pay cuts
-
పపువా న్యూగినీలో అల్లర్లు..
పోర్ట్ మోర్స్బీ: పసిఫిక్ ద్వీప దేశం పపువా న్యూగినీ అల్లర్లతో అట్టుడుకుతోంది. వేతనాల్లో కోతకు నిరసనగా పోలీసులు సమ్మెకు దిగడంతో జనం దుకాణాలు, కార్లకు నిప్పుపెట్టారు. సూపర్మార్కెట్లను దోచుకున్నారు. ఇప్పటికే నిరుద్యోగం, అధిక ధరలు ఆకాశాన్నంటడంతో అసంతృప్తితో జనం రగిలిపోతున్నారు. బుధవారం పోలీ సులు, ఇతర విభాగాల ప్రభుత్వ ఉద్యోగులు పార్లమెంట్ ఎదుట నిరసనకు దిగారు. వేతనాల్లో 50 శాతం వరకు కోతపెట్టడాన్ని నిరసించారు. అయితే, కంప్యూటర్లో పొర పాటు కారణంగానే వేతనంలో కోత పడిన ట్లు ప్రధాని చెప్పారు. ఈ సమాధానంతో సంతృప్తి చెందని ఆందోళనకారులు పార్లమెంట్ భవనం లోపలికి చొచ్చుకెళ్లారు. ప్రధానమంత్రి కార్యాలయం ఆవరణలోని కారుకు నిప్పుపెట్టారు. గేటును విరగ్గొట్టారు. అనంతరం సాధారణ ప్రజానీకం వారికి తోడైంది. అందరూ కలిసి పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి యథేచ్ఛగా విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణల్లో రాజధానిలో 8 మంది, దేశంలోని రెండో అతిపెద్ద లే నగరంలో ఏడుగురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. రాజధాని పోర్ట్ మోర్స్బీలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అదనంగా బలగాలను రప్పించారు. 14 రోజుల పాటు ఎమర్జెన్సీ అమల్లో ఉంటుందని ప్రధానమంత్రి జేమ్స్ మరపీ ప్రకటించారు. బుధవారం సాయంత్రానికే పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నట్లు ప్రధాని చెప్పారు. సోషల్ మీడియా లో అసత్యాల ప్రచారమే పరిస్థితికి కారణ మని నిందించారు. పోలీసులు లేకపో వడంతో అవకాశవాదులు రెచ్చిపోయారన్నారు. -
ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్: మరింత గడ్డు కాలం?
ఐటీ మేజర్ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పనిలో ఉద్యోగుల ప్రయోజనాలకు గండికొడుతున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పలు ఐటీ కంపెనీలు కొత్త ఉద్యోగుల నియామకాలను నిలిపివేశాయి. చాలామంది ఫ్రెషర్లను తొలగించాయి. ఇది చాలదన్నట్టు తాజాగా వేతనాల పెంపును వాయిదా వేస్తున్నాయి. అంతేకాదు ఉద్యోగుల వార్షిక వేతనాల్లో కోత విధించేందుకు యోచిస్తున్నాయని తాజా నివేదికల ప్రకారం తెలుస్తోంది. ఇది పరిశ్రమలో నెలకొన్న గడ్డు పరిస్థితులను అద్దం పడుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు. (వెకేషన్లో ఉన్న ఈ నటి ఎవరు, ఆ డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?) ఇండియాలో టాప్ శాలరీ అందుకుంటున్న ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరైన హెచ్‌సీఎల్‌టెక్ సీఈఓ సీ విజయకుమార్ ఐటి పరిశ్రమలో మాంద్యం భయం వాస్తవమనే ఆందోళన వ్యక్తం చేశారు. 2023-24 క్యూ1లో ఐటి దిగ్గజం లాభం, రాబడికి సంబంధించిన అంచనాలను మిస్ అయిన తర్వాత విజయ్‌కుమార్ ఎకనామిక్ టైమ్స్‌తో ఈ వ్యాఖ్యలు చేశారు. ఐటి మేజర్లు బలహీనమైన ఆదాయ అంచనాలు, ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగుల టర్నోవర్‌ను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నా యన్నారు. (నిజంగా భయంకరమే..! రేణూ దేశాయ్ అద్భుతమైన పిక్స్ వైరల్!) జూన్ త్రైమాసికంలో చెప్పుకోదగిన చెల్లింపుల కంటే తక్కువే అందిస్తోందనే అంచనాలను లైవ్‌మింట్ నివేదించింది. జూన్ నెలాఖరు వరకు మూడు నెలల పాటు వేరియబుల్ వేతనం దాదాపు 60-80శాతం ఉంటుందని అంచనా వేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. మనీకంట్రోల్ నివేదించిన ప్రకారం, ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ ఉద్యోగుల జీతాల పెంపును వాయిదా వేసింది. మరో సంస్థ విప్రో తొలి త్రైమాసికానికి ఉద్యోగుల వేరియబుల్ వేతనాన్ని 80శాతానికి పరిమితం చేసింది. అయితే ఇందులో టీసీఎస్ కాస్త బెటర్‌గా ఉందని. ఇటీవలి ఫలితాల తరువాత వేతన పెంపుదలలు సగటున 6-8 శాతం మధ్య టాప్ పెర్ఫార్మర్లు 12-15 శాతం వరకు పొందుతున్నారని బిజినెస్ స్టాండర్డ్ నివేదించింది. అయితే కొత్త ఉద్యోగ నియామకాలు మాత్రం భారీగా 96 శాతం తగ్గిందని న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. -
వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి గూగుల్ షాకింగ్ న్యూస్!
ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగుల వేతనంలో కంపెనీలు కొంత మొత్తం కట్ చేసే అవకాశం ఉందా? అంటే అవును, అనే సమాధానం వినిపిస్తుంది. ఈ మహమ్మారికి ముందు కార్యాలయంలో పనిచేస్తున్న గూగుల్ ఉద్యోగులు శాశ్వతంగా ఇంటి నుంచి పనిచేయడానికి మారితే వేతనంలో కొతలు విధించే అవకాశం ఉన్నట్లు రాయిటర్స్ తెలిపింది. ఇప్పుడు ఈ విషయం గురుంచి సిలికాన్ వ్యాలీ అంతటా చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సంస్థలు తక్కువ ఖరీదైన ప్రాంతాలకు వెళ్ళే రిమోట్ ఉద్యోగులకు వేతనాన్ని తగ్గించాయి. ఆల్ఫాబెట్ ఇంక్ గూగుల్ ఉద్యోగులు ఉంటున్న లొకేషన్ ఆధారంగా జీతాలు నిర్ణయిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే, సంస్థ వారి ఉద్యోగుల లొకేషన్ ఎప్పటికప్పుడు ట్రాక్ చేసే అవకాశం ఉంది. "ఉద్యోగులకు చెల్లిస్తున్న ప్యాకేజీలు ఎల్లప్పుడూ స్థానం ఆధారంగా నిర్ణయించబడ్డాయి. ఒక ఉద్యోగి ఎక్కడ నుంచి పనిచేస్తాడో దాని ఆధారంగా మేము ఎల్లప్పుడూ స్థానిక మార్కెట్లో ఉన్న వారికంటే ఎక్కువ మొత్తం చెల్లిస్తున్నట్లు" గూగుల్ ప్రతినిధి తెలిపారు. వేతనం అనేది నగరం నుంచి నగరానికి, రాష్ట్రానికి భిన్నంగా ఉంటుంది. జూన్ లో ప్రారంభించిన కంపెనీ వర్క్ లొకేషన్ టూల్ అంచనాల ప్రకారం.. ఇంటి నుంచి పనిచేసే వారి వేతనంలో సుమారు 10 నుంచి 20 శాతం కోత విధించనున్నట్లు తెలుస్తుంది. -
వేతనాల కోతతో తీవ్ర పరిణామాలు
