ఫ్లిప్ కార్ట్పై ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: నిర్మల
ఫ్లిప్ కార్ట్పై ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: నిర్మల
Published Wed, Oct 8 2014 7:08 PM | Last Updated on Tue, Mar 19 2019 6:59 PM
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ పై వచ్చిన ఫిర్యాదులను ప్రభుత్వం పరిశీలించనుందని కేంద్ర వాణిజ్యశాఖామంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. 'బిగ్ బిలియన్ డే' ఆఫర్ పేరుతో బంపర్ డిస్కౌంట్స్, హామీలతో వినియోగదారులను నిరుత్సాహానికి గురి చేయడంపై ఫ్లిప్ కార్ట్ యాజమాన్యం క్షమాపణలు చెప్పారు. మేము చాలా ఫిర్యాదులను సేకరించాం. వాటిని మేము పరిశీలిస్తున్నాం అని నిర్మలా సీతారామన్ తెలిపారు.
పండగల నేపథ్యంలో పెద్ద ఎత్తున్న డిస్కౌంట్లకు ఆఫర్ చేస్తున్న ఆన్ లైన్ బిజినెస్ కంపెనీల వ్యవహారాలపై నిఘాపెట్టాలని వాణిజ్యశాఖ మంత్రిత్వ శాఖకు కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ విజ్క్షప్తి చేసింది.
Advertisement