర్మ్ ఇన్సెంటివ్ ప్లాన్ అని పేరు పెట్టిన ఈ పథకం ప్రకారం సగటున రూ .2 కోట్ల ఆదాయం ఉన్న ఉద్యోగులకు ఈ ప్రోత్సాహకాలు రిలయన్స్ అందించనుందని సంస్థకు చెందిన అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. దాదాపు 20-30 లక్షల విలువ చేసే షేర్లను ఆయా ఉద్యోగులకు ఎలాట్ చేయనుంది. దీనికి నిర్దేశించిన కాలపరిమితి మూడు సంవత్సరాలు పూర్తికాగానే ఈ ఎలాట్ మెంట్ ఉంటుంది. ఈ బోనస్ సంస్థలో టాప్ 100 ఉద్యోగులకోసమే మాత్రమే ఉద్దేశించబడిందనీ, ఇతర స్థాయిల్లో ఉద్యోగులకు ఇది అందుబాటులో ఉండకపోవచ్చని తెలిపారు. అయితే ఈ వార్తలపై రిలయన్స్ ఇంకా స్పందించాల్సి ఉంది. మరోవైపు ఈ వార్తలను ధృవీకరించిన సంస్థ ఉన్నతోద్యోగి ఎలాంటి షేర్లను కేటాయించాలి అనేది ఇంకా నిర్ణయించలేదని చెప్పారు. రిలయన్స్ లాంటి షేర్లను కేటాయిస్తామంటే ఎవరు మాత్రం కాదంటారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆయన వ్యాఖ్యానించారు. సంస్థ లాభాలను, సంపదను ఉద్యోగులకు పంచి ఇచ్చే సాంప్రదాయం రిలయన్స్ గ్రూపునకు కొత్త అని మరో ఆర్ఐఎల్ ఉద్యోగి వ్యాఖ్యానించారు. ఇది సంస్థ వ్యాపారవృద్ధికి దోహదపడుతుందన్నారు. కాగా సాధారణంగా ఐటీ, ఈ కామర్స్ రంగాల్లో ఈ పద్ధతి అమల్లో ఉంది. టాప్ లెవల్ ఉద్యోగుల రాజీనామాల నేపథ్యంలో ఇలాంటి నిర్ణయాలు వెలుగులోకి వస్తాయని మార్కెట్ వర్గాల భావిస్తున్నాయి. గత రెండేళ్లకాలంలో ఆర్ఐఎల్ ఉన్నతోద్యోగులు సంస్థకు రాజీనామా చేయడం ఈ పథకానికి దారి తీసి వుండొచ్చని అంచనా వేశారు.