సాక్షి, న్యూఢిల్లీ : జీతాల కోత నిర్ణయంపై ఎయిరిండియా పైలట్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తమ జీతాలను భారీగా తగ్గించాలన్న ప్రభుత్వం నిర్ణయం తమ కుటుంబ సభ్యులపై వినాశకర ప్రభావాన్ని చూపించిందటూ సీనియర్ పైలట్లు ఆరోపించారు. ఈ మేరకు వారు కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి హర్దీప్ పూరీకి ఒక లేఖ రాశారు. కరోనా వైరస్, లాక్డౌన్ సంక్షోభంతో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించే ‘వందే భారత్ మిషన్’ కార్యక్రమంలో ఫ్రంట్లైన్లో సేవలందిస్తున్న 60 మంది పైలట్లు వైరస్ బారిన పడ్డారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పైలట్ల జీతం 75శాతం వరకు వేతనాన్ని తగ్గించే ప్రభుత్వ నిర్ణయం ఏకపక్షమైందని పైలట్లు ఆగ్రహం వక్తం చేశారు. ఈ అసంబద్ధమైన, వివక్షాపూరిత నిర్ణయం తీవ్ర మానసిక ప్రభావాన్ని పడేస్తుందని, ఇది చాలాసార్లు నిరూపితమైందని ఆరోపించారు. అంతేకాదు ఇది విపరీత చర్యలకు దారితీసే అవకాశం ఉందని సీనియర్ పైలట్లు హెచ్చరించారు. మరోవైపు ఎయిరిండియా ఇటీవల లీవ్ వితౌట్ పే పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఐదేళ్ల వరకు వేతనం లేకుండా కొంతమంది ఉద్యోగులను సెలవుపై పంపించాలని నిర్ణయించింది. (కరోనా: ఎయిరిండియా ఉద్యోగులకు చేదువార్త) వందేభారత్ మిషన్ ద్వారా ఎయిరిండియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా 7,73,000 మంది భారతీయులను తీసుకొచ్చినట్టు హర్దీప్ స్వయంగా ప్రకటించారు. ఈ నెల(జూలై)16న ఆయన మాట్లాడుతూ ఎయిరిండియా మనుగడ కొనసాగాలంటే లీవ్ వితౌట్ పే నిర్ణయం తప్పదంటూ సమర్ధించారు. ఒకవేళ ఎయిరిండియా మొత్తానికే మూతపడితే ఎవరికీ ఉద్యోగాలుండవని పేర్కొన్నారు. మిగులు సిబ్బంది అధికంగా ఉన్నారనీ, దీనికి తోడు శిక్షణ పొందిన వ్యక్తులు కూడా అందుబాటులో ఉన్నారని వ్యాఖ్యానించారు. (ఆ కథనంపై చలించిన సోనూసూద్) కాగా కరోనా నియంత్రణకు విధించిన లాక్డౌన్ ఆంక్షలతో దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రదానంగా దేశీయ విమానయాన సంస్థలు వేతన కోతలు, సిబ్బంది కోత లాంటి ఖర్చు తగ్గించే చర్యలను చేపట్టాయి. సుమారు 70 వేల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రభుత్వరంగ సంస్థ ఎయిరిండియాను విక్రయించడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. -
ఉద్యోగులకు షాక్ : టీవీఎస్‌లో వేతనాల కోత
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 ఎఫెక్ట్‌తో ఉద్యోగుల వేతనాల్లో కోతను విధిస్తున్నట్టు టీవీఎస్ మోటార్ కంపెనీ వెల్లడించింది. వేతన కోతను ప్రకటించిన దేశంలో తొలి టూవీలర్ బ్రాండ్ టీవీఎస్ కావడం గమనార్హం. కోవిడ్-19 కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో ఉత్పాదకత, అమ్మకాలు నిలిచిపోవడంతో ఉద్యోగులందరికీ ఈ ఏడాది మే నుంచి అక్టోబర్ వరకూ వేతనాలను తగ్గించాలని నిర్ణయించామని కంపెనీ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో అమ్మకాలు తీవ్రంగా పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించింది. ఉద్యోగులకు వేతనాలను బట్టి 5 నుంచి 20 శాతం వరకూ వేతన కోత విధించారు. ఆటోమొబైల్ సేల్స్ దారుణంగా పడిపోవడంతో ఇతర ఆటోమొబైల్ కంపెనీ ఉద్యోగుల్లోనూ వేతన గుబులు మొదలైంది. చదవండి : కేసీఆర్ తాతా కనికరించవా? -
కోవిడ్-19 : కోటక్ మహీంద్ర వేతనాల కోత
సాక్షి, ముంబై : కోవిడ్-19 మహమ్మారితో సంక్షోభంలో పడిన వివిధ వ్యాపార సంస్థలు ఉద్యోగులపై వేటు వేయడంతోపాటు, హై స్థాయి ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తున్నాయి. తాజాగా ప్రైవేటు రంగ బ్యాంకు కోటక్ మహీంద్రా బ్యాంకు వేతనాల కోతను ప్రకటించింది. సంవత్సరానికి రూ. 25 లక్షలకు పైగా సంపాదించే ఉద్యోగులకు 10 శాతం వేతన కోత నిర్ణయించింది. సంవత్సరానికి రూ. 25 లక్షల కంటే ఎక్కువ వేతనం ఆర్జిస్తున్న ఉద్యోగులందరికీ సీటీసీలో 10 శాతం తగ్గింపును నిర్ణయించామని, 2020,మే - 2021, మే నెల వరకు ఈ నిర్ణయం అమల్లో వుంటుందని బ్యాంకు ఒక నోటీసులో తెలిపింది. వ్యాపార స్థిరత్వం కోసం జీతాల రీకాలిబ్రేట్ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. బ్యాంకుకు చెందిన టాప్ మేనేజ్ మెంట్ 2020-21 సంవత్సరానికి తమ జీతాల్లో 15 శాతం కోతను స్వచ్ఛందంగా ప్రకటించిన కొన్ని వారాల తరువాత తాజా నిర్ణయం వెలుగులోకి వచ్చింది. (కరోనా : ఉబెర్ ఉద్యోగాల కోత) కరోనా వైరస్ విస్తృతి ప్రారంభంలో 2-3 నెలల విషయంగా కనిపించినా, క్రమేణా మహమ్మారిగా విజృంభించడంతో జీవితాలు, జీవనోపాధి రెండింటిపై తీవ్ర ప్రభావాన్ని చూపిందనీ, మరీ ముఖ్యంగా ఇప్పట్లో కనుమరుగయ్యే సూచనలేవీ లేవని స్పష్టంగా తెలుస్తుందని కోటక్ గ్రూప్ హెచ్ ఆర్ ముఖ్య అధికారి సుఖ్జిత్ ఎస్ పస్రిచా ఉద్యోగుల నోట్లో పేర్కొన్నారు. కాగా కోటక్ మహీంద్ర గ్రూపు పీఎం కేర్స్ పండ్ తో పాటు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. (విశాఖ గ్యాస్ లీకేజీపై ఎల్జీ కెమ్ స్పందన) -
కరోనా : ఇండిగో వేతనాల కోత
సాక్షి, ముంబై : కోవిడ్-19 (కరోనా వైరస్) ప్రకంపనలు పలు రంగాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా గ్లోబల్‌గా విమానయానరంగం మరింత కుదేలవుతోంది. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో డిమాండ్ పడిపోయి దాదాపు సగం విమానాలను ఖాళీగా ఎగురుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ విమాన యాన సంస్థ ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. విమాన సర్వీసులను నిలిపివేయడంతోపాటు, ఉద్యోగుల వేతనాల్లో కోత విధించనుంది. వివిధ స్థాయిలలో జీతం కోతలను ప్రకటిస్తూ ఉద్యోగులకు ఈ మెయిల్ సమాచారాన్ని అందించింది. ఇండిగో సీఈవో రణుంజోయ్ దత్తా తన వేతనంలో 25 శాతం , సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు, ఆపైన ఉద్యోగుల్లో 20 శాతం వేతన కోత వుంటుందని ఉద్యోగులకు రాసిన మెయిల్లో పేర్కొన్నారు. జీతాలలో అన్ని మార్పులు 2020 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తాయి. భారతదేశపు అతిపెద్ద క్యారియర్ ఇండిగో మొత్తం 260 విమానాలలో 16 విమానాలను నిలిపివేసింది. దేశీయ, అంతర్జాతీయ విమానాలపై కరోనావైరస్ ప్రభావంతో 10-20 శాతం జీతం కోత విధించుకోవాలని ఎయిర్‌లైన్స్ తన ఉద్యోగులను కోరుతోంది. స్వయంగా ఇండిగో సీఈవో రణుంజోయ్ దత్తా తన వేతనంలో 25 శాతం తగ్గించుకున్నట్టు ప్రకటించారు. ఆదాయాలు భారీగా క్షీణించాయి. విమానయాన పరిశ్రమ మనుగడ ఇప్పుడు ప్రమాదంలో ఉందని దత్తా వెల్లడించారు. కరోనా ప్రభావంతో విమానయాన రంగంలో ఆర్థిక వాతావరణం గణనీయంగా ప్రభావితమవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఏర్పడిందని వ్యాఖ్యానించారు. తాజా పరిణామంతో ఇండిగో ఉద్యోగులు సంక్షోభంలో పడిపోయారు. ఏవియేషన్ కన్సల్టెన్సీ సంస్థ సీఏపీఏ సమాచారం ప్రకారం ఇండిగో మొదట్లో 150 విమానాలను నిలిపి వేయనుంది. రాబోయే వారాల్లో ఈ సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు. ట్రాఫిక్ క్షీణత తీవ్రంగా కొనసాగితే, ఏప్రిల్ నాటికి మెజారిటీ విమానాలను నిలిపివేయవచ్చు. ఈ ప్రభావంవిమానయాన సిబ్బందిపై 30శాతం, 50 శాతం వరకు గ్రౌండ్ స్టాఫ్ మీద పడనుందని భావిస్తున్నారు. -
తప్పులు దొర్లాయి..ఫౌండర్స్ పూర్తి జీతం కోత
ముంబై: ఉద్యోగులను తొలగిస్తున్న వార్తలను ధృవీకరించిన దేశీయ ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ స్నాప్‌డీల్ వ్యవస్థాపకులు మరో సంచలన ప్రకటన చేశారు. ఫౌండర్స్ కునాల్ బహల్, రోహిత్ బన్సాల్ తమ జీతాలను వదులుకుంటున్నట్టు వెల్లడించారు. కంపెనీ వ్యూహాన్నిఅమలు చేయడంలో విఫలమయ్యామని అంగీకరించిన వీరివురు, తమ వేతనాలను 100శాతం కోతకు నిర్ణయించినట్టు చెప్పారు. బుధవారం స్నాప్‌డీల్ ఉద్యోగులకు రాసిన ఒక ఈ మెయిల్ లో ఈ విషయాన్ని వెల్లడించారు గత కొన్ని సంవత్సరాలుగా అద్భుతంగా సంస్థ పయనం కొనసాగినప్పటికీ..కొన్ని తప్పులు చేశామన్నారు. కచ్చితంగా ఈ కామర్స్ పరిశ్రమ, స్నాప్‌డీల్ ఇబ్బందుల్లో ఉందని తెలిపారు. అందుకే సంస్థను లాభాల బాట పట్టించేదుకు అటు ఉద్యోగాల కోత, ఇటు తమ వేతనాల కోత అని చెప్పారు. అయితే ఎంత కాలం అనేది మాత్రం స్పష్టం చేయలేదు. సరైన పునాది లేకుండా కంపెనీ వ్యూహం అమలులో లోపాన్ని ఒప్పుకుంటూనే, తమ వేతనాల్లో చెల్లింపులో కోత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా టీమ్ ను నియమించుకోవడంలో తప్పుదొర్లిందని పేర్కొన్నారు. అవసరమైనదానికంటే ఎక్కువమంది ఉద్యోగులనునియమించుకున్నట్టు చెప్పారు. మార్కెట్ సరిపోయే సరియైన ఆర్ధిక నమూనాతో వ్యాపారవృద్ధిని ప్రారంభించామన్నారు. లాభదాయమైన కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాం. ప్రస్తుత స్థాయి అవసరమమైన జట్టు మరియు సామర్థ్యాలనిర్మాణం ప్రారంభించామని ఈమెయిల్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టీమ్ పునర్నిర్మాణంపై దృష్టిపెట్టామని చెప్పారు. అందుకే ఉద్యోగలను తొలగించేందకు నిర్ణయించామనీ,ఈ కష్టాల నుంచి గట్టెక్కి కంపెనీని తిరుగులేని లాభదాయక సంస్థగా మార్చే తమ ప్రయత్నాలలో భాగమే ఈ కుదింపు అని చెప్పారు. అలాగే రెండేళ్లలో లాభాలను ఆర్జించే తొలి ఈ-కామర్స్ కంపెనీగా స్నాప్ డీల్ ను వృద్ధి చేయనున్నామన్నారు. అన్ని బిజినెస్ లలో ఈ వద్ధిని కొనసాగించడం తమకు ప్రధానమైన అంశంగా పేర్కొన్నారు.