Founders
-
ఇదీ ఇండియన్స్ సత్తా! ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్
Anand Mahindra Tweet: సోషల్ మీడియాలో చరుగ్గా ఉండే మహింద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహింద్రా విభిన్న అంశాలపై స్పందిస్తుంటారు. అధిక సంఖ్యలో ఉండే తన ఫాలోవర్లకు ఆయా అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటుంటారు. తాజాగా విదేశాల్లో భారతీయుల అభ్యున్నతికి సంబంధించిన అంశంపై స్పందించారు. అమెరికాలో బిలియన్ డాలర్ల కంపెనీలను స్థాపించిన విదేశీ వ్యక్తుల్లో భారతీయులే టాప్ లో ఉన్నారు. దీనికి సంబంధించిన గణాంకాలను ‘వల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్’ ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేయగా దాన్ని ట్యాగ్ చేస్తూ ‘ఆశ్చర్యపరిచే గణాంకాలు. ప్రవాస భారతీయులు తాము నివసిస్తున్న దేశాలకు ఎంత చేస్తున్నారో.. ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి’ అంటూ ట్వీట్ చేశారు. ఒక బిలియన్ డాలర్ అంత కంటే ఎక్కువ విలువైన అమెరికన్ కంపెనీలలో సగానికిపైగా విదేశాల్లో జన్మించి ఆ దేశానికి వలస వచ్చినవారే. వీరిలో భారత్ నుంచి వలస వెళ్లినవారే అత్యధికులు. విదేశీ వలసదారులు స్థాపించిన మొత్తం అమెరికన్ కంపెనీల్లో అత్యధికంగా భారతీయులు 66 కంపెనీలను స్థాపించారు. 54 కంపెనీలతో ఇజ్రాయిల్, 27 కంపెనీలతో యూకే ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. Astonishing figure. Demonstrates what value is brought by Indian Immigrants to a country of their adoption… https://t.co/TjcohqPsWP — anand mahindra (@anandmahindra) August 19, 2023 -
భార్యాభర్తలిద్దరికీ అదే సమస్య.. పరిష్కారం ఆలోచించి.. కంపెనీ పెట్టి..!
Traya Founders Success Story: ఉన్నత చదువులు చదివి సంపన్నులైన వ్యక్తుల గురించి, విదేశాలను వదిలి ఇండియా వచ్చి బాగా సంపాదించిన వ్యక్తులను గురించి మనం గతంలో చాలా కథనాల్లో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు నిజ జీవితంలో ఎదురైన సమస్యలను ఎదుర్కొని.. అలాంటి సమస్యలతో బాధపడేవారికి పరిష్కారం అందించడానికి మొదలెట్టిన వ్యాపారం వారిని కుబేరులను చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. త్రయ (Traya) సంస్థ ద్వారా సక్సెస్ సాధించిన 'సలోని ఆనంద్' & ఆమె భర్త 'అల్తాఫ్ సయ్యద్' ఇద్దరూ జుట్టు రాలడం సమస్యతో బాధపడ్డారు. అయితే ఈ సమస్యకు చక్కని పరిష్కారంగా సంపూర్ణ జుట్టు సంరక్షణ చేయాలని ఆలోచించి బిజినెస్ ప్రారంభించారు. త్రయ సంస్థ నిజానికి జుట్టు రాలడానికి ప్రధాన కారణం నీటి సమస్య, వాతావరణ కాలుష్యం మాత్రమే కాదు. శరీరంలో జరిగే కొన్ని అంతర్లీన సమస్యలు కూడా జుట్టు రాలడానికి కారణమవుతాయని గ్రహించి 2019లో త్రయను ప్రారంభించి, ఆయుర్వేద విధానంలో కారణాలను అన్వేషించి, మూలాలలో ఉండే సమస్యలను రూపుమాపడానికి ఉత్పత్తులు ప్రవేశపెట్టారు. (ఇదీ చదవండి: అట్లుంటది ముఖేష్ అంబానీ అంటే! ఆ కారు పెయింట్ ఖర్చు రూ. కోటి..) నిజానికి సలోని ఆనంద్ మొదటిసారిగా అల్తాఫ్‌ను హైదరాబాద్‌లో కలుసుకుంది. ఆ తరువాత 2017లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. సొంతంగా కంపెనీ ప్రారంభించడానికి ముందు హెల్త్‌కేర్ సంస్థ కాస్ట్లైట్లో మూడేళ్లపాటు పనిచేసింది సలోని. అప్పటికే మార్కెటింగ్‌లో ఎంబీఏ పట్టా కూడా పొందింది. (ఇదీ చదవండి: రూ. కోటి శాలరీ.. ప్రైవేట్ జెట్‌లో ప్రయాణం.. కుక్కను చూసుకుంటే!) ఇక అల్తాఫ్ విషయానికి వస్తే.. కంపెనీ ప్రారంభించడానికి ముందు ఫుడ్ డెలివరీ స్టార్ట్-అప్ బిల్ట్2కూక్ నడిపాడు. అంతేకంటే ముందు ఇతడు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ, గ్లాస్గో యూనివర్శిటీలో మెడికల్ బయోకెమిస్ట్రీలో సైన్స్ చదివాడు. సలోని ఆనంద్ పెళ్లి చేసుకున్న తరువాత త్రయ కంపెనీ స్థాపించి కోట్లు సంపాదిస్తున్నారు. -
అన్ఎకాడమీ ఫౌండర్స్ సంచలన నిర్ణయం
సాక్షి,ముంబై: ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్‌ల దగ్గర్నించి, దిగ్గజ కంపెనీలుగా దాకా ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగాల కోతకు నిర్ణయిస్తున్నాయి. ఇందులో ఎడ్యుటెక్ యూనికార్న్ అన్‌ఎకాడెమీ కూడా మినహాయింపేమీ కాదు. అయితే తాజాగా అన్‌ఎకాడెమీ ఫౌండర్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది(2024) ఏప్రిల్ వరకూ తమ వేతానల్లో కోత విధించుకుంటున్నట్టు కంపెనీ సీఈవో గౌరవ్ ముంజాల్ ప్రకటించారు. తొలగింపులను ప్రకటించిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం వెలుగులోకి వచ్చింది. (మళ్లీ ఉద్యోగాల కోత..12 నెలల్లో 1400మందిని తొలగించిన స్టార్టప్) వ్యవస్థాపకులతో సహా టాప్ లీడర్షిప్ జీతాల్లో ఈ కోత ఉండనుంది. తాల్లో కోత 25 శాతం వరకు ఉండవచ్చని అంచనా. ఈ తగ్గింపు వారి ప్రస్తుత జీతం, పరిధి , పనితీరుపై ఆధారపడి ఉంటుందని, తిరిగి ఏప్రిల్ 2024లో మాత్రమే సవరిస్తామని కంపెనీ వెల్లడించింది. కాగా వరుసగా నాలుగోసారి 12 శాతం ఉద్యోగులను తొలగిస్తున్నట్టు గురువారం ప్రకటించింది. (IPL 2023: ఆ క్రికెటర్‌కు లక్కీ చాన్స్, టియోగో ఈవీ ఓనర్లకు బంపర్ ఆఫర్లు) కాగా గత ఏడాది కాలంగా దాదాపు 1400 మందిఉద్యోగులకు ఉద్వాసన పలికింది. 2022లో పలు రౌండ్ల తొలగింపుల ద్వారా సిబ్బంది సంఖ్యను 1,350 తగ్గించకుంది. 2020-21ఆర్థిక సంవత్సరంలో సంస్థ నష్టాలు రూ. 1,537 కోట్ల నుండి సంవత్సరానికి (YoY) 85 శాతం పెరిగి రూ.2,848 కోట్లుగా ఉన్నాయి. ఆదాయం రూ.719 కోట్లుగా ఉంది. -
ఉద్యోగాల ఊచకోత: ఫౌండర్స్ ఆ పనిచేయొచ్చుగా? అష్నీర్ గ్రోవర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: భారత్‌పే సహ వ్యవస్థాపకుడు, మాజీ ఎండీ అష్నీర్ గ్రోవర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాల్లో కోత ఎందుకు? సుదీర్ఘ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని స్వయంగా ఫౌండర్స్ జీతాలు తగ్గించుకోవచ్చుగా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదాయాలు క్షీణత, ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులకు ఉద్వాసన పలికే బదులు ఫౌండర్లు తమ వేతనాల్లో కోత విధించుకోవచ్చు కదా ఆయన సూచించడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఉద్యోగులను తొలగించాల్సిన అవసరం లేకుండా, వ్యవస్థాపకుడిగా దీర్ఘకాలికంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఐటీ, సహా పలు రంగాలల్లో ఉద్యోగాల కోతపై స్పందించిన గ్రోవర్ ఈ కీలక వ్యఖ్యలు చేశారు. ప్రతీరోజు ఉద్యోగాలు కోల్పోతున్న వార్తలు వినడం విచారకరం. అదృష్టవశాత్తూ తాను అలాంటి చర్యలు తీసుకోకపోవడంపై సంతోషంగా ఉంది. నియామకాల విషయాల్లో జాగ్రత్తగా, శ్రద్ధగా ఉంటాం. అలాగే జాబ్స్ కట్లో ఫౌండర్స్‌గా దీర్ఘకాలికంగా ఆలోచించాల్సి ఉందంటూ తాజా లింక్డ్ఇన్ పోస్ట్‌లో గ్రోవర్ పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగాల తీసివేతకు ప్రత్యామ్నాయంగా తాను కొంతకాలం క్రితం 25-40 శాతం జీతం తగ్గించుకున్నా అని గుర్తు చేశారు. మిగిలిన, వ్యవస్థాపకులు ఈ మార్గంలో ఎందుకు ఆలోచించడం లేదో తనకు అర్థం కావడం లేదు. శక్తి, మూలధనం, సాంకేతికత, ప్రతిదానికీ ఉన్న ప్రాధాన్యత ఉద్యోగులకు ఎందుకు ఉండదు అంటూ ఆయన ప్రశ్నించారు. -
నైకా ఫల్గుణి సంచలనం: తగ్గేదేలే అంటున్న బిజినెస్ విమెన్
సాక్షి, ముంబై: ఫోర్బ్స్ 2022 భారతదేశపు 100 మంది సంపన్నుల జాబితాలో ఈ ఏడాది అనేక మంది కొత్త బిలియనీర్లు చోటు సంపాదించడం విశేషం. రూపాయి విలువ క్షీణత, ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఆందోళనలున్నప్పటికీ దేశం లోని టాప్-100 కుబేరుల సంపద అసాధారణంగా పెరిగిందని ఫోర్బ్స్ డేటా ద్వారా తెలుస్తోంది. ఫల్గుణి నాయర్: ముఖ్యంగా ఇటీవల ఐపీవోతోపాటు పలు సంచనాలకు మారు పేరు నైకా ఫౌండర్ ఫల్గుణి నాయర్ టాప్-50లో చోటు సంపాదించు కున్నారు. రూ. 32,951.71 కోట్లతో దేశంలోని అత్యంత ధనవంతుల స్వీయ-నిర్మిత బిలియనీర్‌గా ప్రశంస లందుకున్నారు. ఫోర్బ్స్ డేటా ప్రకారం 4.8 బిలియన్ల డాలర్ల నికర విలువతో ఫల్గుణి నాయర్ జాబితాలో 44వ స్థానంలో నిలిచారు. ఐఐఎం అహ్మదాబాద్ గ్రాడ్యుయేట్ నాయర్ 2012లో "మల్టీ-బ్రాండ్ ఓమ్నిచానెల్ బ్యూటీ-ఫోకస్డ్ రిటైల్ వ్యాపారాన్ని నిర్మించాలనే లక్క్ష్యంతో నైకాను స్థాపించారు. సావిత్రి జిందాల్: ఫోర్బ్స్ ప్రకారం ఓపీ జిందాల్ గ్రూప్ చైర్పర్సన్, సావిత్రి జిందాల్ టాప్-10లో ఉన్న ఏకైక మహిళా బిలియనీర్. 17.4 బిలియన్ డాలర్ల నికర విలువతో 72 ఏళ్ల సావిత్రి జిందాల్ ఈ సంవత్సరం జాబితాలో మొదటి పది మంది ధనవంతుల జాబితాలో ఉన్నారు. ఆమె భర్త ఓం ప్రకాష్ జిందాల్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత, గ్రూప్ బాధ్యతలను చేపట్టారు. ఈ దంపతుల నలుగురు కుమారుల స్వతంత్రంగా కంపెనీలను నిర్వహిస్తున్నారు. రేఖా ఝున్‌ఝున్‌వాలా: దివంగత పెట్టుబడిదారుడు రాకేష్ ఝన్‌ఝున్‌వాలా భార్య రేఖాఈ లిస్ట్‌లో 30వ స్థానంలో నిలిచి తన భర్తన స్థానాన్ని భర్తీ చేశారు. ఆమె నికర సంపద 5.9 బిలియన్ డాలర్లు. (ఫోర్బ్స్ టాప్ -10 లిస్ట్: బిలియనీర్లు అదానీ, అంబానీ ఎక్కడ?) నెహాల్ వకీల్: ఏసియన్ పెయింట్స్‌కు చెందిన నెహాల్ వకీల్ 0.52 బిలియన్ డాలర్లతో 46వ స్థానంలో నిలిచారు. తొలిసారి 2022 ఫోర్బ్స్ జాబితాలో ఎంట్రీ ఇచ్చారు. 1942లో స్థాపించిన ఏషియన్ పెయింట్స్ కంపెనీని నడుపుతున్న కుటుంబంలోని థర్డ్ జెనరేషన్ ప్రతినిధి నెహాల్. అంతేకాదు బోర్డులో ఉన్న ముఖ్య కుటుంబ సభ్యులలో నేహా ఒకరు. కిరణ్ మజుందార్-షా: బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్-షా 2.7 బిలియన్ డాలర్ల నికర సంపదతో భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళల్లో 76వ స్థానంలో నిలిచారు. 1978లో ఆదాయం ద్వారా భారతదేశంలో అతిపెద్ద లిస్టెడ్ బయోఫార్మాస్యూటికల్ సంస్థగా బయోకాన్ అవతరించింది. లీనా తివారీ: 3.7 బిలియన్ డాలర్ల నికర విలువతో, లీనా తివారీ ఈ సంవత్సరం అత్యంత సంపన్న భారతీయుల జాబితాలో 51వ ప్లేస్‌లో నిలిచారు. ఫార్మాస్యూటికల్ దిగ్గజం యూఎస్వీ ఇండియా ఛైర్‌పర్సన్‌గా, తివారీ 2018లో జర్మన్ జెనరిక్స్ సంస్థ జూటా ఫార్మాను కొనుగోలు చేశారు. అను అగా: 80 ఏళ్ల అను అగా తిరిగి మళ్లీ రిచెస్ట్ ఇండియన్స్ జాబితాలో చోటు సంపాదించారు. 1.9 బిలియన్ డాలర్ల నికర సంపదతో 88వ స్థానంలో నిలిచారు. థర్మాక్స్ అనే లిస్టెడ్ ఇంజనీరింగ్ సంస్థలో అగా మెజారిటీ వాటాను కలిగి ఉంది. అగా 1985లో తన జీవిత భాగస్వామి కంపెనీలో పని చేయడం ప్రారంభించారు. సుదీర్ఘం అనారోగ్యంతో భర్త మరణించడంతో 1996లో ఆమె కంపెనీ బాధ్యతలు చేపట్టారు. తరువాత కెమికల్ ఇంజనీర్ అయి అను కుమార్తె మెహెర్ బాధ్యతలు చేపట్టడంతో 2004లో అగా ఛైర్పర్సన్ పదవికి రాజీనామా చేసి సామాజిక కార్యకలాపాల్లో బిజీగా ఉన్నారు. అలాగే ఇండియన్ ఎత్నిక్ వేర్ తయారీదారు, మన్యవార్ బ్రాండ్‌కు ప్రసిద్ధి చెందిన వేదాంత్ ఫ్యాషన్స్ ఓనర్ రవి మోడీ 3.6 బిలియన్ డాలర్లతో ఫోర్బ్స్ లో చోటు సాధించారు. ఇంకా యూఎన్వో మిండా (గతంలో మిండా ఇండస్ట్రీస్) సీఎండీ నిర్మల్ మిండా మెట్రో బ్రాండ్లకు చెందిన రఫీక్ మాలిక్ జాబితాలో కొత్తగా ప్రవేశించిన వారిలో ఉన్నారు. -
SWAS NGO వ్యవస్థాపకుడు కరింగుల ప్రణయ్ కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
అక్షర దాతల గుర్తులు.. శిథిల సమాధులు!
సాక్షి, మచిలీపట్నం: విద్యాదాతలను గౌరవించడం అందరి బాధ్యత. వారి స్మారకాలను భవిష్యత్ తరాల కోసం పదిలంగా ఉంచడం మన కర్తవ్యం. అయితే దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి నేషనల్ కళాశాల వ్యవస్థాపకుల సమాధులకు పట్టిన గతి చూస్తే విద్యాదానం చేసిన వారిని ఏవిధంగా గౌరవిస్తున్నామో అర్థమవుతుంది. స్వాతంత్య్రోద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయమిది. 1906లో కోల్‌కత్తాలో నేషనల్ కాంగ్రెస్ జాతీయ సమావేశాలు జరిగాయి. ఆ సమావేశంలో ఉద్యమంలో ప్రజలను చైతన్యపర్చాలంటే దేశవ్యాప్తంగా విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని తీర్మానించారు. నేషనల్ కళాశాలల పేరిట వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ సమావేశాల్లో తీర్మానించడమే తరువాయి స్వాతంత్య్ర సమరయోధులు కోపెల్ల హనుమంతరావు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావు మచిలీపట్నంలో నేషనల్ కళాశాల ఏర్పాటు చేయాలని సంకల్పించారు. కృష్ణారావు తన 20 ఎకరాలను కళాశాల కోసం దానం చేయగా, దాంట్లో హనుమంతరావు, పట్టాభి సీతారామయ్య కలిసి 1907లో నేషనల్ కళాశాల నిర్మాణానికి పూనుకున్నారు. మూడేళ్ల పాటు శ్రమించి దాతల నుంచి విరాళాలు సేకరించి 1909 మార్చి 25న కళాశాల నిర్మాణాన్ని ప్రారంభించారు. 1910 మార్చి 27న ఆంధ్ర జాతీయ కళాశాలగా ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు కొండే వెంకట్రామయ్య పంతులుతో ప్రారంభింపజేశారు. 1910 నుంచి 1922 వరకు ఈ కళాశాలకు వ్యవస్థాపక ప్రిన్సిపాల్‌గా కోపెల్ల హనుమంతరావు వ్యవహరించారు. 1922లో ఆయన మరణించారు. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి నేషనల్ కళాశాల ఇదే. ఇక్కడ ప్రాథమిక స్థాయి నుంచి డిగ్రీ వరకు అనాడే విద్యను విస్తరించారు. నేషనల్ కళాశాల విద్యార్థి అంటే దేశంలోనే కాదు.. ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా ఒక గుర్తింపు, గౌరవం ఉండేది. అలాంటి కళాశాల నాటి వైభవాన్ని నేడు కోల్పోయిందనే చెప్పాలి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎయిడెడ్ విద్యా సంస్థలుగా గుర్తింపు పొందాయి. ప్రైమరీ, హైసూ్కల్, ఇంటర్, డిగ్రీ, అగ్రికల్చరల్ పాలిటెక్నిక్, బీఈడీ కళాశాలలు పనిచేస్తున్నాయి. ఒకప్పుడు వేలాది మంది విద్యార్థులకు విద్యా బోధన చేసిన ఈ ప్రతిష్టాత్మక కళాశాల నేడు ఐదారువందల మందికి మించి విద్యార్థుల్లేని పరిస్థితి. అయితే ఇంతటి విశిష్టత కలిగిన ఈ విద్యాలయాల వ్యవస్థాపకులైన కోపెల్ల హనుమంతరావు, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన సమా«ధులు నేడు అత్యంత దయనీయ స్థితిలో ఉన్నాయి. కళాశాల వెనుక భాగంలోనే హనుమంతరావుతో పాటు అతని కుటుంబ çసభ్యులందరి సమా«ధులున్నాయి. కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు బందరు వచ్చిన ప్రతిసారి ఈ సమా«ధులను దర్శించుకుని వెళ్తుంటారు. అలాంటి ఈ సమాధులు నేడు తుప్పల్లో శిథిలమై ఉన్నాయి. పైగా సమాధులు మందుబాబులకు నిలయంగా మారాయి. సమా«ధుల చుట్టూ ఎక్కడ పడితే అక్కడ మద్యం సీసాలు చెత్తాచెదారం చూడటానికే అత్యంత దయనీయంగా ఉంది అక్కడి పరిస్థితి. ఇప్పటికైనా కళాశాల యాజమాన్యం ఈ సమా«ధుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని బందరు వాసులు కోరుతున్నారు. -
ఇండిగో ఫౌండర్ల విభేదాలు : షేరు పతనం
సాక్షి,ముంబై : జెట్ ఎయిర్వేస్ సంక్షోభం వివాదం ఇంకా ఒక కొలిక్కిరాకముందే మరో దేశీ అతిపెద్ద విమానయాన సంస్థ ఇంటర్లో విభేదాలు భగ్గుమన్నాయి. ఇండిగో కో ఫౌండర్లు రాహుల్ భాటియా, రాకేష్ గంగ్వాల్ మధ్య ఆధిపత్య పోరుపై మార్కెట్ వర్గాల్లో వార్తలు గుప్పుమన్నాయి. విస్తరణ వ్యూహాలు, వాటాదారుల ఒప్పందం అంశాలపై ప్రమోటర్లిద్దరి మధ్యా తీవ్ర విభేదాల పొడసూపాయి. నిర్వహణ, నియంత్రణకు సంబంధించిన అంశంతోపాటు షేర్ హోల్డర్స్ ఒప్పందంలో కొన్ని క్లాజెస్ విషయంలో భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయట మరోవైపు జెట్ ఎయిర్వేస్ మూసివేసిన తరువాత ఇబ్బందుల్లో ఉన్న భారతీయ వైమానిక రంగానికి భారత్‌లో అతిపెద్ద ఎయిర్‌లైన్ మార్కెట్ కలిగిన ఇండిగో సంక్షోభం ప్రమాదకరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా గత ఏడాది కంపెనీ సీఈవోగా ఆదిత్య ఘోష్ నియామకం తర్వాతనుంచి వీరి మధ్య వ్యవహారం చెడినట్టు సమాచారం. కీలక ఎగ్జిక్యూటివ్‌ల నియామకాలతోపాటు నిర్వహణ స్థానాల్లోని ప్రవాస భారతీయుల నియామకాలపై విభేదాలున్నాయట. అంతేకాదు ఈ వ్యవహారం బహిర్గతం కాకమందే పరిష్కరించుకునే దిశగా జెఎస్‌ఏలా, ఖైతాన్ & కో సంస్థలను నియమించుకున్నారని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. వార్తలపై ఇండిగో ఫౌండర్లు రాహుల్, గంగ్వాల్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఈ వార్తలతో గురువారంనాటి మార్కెట్లో ఇండిగో షేరు 7శాతం పతనమైంది. మార్చి 31 నాటికి ఇండిగో మాతృ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్‌లో రాహుల్ భాటియాకు, 38 శాతం వాటా, గాంగ్వాల్‌కు 37 శాతం వాటా ఉంది. 2006 లో భాటియా, గాంగ్వాల్ ఇండిగోను స్థాపించారు, 2013లో కంపెనీ లిస్టింగ్ నాటికి ఇండిగోలో ప్రమోటర్లిద్దరూ 99 శాతం వాటాను కలిగి ఉన్నారు. కాగా సీఈఓగా ఆదిత్య ఘోష్ ఇండిగోను వీడిన ఎనిమిది నెలల తర్వాత ఈ ఏడాది జనవరిలో ఇండిగో సంస్థకు నూతన సీఈఓగా రొణొజాయ్ దత్తా నియమితులయ్యారు. -
షాకింగ్ నిర్ణయం : ఇన్స్టాగ్రామ్ ఫౌండర్స్ రాజీనామా
సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల్లో ఇన్స్టాగ్రామ్ కూడా ఇటీవల బాగా ప్రాచుర్యం పొందుతూ ఉంది. కొత్త కొత్త ఫీచర్లు రావడం, ఎక్కువ మంది సెలబ్రిటీలు దీన్ని వాడటం ఇన్‌స్టాగ్రామ్‌కు క్రేజీ పెరిగిపోతుంది. ఎనిమిదేళ్ల కింద లాంచ్ చేసిన ఈ ప్లాట్‌ఫామ్‌ను, ఆరేళ్ల కిందట సోషల్ మీడియా దిగ్గజంగా ఉన్న ఫేస్బుక్ సొంతం చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌ను ఫేస్బుక్ తన సొంతం చేసుకునేటప్పుడే, దాని స్వయం ప్రతిపత్తికి ఎలాంటి ఢోకా ఉండదని వాగ్దానం చేసింది. కానీ ఇటీవల ఇన్స్టాగ్రామ్ పూర్తిగా తన స్వేచ్ఛ కోల్పోతున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆ కంపెనీలో నెలకొన్న పరిణామం కూడా ఇదే సూచిస్తోంది. ఇన్స్టాగ్రామ్ సహ వ్యవస్థాపకులైన సీఈవో కెవిన్ సిస్ట్రోమ్, సీటీఓ మైక్ క్రెగర్లు కంపెనీని వీడుతున్నట్టు ప్రకటించారు. వారు ఎందుకు రాజీనామా చేస్తున్నారో స్పష్టత ఇవ్వకుండానే రాజీనామా లేఖను కంపెనీకి సమర్పించారు. మరికొన్ని వారాల్లో తాము కంపెనీని వీడనున్నట్టు ప్రకటించేశారు. ఇన్స్టాగ్రామ్ సహ వ్యవస్థాపకుల రాజీనామా, టెక్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇన్‌స్టాగ్రామ్‌కు, ఫేస్‌బుక్‌కు మధ్య నాయకత్వ విషయంలో విభేదాలు వచ్చినట్టు అందుకే, వీరు రాజీనామా చేసినట్టు ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇన్స్టాగ్రామ్ ప్రొడక్ట్ వైస్ ప్రెసిడెంట్ కెవిన్ వైల్ గత కొన్ని రోజుల క్రితమే ఫేస్బుక్ కొత్త బ్లాక్ చైన్ టీమ్‌కు బదిలీ అయ్యారు. జుకర్‌బర్గ్ ఇన్నర్ సర్కిల్‌లోకి వెళ్లిపోయారు. ఈ ఏడాది ఫేస్బుక్ సీఈవో జుకర్‌బర్గ్‌కు, సిస్ట్రోమ్కు పలుమార్లు విభేదాలు వచ్చాయని సంబంధిత వర్గాలు చెప్పాయి. ‘కెవిన్, మైక్ అద్భుతమైన ప్రొడక్ట్ లీడర్లు. ఇన్స్టాగ్రామ్ వారి సృజనాత్మక ప్రతిభనే. గత ఆరేళ్లలో వారి నుంచి చాలా నేర్చుకున్నాను. చాలా బాగా ఎంజాయ్ చేశాం. నేను వారికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. తర్వాత ఏం అభిృద్ధి చేయబోతున్నారో చూడాల్సి ఉంది’ అంటూ మార్గ్ జుకర్‌బర్గ్ స్టేట్మెంట్ ఇచ్చారు. వారి మధ్య గొడవలు, విభేదాలు ఉన్నట్టు జుకర్‌బర్గ్ ఎక్కడా బయటపడలేదు. అదేవిధంగా సిస్ట్రోమ్ కూడా స్పందించారు. తమ ఉత్సుకతను, సృజనాత్మకతను మరోసారి వెలికితీయాలని ప్లాన్ చేస్తున్నామని అన్నారు. కాగా, 715 మిలియన్ డాలర్లు పెట్టి, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ను కొనుగోలు చేసింది. -
ప్లేబాయ్’ హెఫ్నర్ కన్నుమూత
లాస్ఏంజెలిస్: ప్రముఖ మ్యాగజైన్ ‘ప్లేబాయ్’ వ్యవస్థాపకుడు హ్యూ హెఫ్నర్ మృతి చెందారు. గురువారం స్వగృహంలో హెఫ్నర్ కన్నుమూసినట్లు ప్లేబాయ్ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ‘ప్లేబాయ్ భవనంలో, 91 ఏళ్ల వయసులో, తన ఆత్మీయుల నడుమ, ప్రశాంతంగా తుదిశ్వాస విడిచారు’ అని వెల్లడించింది. 1926 ఏప్రిల్ 9న షికాగోలో జన్మించిన హెఫ్నర్.. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో (1944–1946 మధ్య) అమెరికా ఆర్మీకి సంబంధించిన పత్రికలో పనిచేశారు. 1949లో ఇలినాయి యూనివర్సిటీ నుంచి బీఏ సైకాలజీలో పట్టా పుచ్చుకున్నారు. తన వద్ద ఉన్న 600 డాలర్లతోపాటు తన తల్లి వద్ద మరో వెయ్యి డాలర్లు తీసుకుని 1953లో ప్లేబాయ్ మ్యాగజైన్‌ను హెఫ్నర్ ప్రారంభించారు. ప్రత్యేకంగా పురుషుల కోసం ఉన్నతస్థాయిలో మ్యాగజైన్ ఉండాలన్న సంకల్పంతో ప్లేబాయ్‌ని తెచ్చారు. అనతికాలంలోనే ప్రపంచంలోని గొప్ప బ్రాండ్లలో ఒకటిగా మ్యాగజైన్‌ను నిలిపారు. తొలి ఏడాది సెంటర్ఫోల్డ్లో ప్లేమేట్‌గా ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ మార్లిన్ మాన్రో ఫొటోను ప్రచురించారు. 2015లో మహిళల నగ్న చిత్రాలను ప్రచురించడాన్ని నిలిపివేశారు. 1960ల్లో చాలాచోట్ల నైట్ క్లబ్బులను ప్రారంభించారు. ప్లేబాయ్ మ్యాగజైన్ తొలి కవర్ గర్ల్, హాలీవుడ్ నటి మార్లిన్ మన్రో సమాధి పక్కనే హ్యూ హెఫ్నర్ను ఖననం చేయనున్నారు. 25 ఏళ్ల క్రితమే 75 వేల డాలర్లు వెచ్చించి మార్లిన్ మన్రో సమాధి పక్క స్థలాన్ని హెఫ్నర్ కొనుగోలు చేశారు. -
ఇన్ఫీలో అలజడి: షేర్లు ఢమాల్
బెంగళూరు: ఇన్ఫోసిస్ మరో సంచలనం చోటుచేసుకోబోతున్నట్టు రిపోర్టులు వస్తుండటంతో కంపెనీ షేర్లు కుప్పకూలాయి. నేటి ట్రేడింగ్ లో కంపెనీ షేర్లు 3.5 శాతం పైగా నష్టపోయాయి. ఇటీవల కంపెనీ వ్యవస్థాపకులకు, మేనేజ్ మెంట్ కు మధ్య తలెత్తిన వివాదాలతో ఇన్ఫీ సహ వ్యవస్థాపకులు పూర్తిగా తమ స్టేక్ ను అమ్మేయాలని నిర్ణయిస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు 28వేల కోట్ల విలువైన 12.75 శాతం స్టేక్ ను వారు అమ్మేయాలని యోచిస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయం బయటికి పొక్కగానే కంపెనీ షేరు 3.47 శాతం మేర పడిపోయింది. మే 5 తర్వాత ఇదే అత్యంత కనిష్ట స్థాయి. దీంతో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ కూడా 1 శాతం మేర కిందకి జారింది. నేటి మార్కెట్లో ఇన్ఫోసిస్ కంపెనీ షేర్లే టాప్ లూజర్లుగా కొనసాగుతున్నాయి. అయితే ఈ రిపోర్టులపై స్పందించిన ఇన్ఫీ వ్యవస్థాపకలు నారాయణమూర్తి, ఈ వార్తలను ఖండిస్తున్నారు. ప్రమోటర్స్ గ్రూప్ లో నారాయణమూర్తి, ఆయన కుటుంబసభ్యులకే అత్యధికంగా 3.44 శాతం స్టేక్ ఉంది. ఇన్ఫీలో అతిపెద్ద షేర్ హోల్డర్ గా కూడా ఆయనే ఉన్నారు. అయితే ఇంకా ప్రమోటర్స్ కానీ, ఇన్ఫోసిస్ కానీ ఈ విషయంపై స్పందించలేదు. గత కొంతకాలంగా ఇన్ఫోసిస్ లో బోర్డు సభ్యులకు, వ్యవస్థాపకులకు చోటుచేసుకున్న వివాదం తెలిసిందే. గత మూడేళ్లుగా కంపెనీ నడుస్తున్న తీరుపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. కార్పొరేట్ గవర్నెర్స్ పై బహిరంగంగానే పలుమార్లు బోర్డు సభ్యులకు చురకలు అంటించారు. అయినా కూడా బోర్డు సభ్యులు ఏ మాత్రం సమస్య లేదన్న రీతిలో వ్యవహరించడం ఈ పరిణామాలకు దారితీస్తోంది. -
తప్పులు దొర్లాయి..ఫౌండర్స్ పూర్తి జీతం కోత
ముంబై: ఉద్యోగులను తొలగిస్తున్న వార్తలను ధృవీకరించిన దేశీయ ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ స్నాప్‌డీల్ వ్యవస్థాపకులు మరో సంచలన ప్రకటన చేశారు. ఫౌండర్స్ కునాల్ బహల్, రోహిత్ బన్సాల్ తమ జీతాలను వదులుకుంటున్నట్టు వెల్లడించారు. కంపెనీ వ్యూహాన్నిఅమలు చేయడంలో విఫలమయ్యామని అంగీకరించిన వీరివురు, తమ వేతనాలను 100శాతం కోతకు నిర్ణయించినట్టు చెప్పారు. బుధవారం స్నాప్‌డీల్ ఉద్యోగులకు రాసిన ఒక ఈ మెయిల్ లో ఈ విషయాన్ని వెల్లడించారు గత కొన్ని సంవత్సరాలుగా అద్భుతంగా సంస్థ పయనం కొనసాగినప్పటికీ..కొన్ని తప్పులు చేశామన్నారు. కచ్చితంగా ఈ కామర్స్ పరిశ్రమ, స్నాప్‌డీల్ ఇబ్బందుల్లో ఉందని తెలిపారు. అందుకే సంస్థను లాభాల బాట పట్టించేదుకు అటు ఉద్యోగాల కోత, ఇటు తమ వేతనాల కోత అని చెప్పారు. అయితే ఎంత కాలం అనేది మాత్రం స్పష్టం చేయలేదు. సరైన పునాది లేకుండా కంపెనీ వ్యూహం అమలులో లోపాన్ని ఒప్పుకుంటూనే, తమ వేతనాల్లో చెల్లింపులో కోత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా టీమ్ ను నియమించుకోవడంలో తప్పుదొర్లిందని పేర్కొన్నారు. అవసరమైనదానికంటే ఎక్కువమంది ఉద్యోగులనునియమించుకున్నట్టు చెప్పారు. మార్కెట్ సరిపోయే సరియైన ఆర్ధిక నమూనాతో వ్యాపారవృద్ధిని ప్రారంభించామన్నారు. లాభదాయమైన కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాం. ప్రస్తుత స్థాయి అవసరమమైన జట్టు మరియు సామర్థ్యాలనిర్మాణం ప్రారంభించామని ఈమెయిల్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టీమ్ పునర్నిర్మాణంపై దృష్టిపెట్టామని చెప్పారు. అందుకే ఉద్యోగలను తొలగించేందకు నిర్ణయించామనీ,ఈ కష్టాల నుంచి గట్టెక్కి కంపెనీని తిరుగులేని లాభదాయక సంస్థగా మార్చే తమ ప్రయత్నాలలో భాగమే ఈ కుదింపు అని చెప్పారు. అలాగే రెండేళ్లలో లాభాలను ఆర్జించే తొలి ఈ-కామర్స్ కంపెనీగా స్నాప్ డీల్ ను వృద్ధి చేయనున్నామన్నారు. అన్ని బిజినెస్ లలో ఈ వద్ధిని కొనసాగించడం తమకు ప్రధానమైన అంశంగా పేర్కొన్నారు. -
ఎలాంటి విభేదాలు లేవు-ఇన్ఫీ ఛైర్మన్
ముంబై: ఇన్ఫోసిస్ సంస్థలో ఇటీవల చెలరేగిన విభేదాల నేపథ్యంలో ఎలాంటి సమస్యలు లేవని బోర్డ్ వివరణ ఇచ్చింది. వ్యవస్థాపకులకు బోర్డ్కుమధ్య ఎలాంటి విభేదాలు లేవని ఇన్ఫీ ఛైర్మన్ శేషపాయి స్పష్టం చేశారు. ముఖ్యంగా సంస్థ సీఈవో విశాల్ సిక్కా వేతనం సరియైనదేనని తెలిపారు. అలాగే బోర్డు పారదర్శకతకు, కార్పొరేట్ పాలనకు వచ్చిన ప్రమాదమేమీలేదని వివరణ ఇచ్చారు. అన్ని బోర్డు నిర్ణయాల మేరకు జరిగినట్టు తెలిపారు. ఇది బోర్డువార్ గా చూడొద్దని కోరారు. వ్యవస్థాపకులు వ్యక్తం చేసిన భిన్నాభిప్రాయాలు సంస్థ అభివృద్ధికోసం చేసినట్టుగా భావించాలన్నారు. ఈ సందర్భంగా తమకు అండగా నిలిచిన వాటాదారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సంస్థలో కార్పొరేట్ నైతికత కు పూర్తిగా కట్టుబడి ఉన్నట్టు హామీఇచ్చారు. ముఖ్యంగా పునీత సిన్హా, ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా ప్రహ్లాద్ నియామకాన్ని పూర్తిగా సమర్ధించుకున్నారు. ఒక మహిళ ప్రొఫెషన్ ను ఆమె జీవిత భాగస్వామి(జయంత్ సిన్హా) వృత్తి ఆధారంగా చూడడం సరియైంది కాదని వ్యాఖ్యానించారు. వారు పూర్తిగా అన్ని రకాల అర్హతలు కలిగి ఉన్నారని చెప్పారు. అలాగే ఈ నియామకాలను ఒక పద్ధతి ప్రకారమే జరిగినట్టు తెలిపారు. వారు బోర్డులో ఉండడం తమకు గర్వకారణం మన్నారు. తమకు పటిష్టమైన ఇంటర్నెల్ ఆడిట్ కమిటీ ఉందని చెప్పారు. ఈ మేరకు బోర్డులో నిర్ణయాలు కూడా తీసుకుంటామని చెప్పారు. ఆర్థిక వ్యవహారాల్లో గోల్డెన స్టాండర్డ్స్ ను పాటిస్తున్నామని తెలిపారు. అలాగే ప్రధానంగా సెవరెన్స్ ప్యాకేజీలపై వచ్చిన ఆరోపణలు బాధ కలిగించాయన్నారు. అయితే కెన్నడీ సహా అన్ని ప్యాకేజీలు కూడా సరియైనవేనని చెప్పుకొచ్చారు. ఇన్పోసిస్ లో నెలకొన్న సంక్షోభంపై నెలకొన్న ఆందోళన నేపథ్యంలో సోమవారం ముంబైలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన శేషసాయి ఈ వివరణ ఇచ్చారు. మరోవైపు ఈ సమావేశంలో పాల్గొన్న సీఈవో విశాల్ సిక్కా ఇన్ఫీలో నెలకొన్న ముసలంపై స్పందించారు. తమకు వ్యవస్థాపకులు నారాయణ మూర్తితో హృదయపూర్వక సంబంధాలు ఉన్నాయని విశాల్ సిక్కా పేర్కొన్నారు. ఇన్ఫోసిస్ బోర్డుకు, వ్యవస్థాపకులకు మధ్య విభేదాలు నెలకొన్నట్లు వస్తున్న వార్తలు సరికాదని , బోర్డులో చాలామంది డైరెక్టర్లతో మంచి సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని చెప్పారు. పటిష్టమైన పునాదితో ఇన్ఫోసిస్ కొనసాగుతోందని విశాల్ సిక్కా స్పష్టం చేశారు. -
మరోసారి వార్తల్లో సచిన్ అండ్ బిన్నీ
బెంగళూరు: ప్రత్యర్థి కంపెనీల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తూ వ్యాపారంలో దూసుకుపోతున్న ఫ్లిప్ కార్ట్ వ్యవస్థాపకులు మరోసారి వార్తల్లో నిలిచారు. సచిన్ బన్సాల్ , బిన్నీ బన్సాల్ ఇద్దరూ సంయుక్తంగా ఆసియన్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెల్చుకున్నారు. సింగపూర్ ఆధారిత వార్తాపత్రిక స్ట్రైట్స్ టైమ్స్ అందించే 'ద డిస్రప్టర్స్' (విచ్ఛిన్నకారులు) పేరుతో ఇచ్చే 'ఆసియన్ ఆఫ్ ది ఇయర్ 2016' కు ఎంపిక చేసింది. సంప్రదాయ వ్యాపార విధానానికి చెక్ పెట్టి, టెక్నాలజీ పరంగా దూసుకుపోతూ, లక్షలమంది వినియోగదారులను సొంతం చేసుకున్న కంపెనీలకు ఈ అవార్డుకు ఎంపిక చేస్తుంది. వరల్డ్ క్లాస్ ఇంటర్నెట్ కంపెనీ ద్వారా భారతీయులకు తాము అందిస్తున్న సరసమైన, అధిక నాణ్యత ఉత్పత్తులకు ఇది నిదర్శనమని ఫ్లిప్ కార్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. వినియోగదారుల సేవలో తమ నిబద్ధతను నిర్థారించిందని వ్యాఖ్యానించింది. కాగా 2014 లో ఈ అవార్డు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని వరించింది. -
మనవల కోసం ‘ఫండు’
ఆయనో రైతు. షేర్లు, మార్కెట్ల గురించి పెద్దగా తెలియదు. అందుకని నేరుగా షేర్లలో పెట్టుబడి పెట్టకపోయినా... ఆ షేర్లలో పెట్టుబడి పెట్టే మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకున్నాడు. ఓ అడ్వయిజర్‌ను విశ్వసించాడు. 18 ఏళ్ల కిందట రూ. 5వేలతో మొదలుపెట్టి... ఇప్పటికీ ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నాడు. ఆ మొత్తం ఎన్నో రెట్లు పెరిగింది. తక్కువ మొత్తాన్ని పెట్టుబడి పెడుతూ... దాన్ని వెనక్కి తీయకుండా మనవలకు ఆస్తిగా ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన చెబుతున్న ఇన్వెస్ట్మెంట్ స్టోరీ ఇది... నా పేరు ఎ.డి.రావు. మాది మహబూబ్‌నగర్ జిల్లా. రైతు కుటుంబం. నేనూ వ్యవసాయమే చేస్తుంటా. నాకు స్టాక్ మార్కెట్‌పై అంతగా అవగాహన లేదు. కాని మా బావమరిది వాళ్లంతా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారు. రైతును కావడంతో స్థిరమైన ఆదాయం లేదు. పంట ఎప్పుడు పండుతుందో... ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలియదు. పెపైచ్చు భారీ మొత్తాలు ఇన్వెస్ట్ చేసే ఓపిక కూడా లేదు. డబ్బులున్నప్పుడు మాత్రమే ఎంతోకొంత వెనకేసుకోవాలి. ఇలా ఆలోచిస్తున్న తరుణంలో మ్యూచువల్ ఫండ్స్ గురించి నాకు తెలిసింది. వీటికైతే షేర్లలాగా అంతగా ఆలోచించాల్సిన పనిలేదు. పెపైచ్చు చిన్న మొత్తాలు ఇన్వెస్ట్ చేయడానికి అనువుగా ఉంటాయి. అందుకే ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాను. తొలిసారి నేను 1995లో బిర్లాసన్లైఫ్-95 ఫండ్‌లో రూ.5,000 ఇన్వెస్ట్ చేశాను. ఆ మొత్తం ఇప్పటికీ వెనక్కి తీసుకోలేదు. ఈ 18 ఏళ్ళలో నేను ఇన్వెస్ట్ చేసిన రూ.5,000 కాస్త రూ.1,56,443కి చేరింది. ఆ ఫండ్‌పై వచ్చిన డివిడెండ్‌ను కూడా దాన్లోనే ఇన్వెస్ట్ చేయటం వల్ల ఆ మొత్తం లక్షన్నర దాటింది. 2008లో మార్కెట్లు గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు ఈ విలువ రూ.1.80 లక్షలు దాటింది. అప్పుడు వెనక్కి తీసుకోలేదు. అలా తీసుకోనందుకు, ఇప్పుడు విలువ తగ్గినందుకు నాకేమీ బాధ లేదు. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు సహజం. కానీ ఈ మధ్య మార్కెట్లో నెలకొంటున్న తీవ్ర ఒడిదుడుకులు చూస్తుంటే కొంచెం ఆందోళనగానే ఉంది. అయినా ఇప్పటికీ ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నాను. చేతిలో వెయ్యి లేదా రెండు వేలు ఉంటే చాలు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాను. పదేళ్లుగా హైదరాబాద్‌లోని మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ పి.సతీష్ సూచనలు తీసుకుంటున్నాను. కేవలం ఈక్విటీ ఫండ్స్పైనే దృష్టిపెట్టాను. వివిధ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా తగినంత పోర్ట్‌ఫోలియోను రూపొందించుకున్నాను. ఇప్పటివరకు ఇన్వెస్ట్ చేయడమే తప్ప ఒక్క పైసా కూడా వెనక్కి తీసుకోలేదు. ఈ మొత్తాన్ని నా మనవళ్లకి ఆస్తిగా అందించాలన్నదే నా ఆశ. దీర్ఘకాలం వేచి చూస్తే ఈక్విటీలను మించి లాభాలను అందించే పథకం ఇంకోటి లేదని బలంగా నమ్మే వాళ్ళలో నేను ముందుంటాను. అలాగే ఈక్విటీలు, షేర్లలో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ డబ్బులు ఉండాలని చాలామంది అపోహ పడతారు. చిన్న మొత్తాలతో కూడా సంపదను పోగేసుకోవచ్చనేది నా అభిప్రాయం. ఇన్వెస్టర్ స్టోరీ మీరు ఇన్వెస్టరా? మీరు మార్కెట్లో ఊహించని లాభాలు సంపాదించారా? లేక భారీ నష్టాలతో కుదేలయ్యారా? మంచో, చెడో... మీ కథ అందరికీ చెప్పాలనుకుంటున్నారా? మీ ఇన్వెస్ట్మెంట్ వివరాలను... ఫోటో, చిరునామాలతో మాకు పంపండి. చిరునామా: ప్రాఫిట్, సాక్షి తెలుగు దినపత్రిక 6-3-249/1, సాక్షి టవర్స్, రోడ్ నంబర్1, బంజారా హిల్స్ హైదరాబాద్-34 ఈ-మెయిల్: business@sakshi.com