ఉద్యోగులపై వేటు వేస్తున్న స్నాప్డీల్
ఉద్యోగులపై వేటు వేస్తున్న స్నాప్డీల్
Published Wed, Feb 22 2017 1:30 PM | Last Updated on Fri, Sep 28 2018 3:31 PM
న్యూఢిల్లీ : దేశీయ ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ స్నాప్ డీల్ ఉద్యోగాల కోత పెడుతోంది. తమ ఈ-కామర్స్, లాజిస్టిక్స్, పేమెంట్స్ ఆపరేషన్లలో దాదాపు 600 మందిని స్నాప్ డీల్ తీసివేస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పారు. గత వారం నుంచే ఈ ప్రక్రియను స్నాప్ డీల్ ప్రారంభించిందని, మొత్తం 500 నుంచి 600 మందిని తీసివేసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. మరికొన్ని రోజుల్లోనే వీరిని తొలగించనున్నట్టు తెలుస్తోంది. రెండేళ్లలో లాభాలను ఆర్జించే తొలి ఈ-కామర్స్ కంపెనీగా తమ జర్నీ సాగుతుందని స్నాప్ డీల్ అధికార ప్రతినిధి చెప్పారు.
అన్ని బిజినెస్ లలో ఈ వద్ధిని కొనసాగించడం తమకు ప్రధానమైన అంశంగా పేర్కొన్నారు. కంపెనీలో ఇప్పటివరకు 8000 మంది ఉద్యోగులున్నారు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ నుంచి స్నాప్ డీల్ గట్టి పోటీని ఎదుర్కొంటోంది. ప్రెష్ క్యాపిటల్ ను ఆర్జించడానికి కూడా స్నాప్ డీల్ తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది. అయితే కంపెనీ నికర రెవెన్యూలు ఈ ఆర్థిక సంవత్సరంలో 3.5 సార్లు పైకి ఎగిశాయి. ఈ రెవెన్యూలతో స్నాప్ డీల్ దేశంలోనే లాభాలను ఆర్జించే తొలి ఈ-కామర్స్ కంపెనీగా పేరొందనున్నట్టు కంపెనీ అంచనావేస్తోంది.
Advertisement
Advertisement