రాష్ట్రంలో ఐటీ రంగం దినదినాభివృద్ధి చెందుతుందని ఆ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య శనివారం హైదరాబాద్లో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రక్రియ తదానంతరం నెలకొన్న పరిస్థితులు ఐటీ రంగంపై పడలేదని తెలిపారు. రాష్ట్రంలో ఏర్పాటుకు నూతన కంపెనీలు వస్తున్నాయని తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఐటీ ఉత్పత్తులు పెరిగాయన్నారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఐటీ ఇంకుబేషన్ సెంటర్ల పని తీరు బాగుందని మంత్రి పొన్నాల పేర్కొన్నారు.