Bad news for IT employees, major companies may reduce compensation due to… - Sakshi
Sakshi News home page

ఐటీ ఉద్యోగులకు బ్యాడ్‌ న్యూస్‌: మరింత గడ్డు కాలం? 

Published Mon, Jul 17 2023 8:47 AM

Bad news for IT employees major companies may reduce compensation - Sakshi

ఐటీ మేజర్‌ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పనిలో ఉద్యోగుల ప్రయోజనాలకు గండికొడుతున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పలు ఐటీ కంపెనీలు కొత్త ఉద్యోగుల నియామకాలను నిలిపివేశాయి. చాలామంది ఫ్రెషర్లను తొలగించాయి. ఇది చాలదన్నట్టు తాజాగా వేతనాల పెంపును వాయిదా వేస్తున్నాయి. అంతేకాదు ఉద్యోగుల వార్షిక వేతనాల్లో కోత విధించేందుకు యోచిస్తున్నాయని తాజా నివేదికల ప్రకారం తెలుస్తోంది. ఇది పరిశ్రమలో నెలకొన్న  గడ్డు పరిస్థితులను అద్దం పడుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు.  (వెకేషన్‌లో ఉన్న ఈ నటి ఎవరు, ఆ డ్రెస్‌ ఖరీదు ఎంతో తెలుసా?)


ఇండియాలో టాప్‌ శాలరీ అందుకుంటున్న ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరైన హెచ్‌సీఎల్‌టెక్  సీఈఓ సీ విజయకుమార్‌  ఐటి పరిశ్రమలో మాంద్యం భయం వాస్తవమనే ఆందోళన వ్యక్తం చేశారు. 2023-24 క్యూ1లో ఐటి దిగ్గజం లాభం, రాబడికి సంబంధించిన అంచనాలను మిస్‌ అయిన తర్వాత విజయ్‌కుమార్ ఎకనామిక్ టైమ్స్‌తో ఈ వ్యాఖ్యలు చేశారు. ఐటి మేజర్‌లు బలహీనమైన ఆదాయ అంచనాలు, ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగుల టర్నోవర్‌ను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నా యన్నారు. (నిజంగా భయంకరమే..! రేణూ దేశాయ్‌ అద్భుతమైన పిక్స్‌ వైరల్‌!)

జూన్ త్రైమాసికంలో  చెప్పుకోదగిన చెల్లింపుల కంటే తక్కువే అందిస్తోందనే అంచనాలను లైవ్‌మింట్ నివేదించింది.  జూన్ నెలాఖరు వరకు మూడు నెలల పాటు వేరియబుల్ వేతనం దాదాపు 60-80శాతం ఉంటుందని అంచనా వేస్తున్నట్లు  నివేదిక పేర్కొంది.

మనీకంట్రోల్ నివేదించిన ప్రకారం, ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ ఉద్యోగుల జీతాల పెంపును వాయిదా వేసింది. మరో సంస్థ విప్రో తొలి త్రైమాసికానికి ఉద్యోగుల వేరియబుల్ వేతనాన్ని 80శాతానికి పరిమితం చేసింది. అయితే ఇందులో టీసీఎస్‌  కాస్త బెటర్‌గా ఉందని. ఇటీవలి ఫలితాల తరువాత వేతన పెంపుదలలు సగటున 6-8 శాతం మధ్య  టాప్ పెర్ఫార్మర్‌లు 12-15 శాతం వరకు పొందుతున్నారని బిజినెస్ స్టాండర్డ్ నివేదించింది. అయితే కొత్త ఉద్యోగ నియామకాలు మాత్రం భారీగా 96 శాతం తగ్గిందని న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement