తప్పులు దొర్లాయి..ఫౌండర్స్ పూర్తి జీతం కోత
ముంబై: ఉద్యోగులను తొలగిస్తున్న వార్తలను ధృవీకరించిన దేశీయ ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ స్నాప్డీల్ వ్యవస్థాపకులు మరో సంచలన ప్రకటన చేశారు. ఫౌండర్స్ కునాల్ బహల్, రోహిత్ బన్సాల్ తమ జీతాలను వదులుకుంటున్నట్టు వెల్లడించారు. కంపెనీ వ్యూహాన్నిఅమలు చేయడంలో విఫలమయ్యామని అంగీకరించిన వీరివురు, తమ వేతనాలను 100శాతం కోతకు నిర్ణయించినట్టు చెప్పారు. బుధవారం స్నాప్‌డీల్ ఉద్యోగులకు రాసిన ఒక ఈ మెయిల్ లో ఈ విషయాన్ని వెల్లడించారు గత కొన్ని సంవత్సరాలుగా అద్భుతంగా సంస్థ పయనం కొనసాగినప్పటికీ..కొన్ని తప్పులు చేశామన్నారు. కచ్చితంగా ఈ కామర్స్ పరిశ్రమ, స్నాప్‌డీల్ ఇబ్బందుల్లో ఉందని తెలిపారు. అందుకే సంస్థను లాభాల బాట పట్టించేదుకు అటు ఉద్యోగాల కోత, ఇటు తమ వేతనాల కోత అని చెప్పారు. అయితే ఎంత కాలం అనేది మాత్రం స్పష్టం చేయలేదు.
సరైన పునాది లేకుండా కంపెనీ వ్యూహం అమలులో లోపాన్ని ఒప్పుకుంటూనే, తమ వేతనాల్లో చెల్లింపులో కోత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా టీమ్ ను నియమించుకోవడంలో తప్పుదొర్లిందని పేర్కొన్నారు. అవసరమైనదానికంటే ఎక్కువమంది ఉద్యోగులనునియమించుకున్నట్టు చెప్పారు. మార్కెట్ సరిపోయే సరియైన ఆర్ధిక నమూనాతో వ్యాపారవృద్ధిని ప్రారంభించామన్నారు. లాభదాయమైన కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాం. ప్రస్తుత స్థాయి అవసరమమైన జట్టు మరియు సామర్థ్యాలనిర్మాణం ప్రారంభించామని ఈమెయిల్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టీమ్ పునర్నిర్మాణంపై దృష్టిపెట్టామని చెప్పారు. అందుకే ఉద్యోగలను తొలగించేందకు నిర్ణయించామనీ,ఈ కష్టాల నుంచి గట్టెక్కి కంపెనీని తిరుగులేని లాభదాయక సంస్థగా మార్చే తమ ప్రయత్నాలలో భాగమే ఈ కుదింపు అని చెప్పారు. అలాగే రెండేళ్లలో లాభాలను ఆర్జించే తొలి ఈ-కామర్స్ కంపెనీగా స్నాప్ డీల్ ను వృద్ధి చేయనున్నామన్నారు. అన్ని బిజినెస్ లలో ఈ వద్ధిని కొనసాగించడం తమకు ప్రధానమైన అంశంగా పేర్కొన్నారు.