
స్టాక్ మార్కెట్ ఈ రోజు ఆల్ టైమ్ హైలో నిలిచింది. నిఫ్టీ, సెన్సెక్స్ రెండూ సూచీలు కూడా 0.4 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఇంట్రాడేలో 19,400 మార్కుని చేరి కొత్త రికార్డుని సృష్టించింది. సెన్సెక్స్ 274 పాయింట్ల లాభంతో 65,479 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 66 పాయింట్ల లాభం వద్ద 19,389 పాయింట్ల వద్ద నిలిచింది.
ఇందులో టెక్ సూచీలు 0.54 శాతం, ఐటీ సూచీలు 0.84 శాతం, హెల్త్ కేర్ సూచీలు 0.3 శాతం లాభపడ్డాయి. ఎక్కువ లాభం పొందిన జాబితాలో బజాజ్ ఫైనాన్స్, హీరో మోటోకార్ప్ ఉన్నాయి. నష్టపోయిన జాబితాలో ఐషర్ మోటార్స్, భారతి ఎయిర్‌టెల్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా ఉన్నాయి. మరిన్ని వివరాలు బిజినెస్ కన్సల్టెంట్ 'కారుణ్య రావ్' (Karunya Rao) మాటల్లో ఈ వీడియోలో చూడవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment