మరోసారి వార్తల్లో సచిన్ అండ్ బిన్నీ | Flipkart founders named 'Asians of the Year' | Sakshi
Sakshi News home page

మరోసారి వార్తల్లో సచిన్ అండ్ బిన్నీ

Published Mon, Dec 5 2016 1:44 PM | Last Updated on Tue, Oct 16 2018 8:42 PM

మరోసారి వార్తల్లో సచిన్ అండ్ బిన్నీ - Sakshi

మరోసారి వార్తల్లో సచిన్ అండ్ బిన్నీ

 బెంగళూరు:  ప్రత్యర్థి కంపెనీల గుండెల్లో  రైళ్లు పరిగెట్టిస్తూ వ్యాపారంలో దూసుకుపోతున్న ఫ్లిప్ కార్ట్ వ్యవస్థాపకులు  మరోసారి వార్తల్లో నిలిచారు.  సచిన్ బన్సాల్ , బిన్నీ బన్సాల్  ఇద్దరూ సంయుక్తంగా ఆసియన్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డును   గెల్చుకున్నారు.  సింగపూర్ ఆధారిత వార్తాపత్రిక స్ట్రైట్స్ టైమ్స్ అందించే 'ద డిస్రప్టర్స్' (విచ్ఛిన్నకారులు)  పేరుతో ఇచ్చే 'ఆసియన్ ఆఫ్ ది ఇయర్ 2016' కు ఎంపిక చేసింది.  సంప్రదాయ వ్యాపార విధానానికి చెక్ పెట్టి,  టెక్నాలజీ పరంగా  దూసుకుపోతూ, లక్షలమంది వినియోగదారులను సొంతం చేసుకున్న కంపెనీలకు ఈ అవార్డుకు ఎంపిక చేస్తుంది. 

వరల్డ్ క్లాస్  ఇంటర్నెట్ కంపెనీ ద్వారా భారతీయులకు తాము అందిస్తున్న సరసమైన, అధిక నాణ్యత  ఉత్పత్తులకు ఇది నిదర్శనమని ఫ్లిప్ కార్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. వినియోగదారుల సేవలో తమ నిబద్ధతను నిర్థారించిందని వ్యాఖ్యానించింది.  

కాగా 2014 లో  ఈ అవార్డు  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని వరించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement